Share News

భర్తతో విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువతి మృతి.. ముస్సోరీ ఘటనలో మిస్టరీ..

ABN , Publish Date - Jun 16 , 2026 | 06:18 PM

ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె ముస్సోరీలోని హోమ్‌స్టే గదిలో విగతజీవిగా మారింది.

భర్తతో విహారయాత్రకు వెళ్లిన తెలుగు యువతి మృతి.. ముస్సోరీ ఘటనలో మిస్టరీ..
Telugu Techie Death

ఢిల్లీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న 27 ఏళ్ల రాధా గాయత్రి ముస్సోరీలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. భర్తతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఆమె ముస్సోరీలోని హోమ్‌స్టే గదిలో విగతజీవిగా మారారు. మృతురాలిని పి. రాధా గాయత్రిగా గుర్తించారు. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి సెలవులు గడిపేందుకు ఉత్తరాఖండ్‌లోని ముస్సోరీకి వెళ్లారు. రాధా గాయత్రి, శ్రీ చరణ్ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చెందిన వారు. వీరికి 2025 నవంబర్ 8న వివాహం జరిగింది (Delhi Techie Death).


గాయత్రి ఢిల్లీలో నివసిస్తూ గురుగ్రామ్‌లోని ఒక ఐటీ సంస్థలో పనిచేస్తున్నారు. ఆమె భర్త శ్రీచరణ్‌ పుణెలో ఐటీ‌ సంస్థలో పని చేస్తున్నారు. వీరిద్దరూ జూన్ 14 రాత్రి ముస్సోరీలోని కియానా హోమ్‌స్టేకు చేరుకున్నారు. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. వారిద్దరూ ఆ రాత్రి మద్యం సేవించి, తెల్లవారుజామున 3:30 గంటలకు నిద్రపోయారు. శ్రీచరణ్ ఉదయం నిద్రలేచి చూసేసరికి.. గాయత్రి నగ్నంగా, స్పృహ లేకుండా, నేలపై పడి ఉంది. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతోంది. హోమ్‌స్టే సిబ్బంది ముస్సోరీ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు 108 అంబులెన్స్‌తో కలిసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు (Mussoorie Homestay Death).


అంబులెన్స్‌ సిబ్బంది ఆమెను పరీక్షించి, మరణించినట్లు ధ్రువీకరించారు (Techie Found Dead). గాయత్రి మృతదేహం నేలపై బట్టలు లేకుండా పడి ఉందని, పరుపుపై ​​రక్తపు మరకలు కనిపించాయని, గదిలో రెండు ఖాళీ మద్యం సీసాలు, ఆహార పదార్థాలు లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

నీట్ రీ-ఎగ్జామ్‌కు ఇంత భద్రత ఎందుకు.. కేంద్రాన్ని ప్రశ్నించిన అన్నామలై..


సూచీలకు జోష్.. రెండో రోజూ కొనసాగిన లాభాలు..

Updated Date - Jun 16 , 2026 | 07:14 PM