Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Sep 11 , 2026 | 06:18 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Sep 11, 2026 07:55 IST

    అమరావతి: డీఎస్సీపై జగన్ విమర్శలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేసిన మంత్రి లోకేశ్

    • డీఎస్సీపై జగన్ విషం కక్కడం బాధాకరం: మంత్రి నారా లోకేశ్

    • డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా జగన్‌కు తెలుసా? : మంత్రి నారా లోకేశ్

    • వైసీపీ ఐదేళ్ల పాలనలో భర్తీ చేసిన టీచర్ పోస్టులు సున్నా: మంత్రి నారా లోకేశ్

    • చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీ పైనే చేశారు : మంత్రి నారా లోకేశ్

  • Sep 11, 2026 07:45 IST

    తూ గో జిల్లా కొవ్వూరు- పసివేదల మధ్య పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

    • పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

    • వారం రోజుల క్రితం ఇదే మార్గంలో పట్టాలు తప్పిన రైలు

  • Sep 11, 2026 07:30 IST

    హైదరాబాద్: 22ఏ భూ అంశంపై నేడు హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్

    • తెలంగాణ భవన్‌లో ఉదయం 10గంటలకు హరీశ్‌రావు పీపీటీ

    • హాజరుకానున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు

    • పీపీటీ తర్వాత 22ఏ బాధిత కుటుంబాలతో సమావేశంకానున్న హరీశ్‌రావు

  • Sep 11, 2026 07:15 IST

    రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పిల్లర్ నంబర్ 179 వద్ద అగ్నిప్రమాదం

    • నాయుడు కాలనీలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

    • అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆందోళనకు గురైన స్థానికులు

    • అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించిన అపార్ట్‌మెంట్ వాసులు

  • Sep 11, 2026 07:00 IST

    ఏలూరు: చింతలపూడి మండలం రేచర్ల సమీపంలో ప్రమాదం

    • గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన వ్యాన్

    • ప్రమాదంలో ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 11, 2026 06:45 IST

    నంద్యాల : జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌‌కు ప్రమాదం

    • 9వ గేటు ఐరన్ రోప్ తెగిపోవడంతో కిందకు పడిపోయిన గేటు

    • మూడో గేటు రోప్ వీల్స్ కూడా ధ్వంసమైనట్లు సమాచారం

    • నేడు మరమ్మతులు చేపట్టి, కొత్త రోప్ ఏర్పాటు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు

  • Sep 11, 2026 06:40 IST

    విశాఖ: నేటితో ముగియనున్న వార్డుల పునర్విభజన అభ్యంతరాల స్వీకరణ గడువు

    • ఇప్పటివరకూ GVMC వార్డుల పునర్విభజనపై 1,500 అభ్యంతరాలు

    • తూర్పు నియోజకవర్గం నుంచి 400, పశ్చిమ నియోజకవర్గం నుంచి 909 అభ్యంతరాల రాక

  • Sep 11, 2026 06:35 IST

    నేడు, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు

    • శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం

    • తెలంగాణపై అల్పపీడన ప్రభావం

    • నేటి నుంచి ఈ నెల 14 వరకూ వర్షాలు

    • హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం

  • Sep 11, 2026 06:30 IST

    నేడు ఉమెన్స్ టీ20 ఆసియా కప్‌ రెండో ఫైనల్‌

    • దుబాయ్‌లో రాత్రి 8 గంటలకు శ్రీలంక Vs పాకిస్థాన్‌

  • Sep 11, 2026 06:25 IST

    ఢిల్లీకి కర్ణాటక మాజీ సీఎం సిద్దరామయ్య

    • రాహుల్‌గాంధీతో సిద్దరామయ్య భేటీ

    • కర్ణాటక రాజకీయ పరిణామాలపై చర్చించనున్న నేతలు

  • Sep 11, 2026 06:20 IST

    రేపటి నుంచి ఢిల్లీలో బ్రిక్స్ సమ్మిట్‌

    • రెండు రోజులపాటు జరగనున్న బ్రిక్స్‌ సదస్సు

    • సదస్సుకు రానున్న 11 దేశాధినేతలు

    • బ్రిక్స్‌ సదస్సుతో 3 రోజులు ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

    • ఏడేళ్ల తర్వాత భారత్‌కు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌

  • Sep 11, 2026 06:18 IST

    ద్వారకాతిరుమలలో నేడు సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

    • అనివేటి మండపంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

  • Sep 11, 2026 06:17 IST

    నేడు సింహాచలంలో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

    • శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా వ్రతం

  • Sep 11, 2026 06:15 IST

    అమరావతి: 22 జిల్లాల్లో క్రిటికల్ కేర్ బ్లాక్‌లు

    • నేడు 10 CCBలు, 12 IPHLకు శ్రీకారం

    • విజయవాడ పాత GGHలో ప్రారంభించనున్న కేంద్రమంత్రి జేపీ నడ్డా, సీఎం చంద్రబాబు

    • 21 జిల్లాల్లో వర్చువల్‌గా ప్రారంభం

  • Sep 11, 2026 06:14 IST

    హైదరాబాద్‌: నేడు లోక్‌భవన్‌లో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

    • విగ్రహాలను పంపిణీ చేయనున్న గవర్నర్‌ శివప్రతాప్‌

  • Sep 11, 2026 06:13 IST

    నేడు తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం

    • 22A బాధితులతో మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు భేటీ

  • Sep 11, 2026 06:10 IST

    హైదరాబాద్: గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో వ్యక్తి దారుణ హత్య

    • స్థానికంగా ఉన్న హాస్టల్‌లో వంట మనిషిగా పనిచేస్తున్న శశిధర్‌

    • అదే హాస్టల్‌లో పనిచేస్తున్న ప్రమోద్‌ అనే వ్యక్తి శశిధర్‌పై కత్తితో దాడి

    • దాడిలో అక్కడికక్కడే మృతిచెందిన శశిధర్

    • మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలింపు

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Sep 11, 2026 06:07 IST

    అమరావతి: నేడు చంద్రబాబు అధ్యక్షతన రెండో రోజు కలెక్టర్ల సదస్సు

    • పాల్గొననున్న మంత్రులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు

    • ఇ-గవర్నెన్స్, ఫైళ్ల పరిష్కారం, RTGS, ప్రజా సమస్యలపై సమీక్ష

  • Sep 11, 2026 06:05 IST

    నేడు దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

    • పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్

  • Sep 11, 2026 06:03 IST

    నేడు ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ

    • కీలక రక్షణ ఒప్పందాలపై చర్చ

    • బ్రిక్స్ సదస్సుకు వస్తున్న పుతిన్

  • Sep 11, 2026 06:00 IST

    నేడు తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులు

    • CORE అర్బన్ రీజియన్ బిల్లు–2026 ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్

    • ప్రజా విశ్వాసం చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి శ్రీధర్ బాబు

    • మున్సిపాలిటీస్ నాలుగో సవరణ బిల్లు–2026పై అసెంబ్లీలో చర్చ