Share News

ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలు

ABN , Publish Date - Jun 16 , 2026 | 05:20 PM

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి కూడా ఉన్నారు.

ఎల్ఓసీ సమీపంలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులకు గాయాలు
Grenade blast in Jammu and Kashmir

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లా నౌషేరే సెక్టార్ పరిధిలో గ్రనేడ్ పేలి నలుగురు సైనికులు గాయపడ్డారు. వీరిలో ఒక జూనియర్ కమిషన్డ్ అధికారి (JCO) కూడా ఉన్నారు. ఎల్ఓసీ వెంబడి కుమావోన్ రెజిమెంట్ యూనిట్‌కు చెందిన సైనికులు మంగళవారంనాడు రోజువారీ నిఘా, పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా మల్టీ మోడ్ గ్రనేడ్ పేలినట్టు అధికారులు ధ్రువీకరించారు. గాయపడిన జవాన్లను తక్షణమే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి చికిత్స జరుగుతోంది.


గత వారంలోనూ...

కాగా, జూన్ 9న ఇదే తరహా ఘటన జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా యురి సెక్టార్‌లో జరిగింది. ప్రమాదవశాత్తు ఒక హ్యాండ్ గ్రనేడ్ పేలిన ఈ ఘటనలో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. గత మే 19న రాజౌరి జిల్లాలో రెండు మోర్టార్ షెల్స్, ఒక హ్యాండ్ గ్రనేడ్‌ను భద్రతా సిబ్బంది కనిపెట్టి వాటిని నిర్వీర్యం చేశారు.


ఇవి కూడా చదవండి..

భవానీపూర్‌ ఫలితాలపై హైకోర్టులో మమతాబెనర్జీ పిటిషన్

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..

Updated Date - Jun 16 , 2026 | 05:25 PM