Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Jun 08 , 2026 | 05:46 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Jun 08, 2026 21:45 IST

    TG EAPCET కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

    • ఈనెల 19 నుంచి 28 వరకు సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌

    • ఈనెల 22 నుంచి 29 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు

    • జులై 4న తొలివిడత సీట్ల కేటాయింపు

    • జులై 5 నుంచి 7 వరకు కళాశాలల్లో రిపోర్టింగ్‌

    • జులై 10 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌

    • జులై 10-14 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, రిపోర్టింగ్‌

  • Jun 08, 2026 21:33 IST

    విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి

    • ప్రమాద ఘటన తీరని విషాదం మిగిల్చిందని ఎక్స్ వేదికగా పోస్ట్

    • బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా

  • Jun 08, 2026 21:24 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్‌ దిగ్భ్రాంతి

    • ప్రమాద ఘటనపై అధికారులను ఆరా తీసిన పవన్‌

    • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్‌

    • బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్‌ హామీ

    • రేపు బాధిత కుటుంబాలను పరామర్శించనున్న పవన్‌ కల్యాణ్‌

  • Jun 08, 2026 21:20 IST

    అమరావతి: పీసీబీ ల్యాబ్‌ రిపోర్టుపై డిప్యూటీ సీఎం పవన్‌ సమీక్ష

    • పరిమితి కంటే గోదావరిలో ఎక్కువ కాలుష్య కారకాల గుర్తింపు

    • ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు

    • నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశం

  • Jun 08, 2026 21:12 IST

    తెలంగాణ‌పై బీజేపీది దొంగ ప్రేమ: టీపీసీసీ చీఫ్‌ మహేశ్ గౌడ్‌

    • మహారాష్ట్రను సీఎం రేవంత్‌ సాయం కోరారా? అంటూ రాంచందర్‌రావు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు: మహేశ్ గౌడ్‌

    • కీలకమైన అంశంపై అనాలోచిత వ్యాఖ్యలు దారుణం: మహేశ్ గౌడ్‌

    • తెలంగాణ ప్రగతిపై బీజేపీ చిత్తశుద్ధి అర్థమవుతోంది: మహేశ్ గౌడ్‌

  • Jun 08, 2026 21:10 IST

    తిరుపతిలో రేపటి కూటమి నేతల సభ వాయిదా

    • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిర్ణయం

  • Jun 08, 2026 21:03 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

    • మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం

    • క్షతగాత్రులకు రూ.50 వేలు చొప్పున ఆర్థికసాయం

  • Jun 08, 2026 21:02 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదస్థలిని పరిశీలించిన కలెక్టర్‌ అభిషిక్త్‌ కిషోర్‌

    • స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంలో 8 మంది మృతి, ఆరుగురికి గాయాలు

    • కిమ్స్‌, సెవెన్ హిల్స్‌ ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స: కలెక్టర్‌

  • Jun 08, 2026 21:01 IST

    ఈనెల 10, 11న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

    • NDA సమావేశంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • 11న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటికి సీఎం

  • Jun 08, 2026 21:01 IST

    నల్గొండ: దేవరకొండ కనకదుర్గ కాలనీలో దారుణం

    • కుమారుడు ప్రణీత్‌రెడ్డిని హత్య చేసి తండ్రి లింగారెడ్డి ఆత్మహత్య

  • Jun 08, 2026 21:00 IST

    నంద్యాల: పార్టీలో కోవర్టులపై MLA భూమా అఖిలప్రియ ఫైర్‌

    • పార్టీ కోసం కష్టపడేవారికి ప్రాధాన్యం లభించట్లేదని అసంతృప్తి

    • సమీక్షా సమావేశంలో ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఆరోపణ

    • వివరాలతో పాటు అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తానన్న అఖిలప్రియ

    • పార్టీలో కోవర్టులను కార్యకర్తలు సహించరు: MLA అఖిలప్రియ

  • Jun 08, 2026 20:58 IST

    ములుగు: గోవిందరావుపేట మండలం కర్లపల్లిలో విషాదం

    • చెట్టుకు ఉరి వేసుకుని యువతీయువకుల ఆత్మహత్య

    • మృతులు మామిడితోపు వాసులు హిడ్మా, కమలిగా గుర్తింపు

  • Jun 08, 2026 20:43 IST

    విజయవాడ: గుడిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రా-తెలంగాణ బాడ్మింటన్ పోటీలు

    • ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్

    • విజేతలకు బహుమతులు అందజేసిన మంత్రి

  • Jun 08, 2026 20:38 IST

    హైదరాబాద్‌: పర్యాటక శాఖపై మంత్రి జూపల్లి సమీక్ష

    • తెలంగాణ టూరిజానికి కొత్త రూట్‌మ్యాప్ సిద్ధం: జూపల్లి

    • తొలిదశలో 8 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి: జూపల్లి

    • ప్రతి ప్రాంతానికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్: మంత్రి జూపల్లి

    • 27 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కార్యాచరణ: జూపల్లి

  • Jun 08, 2026 20:06 IST

    నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌ సమీక్ష

    • 2027 నాటికి పాలమూరు ప్రాజెక్టుల పూర్తి లక్ష్యం: ఉత్తమ్‌

    • భూసేకరణ, పునరావాస పనులు పూర్తిచేయాలి: ఉత్తమ్‌

    • పనితీరు సరిగాలేని కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు: ఉత్తమ్

  • Jun 08, 2026 19:47 IST

    హైదరాబాద్‌: TSRTCలో ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్న వ్యక్తి అరెస్ట్

    • ఉద్యోగాల పేరిట 48 మందిని బురిడీ కొట్టించిన వ్యక్తిని అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు

    • సుమారు రూ.21 లక్షల వరకు వసూలు చేసిన నిందితుడు

  • Jun 08, 2026 19:32 IST

    తెలంగాణ SEC సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

    • తెలంగాణలో ఈనెల 25 నుంచి SIR ప్రక్రియ: SEC

    • BLOలు, సూపర్‌వైజర్లకు భద్రత కల్పించాలి: SEC

    • BLOల వివరాలు స్థానికి పీఎస్‌లకు ఇవ్వాలి: SEC

  • Jun 08, 2026 19:10 IST

    సమ్మెకు పిలుపునిచ్చిన సింగరేణి గుర్తింపు సంఘం AITUC

    • సింగరేణి ఆఫీస్‌లో మేనేజ్‌మెంట్‌కు నాయకుల సమ్మె నోటీసులు

    • 31 డిమాండ్లతో సమ్మె నోటీసు ఇచ్చిన యూనియన్ నేతలు

  • Jun 08, 2026 18:55 IST

    స్టీల్‌ ప్లాంట్‌లో ప్రమాదంపై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఆరా

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలిన ఆదేశం

  • Jun 08, 2026 18:43 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై కేంద్రమంత్రి కుమారస్వామి ఆరా

    • అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న కేంద్రమంత్రి

  • Jun 08, 2026 18:39 IST

    హోర్ముజ్ సమీపంలో భారతీయులున్న కార్గో నౌకపై దాడి

    • దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులున్నట్టు సమాచారం

    • దాడిలో పలువురికి గాయాలు

    • అత్యవసర సాయం కోసం నౌకలోని సిబ్బంది అభ్యర్థన

  • Jun 08, 2026 17:55 IST

    హైదరాబాద్‌: మియాపూర్‌ బయల్దేరిన సీఎం రేవంత్‌రెడ్డి

    • కాసేపట్లో సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(CMC) భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న రేవంత్‌

    • రూ.1,674 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం

    • అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభ

  • Jun 08, 2026 17:45 IST

    విజయనగరం నుంచి విశాఖ బయల్దేరిన హోంమంత్రి అనిత

    • 8 మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం: ABNతో హోంమంత్రి

    • క్షతగాత్రులకు స్టీల్‌ ప్లాంట్‌ ఆస్పత్రిలో చికిత్స: ABNతో హోంమంత్రి

    • మరో అరగంటలో ప్రమాద ఘటనాస్థలికి సహాయక సిబ్బంది: అనిత

  • Jun 08, 2026 17:41 IST

    గల్ఫ్‌ దేశాలపై దాడులు ముగిస్తున్నట్లు ఇరాన్‌ ప్రకటన

    • దాడులను నిలిపివేసినట్లు వెల్లడించిన ఐఆర్‌జీసీ

    • ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గించే దిశగా కీలక ప్రకటన

    • లెబనాన్‌పై మళ్లీ దాడులు జరిగితే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిక

    • ఇజ్రాయెల్‌కు గట్టి సందేశం పంపిన ఇరాన్‌

  • Jun 08, 2026 17:41 IST

    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

    • ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడిన చంద్రబాబు

    • పలువురు కార్మికుల మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తంచేసిన సీఎం

    • అన్ని శాఖల సమన్వయంతో సహాయచర్యలు చేపట్టాలని ఆదేశం

    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు

  • Jun 08, 2026 17:30 IST

    మా హయాంలోనే సింగరేణికి రూ.4 వేల కోట్ల లాభం: మంత్రి వివేక్‌

    • BRS హయాంలో సింగరేణికి రూ.12 కోట్లకు మించి లాభం రాలేదు: మంత్రి

    • BRS నేతలు అసహనంతో మాట్లాడుతున్నారు: మంత్రి వివేక్‌

    • వాస్తవాలు తెలుసుకుని కేటీఆర్‌ మాట్లాడాలి: మంత్రి వివేక్‌

  • Jun 08, 2026 17:28 IST

    మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు

    • మహిళల ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: సీఎస్

    • మహిళా సంఘాలకు 553 ఆర్టీసీ బస్సులు: సీఎస్‌ రామకృష్ణారావు

    • రేపు సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా బస్సుల పంపిణీ: సీఎస్‌

  • Jun 08, 2026 17:20 IST

    విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ ప్రమాదం

    • మోల్టెన్‌ మెటల్‌ ల్యాడల్‌ నుంచి కుప్పకూలిన బకెట్లు

    • ద్రవ ఉక్కు పడటంతో కార్మికులు మృతిచెందినట్లు అనుమానం

    • ప్రమాదస్థలిలో 16 మంది వరకు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం

    పూర్తి కథనం

  • Jun 08, 2026 17:07 IST

    సంగారెడ్డి: సదాశివపేట మండలం మెలిగిరిపేట వద్ద మొసలి పిల్లల కలకలం

    • పశువుల కాపరుల కంటపడిన 20 మొసలి పిల్లలు

    • మొసలి గుడ్లు, పిల్లలను కల్పగూర్‌లోని మంజీరా అభయారణ్యానికి తరలింపు

  • Jun 08, 2026 16:53 IST

    ప.గో.: ఆచంట నియోజకవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం

    • నియోజకవర్గ పరిస్థితులపై కార్యకర్తలతో సీఎం చంద్రబాబు చర్చ

  • Jun 08, 2026 16:43 IST

    రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ: మంత్రి తుమ్మల

    • తెలంగాణ ఫర్టిలైజర్ యాప్‌నకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: తుమ్మల

    • ఫోన్‌, మీ సేవా కేంద్రాల ద్వారా కూడా బుకింగ్ అవకాశం: తుమ్మల

    • రైతుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు: మంత్రి తుమ్మల

    • డీలర్ల దగ్గర స్టాక్ వివరాలను ఫోన్‌లోనే తెలుసుకునే సౌకర్యం: తుమ్మల

    • ఎరువుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట వేశాం: తుమ్మల

  • Jun 08, 2026 16:42 IST

    PDS మాఫియాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్

    • స్టీమ్ రైస్ను సప్లై చేసే ఆలోచనలో ఉన్నాం: నాదెండ్ల మనోహర్

    • కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది: నాదెండ్ల మనోహర్

    • త్వరలోనే స్టీమ్ రైస్ సప్లై చేస్తాం: నాదెండ్ల మనోహర్

    • ముందుగా ఈ రైస్‍ను మధ్యాహ్న భోజనంలో పైలెట్ ప్రాజెక్ట్​గా అమలు పరుస్తాం: నాదెండ్ల మనోహర్

    • ఇప్పటివరకు PDS అక్రమ రవాణాపై 6A కేసులు 5,354 నమోదు చేశాం: నాదెండ్ల మనోహర్

  • Jun 08, 2026 16:38 IST

    చిత్తూరు: కలెక్టరేట్‌లో గ్రీవెన్స్‌కు వచ్చిన వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

    • ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం.. అడ్డుకున్న పోలీసులు

    • భూమిని అన్నదమ్ములు ఆక్రమించుకున్నారని వృద్ధ దంపతుల ఆవేదన

    • అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదన్న వి.కోట మండలానికి చెందిన రైతు రాఘవేంద్ర

  • Jun 08, 2026 16:37 IST

    వివేకా హత్య కేసులో CBI కోర్టు విచారణ

    • తదుపరి దర్యాప్తు చేయాలన్న సునీత పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన నిందితుల న్యాయవాదులు

    • వివేకా హత్య కేసులో ఇప్పటికే దర్యాప్తు పూర్తి చేశారని తదుపరి దర్యాప్తు అవసరం లేదని నిందితుల కౌంటర్

    • తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా

  • Jun 08, 2026 16:27 IST

    MSP ప్రకారమే కేంద్రం ధాన్యం సేకరణ: టీజీ బీజేపీ చీఫ్ రాంచందర్‌రావు

    • దేశంలో 104 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేంద్రం సేకరించింది: రాంచందర్‍రావు

    • తెలంగాణ నుంచే 56.31 లక్షల మెట్రిక్‌ టన్నులు సేకరించింది: ‍రాంచందర్‍రావు

    • కేంద్రం సేకరించిన ధాన్యంలో సగం తెలంగాణ నుంచే: రాంచందర్‌రావు

    • రాష్ట్ర ప్రభుత్వమే నెల రోజులు ఆలస్యంగా ధాన్యం సేకరించింది: రాంచందర్‍రావు

    • బీజేపీ, రైతుల ఆందోళనతోనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు: రాంచందర్‍రావు

    • ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: రాంచందర్‌రావు

  • Jun 08, 2026 16:14 IST

    ఇండియా కూటమి భేటీలో 5 కీలక నిర్ణయాలు

    • SIR, ఓట్ల లూటీ, ఎన్నికల అక్రమాలపై CJIకి లేఖ రాయాలని నిర్ణయం

    • నీట్, CBSE పరీక్షార్థులకు జరిగిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ HRD మంత్రి వెంటనే రాజీనామా చేయాలని ఏకగ్రీవ తీర్మానం

    • దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతులు సహా ఇతర సమస్యలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్

    • ప్రతి రెండు నెలలకోసారి ఇండియా కూటమి భేటీకావాలని నిర్ణయం.. ఆగస్టు 8న హైదరాబాద్‌లో ఇండియా కూటమి తదుపరి సమావేశం

    • పార్లమెంటు సమావేశాల సమయంలో ఖర్గే కార్యాలయంలో రోజూ ఉదయం సమావేశమై కార్యాచరణపై చర్చించాలని నిర్ణయం

  • Jun 08, 2026 16:08 IST

    పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు

    • ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య మళ్లీ తీవ్రస్థాయి దాడులు

    • ఇరాన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం అడ్వయిజరీ

    • తక్షణమే ఇరాన్‌ను వీడాలని భారత ఎంబసీ సూచన

  • Jun 08, 2026 15:58 IST

    రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

    • ఎల్లుండి ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌

    • మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం

    • త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం

  • Jun 08, 2026 15:51 IST

    సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను వక్రీకరించడం సరికాదు: శ్రీధర్‌బాబు

    • హిట్లర్‌ అనే పదాన్ని సీఎం వాడిన సందర్భం వేరు: మంత్రి శ్రీధర్‌బాబు

    • ఏ పని అయినా ఉక్కు సంకల్పంతో చేసేవారిని హిట్లర్‌ అనే నానుడి ఉంది: శ్రీధర్‌బాబు

    • BRS నేతల తీరు గురివింద గింజ సామెతలా ఉంది: శ్రీధర్‌బాబు

    • చట్టం పరిధిలో హైడ్రా పనిచేస్తోంది: మంత్రి శ్రీధర్‌బాబు

  • Jun 08, 2026 15:45 IST

    కృష్ణా జిల్లా: ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు బెదరింపు కాల్స్

    • 'నన్ను జైలుకు పంపావు.. చంపేస్తా' అంటూ భాస్కర్ రెడ్డి పేరుతో ఫోన్

    • ఎమ్మెల్యే బోడె ప్రసాద్ స్వయంగా పోలీస్‌ స్టేషన్‌‌కు వెళ్లి ఫిర్యాదు

  • Jun 08, 2026 15:37 IST

    భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

    • 719 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్

    • 244 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ

  • Jun 08, 2026 15:35 IST

    ఖమ్మం: కాకర్లపల్లి పరిధి తామరచెరువు దగ్గర ఉద్రిక్తత

    • అటవీ అధికారులు, గిరిజనుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట

    • గిరిజనులు పోడు సాగు చేస్తున్న 10.5 హెక్టార్ల భూమి తమదేనంటున్న ఫారెస్ట్‌ అధికారులు

    • పరిశీలనకు వచ్చిన అధికారులను అడ్డుకున్న గిరిజనులు

  • Jun 08, 2026 15:35 IST

    తెలంగాణ రెవెన్యూ శాఖలో భూ మాఫియా కలకలం

    • హౌసింగ్ బోర్డు భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు

    • పరిశీలనలో బయటపడిన డిప్యూటీ కలెక్టర్‌ అక్రమాలు

    • భూ మాఫియాపై మంత్రి పొంగులేటి ఆగ్రహం

    • డిప్యూటీ కలెక్టర్‌ రామునాయక్‍పై సస్పెన్షన్‌ వేటు

    • రామునాయక్‌పై 2016 నుంచి పలు కేసులు

  • Jun 08, 2026 15:32 IST

    నంద్యాల: గ్రూపు రాజకీయాలు కడితే పతనం తప్పదు: మంత్రి పయ్యావుల

    • కార్యకర్తలు, నేతలు ఎవరైనా అలకలు వీడాలి: పయ్యావుల

    • సమస్యలు ఉంటే కొట్లాడి పరిష్కరించుకోవాలి: పయ్యావుల

    • రాయలసీమ రాజకీయాల్లో అప్రమత్తత అవసరం: పయ్యావుల

    • గొడ్డలి పార్టీపై నిరంతర పోరాటం చేయాలి: పయ్యావుల

  • Jun 08, 2026 15:27 IST

    విశాఖపట్నం: చురుకుగా కదులుతున్న నైరుతి రుతు పవనాలు

    • ప్రస్తుతం కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఏపీలో రాయలసీమ, తమిళనాడు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో విస్తరణ

    • ఈ రోజు పల్నాడు, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, అనంతపూర్, కడప, సత్య సాయి జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం

    • తెలంగాణలోనూ పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురిసే ఛాన్స్

  • Jun 08, 2026 15:25 IST

    వైభవ్‌పై అంచనాలు పెంచుకోవద్దు: గంగూలీ

    • భారత టీ20 జట్టుకు ఎంపికైన వైభవ్ సూర్యవంశీపై గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు

    • వైభవ్‌ అద్భుతాలు చేస్తాడని ఆశించకండి: గంగూలీ

    • విదేశీ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అంత సులువేమీ కాదు: గంగూలీ

  • Jun 08, 2026 15:17 IST

    అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు: టీమిండియా ఘన విజయం

    • అఫ్గానిస్థాన్‌పై 300 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం

    • ఫాలోఆన్‌లో 112 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్

    • టెస్టుల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం కావడం విశేషం

  • Jun 08, 2026 15:02 IST

    దేశంలో ఇంధన నిల్వలకు ఢోకా లేదు: కేంద్రమంత్రి హర్దీప్‌సింగ్‌ పురీ

    • మరో 76 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు: హర్దీప్‌సింగ్‌ పురీ

  • Jun 08, 2026 14:55 IST

    తుమ్మడిహెట్టికి మహారాష్ట్ర అంగీకరించినా BRS పట్టించుకోలేదు: యెన్నం శ్రీనివాసరెడ్డి

    • అప్పట్లో మహారాష్ట్ర గవర్నర్‌గా తెలంగాణ నేత విద్యాసాగర్‌రావు ఉన్నా BRS ఉపయోగించుకోలేదు: యెన్నం

    • పాలమూరు-రంగారెడ్డిపై BRS గోబెల్స్‌ ప్రచారం: ప్రభుత్వ విప్‌ యెన్నం

    • 90 శాతం పనులు పూర్తయినట్లు అసత్య ప్రచారం: యెన్నం

    • BRS లాంటి ప్రతిపక్షాన్ని ఎప్పుడూ చూడలేదు: యెన్నం

  • Jun 08, 2026 14:43 IST

    పెళ్లికి ముందు లైంగిక సంబంధాలపై సుప్రీం కీలక తీర్పు

    • పెళ్లికి ముందు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం ఉంటే క్యారెక్టర్‌ను తప్పుపట్టలేం: సుప్రీం

    • ప్రేమించిన ప్రతి బంధం పెళ్లి వరకు వెళ్లకపోవచ్చు: సుప్రీం

    • వివాహం చేసుకోలేదన్న కారణంతో ఒకరిని మరొకరు మోసం చేసినట్లు కాదు: సుప్రీంకోర్టు

  • Jun 08, 2026 14:30 IST

    ఇండియా కూటమి ఐక్యతను బలోపేతం చేయాలి: మల్లికార్జున్ ఖర్గే

    • డీలిమిటేషన్ బిల్లులను ఐక్యంగా అడ్డుకున్నాం: ఖర్గే

    • మోదీ పాలనతో దేశం సమస్యల్లో ఉంది: AICC చీఫ్ ఖర్గే

    • రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి: ఖర్గే

  • Jun 08, 2026 14:28 IST

    భారత్‌తో ఏకైక టెస్టు: టీ బ్రేక్.. ఫాలోఆన్‌లో అఫ్గాన్ స్కోర్ 98/5

    • భారీ విజయం దిశగా టీమిండియా

    • రెండో ఇన్నింగ్స్‌లో అఫ్గాన్ 152 పరుగులకే ఆలౌట్

    • దీంతో అఫ్గాన్‌తో ఫాలోఆన్ ఆడిస్తున్న భారత్

    • ఇంకా 314 పరుగుల వెనుకంజలో ఉన్న అఫ్గానిస్థాన్

  • Jun 08, 2026 14:15 IST

    ఢిల్లీ: మమతా బెనర్జీకి బిగ్‌ షాక్‌

    • కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ నివాసంలో బెంగాల్ సీఎం సువేందుతో TMC ఎంపీల భేటీ

    • ఆపరేషన్ బెంగాల్‌లో పాల్గొన్న బీజేపీ ఎంపీ సీఎం రమేశ్

    • రెండు రోజుల్లో స్పీకర్ ఓం బిర్లాను కలవనున్న TMC ఎంపీలు

  • Jun 08, 2026 13:55 IST

    హైదరాబాద్ HFAST బృందం భారీ ఆపరేషన్

    • 120 టన్నుల చికెన్ వ్యర్థాలు తరలిస్తున్న 9 లారీల పట్టివేత

    • అంబర్‌పేట్, అత్తాపూర్, కూకట్‌పల్లి, పెద్దఅంబర్‌పేట దగ్గర లారీలను పట్టుకున్న పోలీసులు

    • చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేస్తున్న నిందితులు

  • Jun 08, 2026 13:55 IST

    ఇండియా కూటమి ఐక్యతను బలోపేతం చేయాలి: AICC చీఫ్ ఖర్గే

    • డీలిమిటేషన్ బిల్లులను ఐక్యంగా అడ్డుకున్నాం: AICC చీఫ్ ఖర్గే

    • మోదీ పాలనతో దేశం సమస్యల్లో ఉంది: ఖర్గే

    • రాజ్యాంగంపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి: ఖర్గే

    • బీజేపీయేతర రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపుతోంది: AICC చీఫ్ ఖర్గే

  • Jun 08, 2026 13:53 IST

    చెన్నై: ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం

    • నార్వే చెస్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద

    • రూ. 50 లక్షల నగదు పురస్కారం అందజేత

    • ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడిన సీఎం విజయ్

  • Jun 08, 2026 13:35 IST

    భూ సమస్యల పరిష్కారం కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీ: సీఎం చంద్రబాబు

    • QR కోడ్‌తో రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాల జారీ: సీఎం చంద్రబాబు

    • ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు..

    • రీసర్వేలో E-KYC పెట్టి రైతులను భాగస్వాములను చేశాం: సీఎం చంద్రబాబు

    పూర్తి కథనం..

  • Jun 08, 2026 13:08 IST

    ఇరాన్-అమెరికా దాడులతో పశ్చిమాసియాలో మళ్లీ భీకర పరిస్థితులు

    • ఇరాన్‌ను తక్షణమే వీడాలని భారతీయులకు టెహ్రాన్‌లోని ఎంబసీ అడ్వైజరీ

  • Jun 08, 2026 13:06 IST

    నెల్లూరు జిల్లా వింజమూరులో విషాదం..

    • విద్యుత్ షాక్‌తో14 ఏళ్ల మహీదర్ రెడ్డి మృతి

    • డ్రిల్లింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్

    • బాలుడి మృతితో కుటుంబంలో విషాదఛాయలు

  • Jun 08, 2026 12:55 IST

    నాంపల్లి: రాత్రి 9గంటల నుంచి చేప మందు ప్రసాదం పంపిణీ: సీపీ సజ్జనార్

    • ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం: సీపీ సజ్జనార్

    • నాంపల్లి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశాం: సీపీ

    • అందరికీ సరిపడా చేప ప్రసాదం అందుబాటులో ఉంది: సీపీ

    • ఎవరూ రూమర్స్ నమ్మొద్దు: సీపీ సజ్జనార్

    పూర్తి కథనం..

  • Jun 08, 2026 12:54 IST

    HCA అధ్యక్షుడి నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం

    • HCA అధ్యక్షుడి నియామకం చెల్లదు: తెలంగాణ హైకోర్టు

    • అధ్యక్షుడిగా నియమితుడైన అమర్నాథ్‌ను బాధ్యతల నుంచి తొలగించాలి: హైకోర్టు

    • స్పెషల్ AGM నిర్వహించి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి: హైకోర్టు

  • Jun 08, 2026 12:41 IST

    ప.గో.: సిద్ధాంతం చేరుకున్న సీఎం చంద్రబాబు

    • మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు

    • రైతులకు పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు

  • Jun 08, 2026 12:26 IST

    టీఎంసీ కీలక నేత జహంగీర్ ఖాన్‌ అరెస్ట్

    • పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న జహంగీర్

    • నేపాల్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్న పశ్చిమబెంగాల్ పోలీస్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్

    • సౌత్ 24 పరగణాల జిల్లాలోని ఫాల్తా పోలీస్ స్టేషన్‌లో జహంగీర్ ఖాన్‌పై 7 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు

    పూర్తి కథనం..

  • Jun 08, 2026 12:03 IST

    ఢిల్లీ: ఇండియా కూటమి భేటీ

    • NDAకు వ్యతిరేకంగా సమష్టి కార్యాచరణపై చర్చ

    • హాజరైన మమతా బెనర్జీ సహా 23 పార్టీల నేతలు

    • సమావేశాన్ని బహిష్కరించిన DMK

    • బెంగాల్‌లో పరిస్థితులను భేటీలో ప్రస్తావించనున్న మమత

    • ఇప్పటివరకూ TVKకు లభించని ఇండియా కూటమి ఆహ్వానం

    • ఈ సమావేశంలో ఆహ్వానంపై నిర్ణయం తీసుకునే అవకాశం

  • Jun 08, 2026 12:02 IST

    బెంగాల్: TMCలో కీలక పరిణామం

    • రాజ్యసభ సభ్యత్వానికి TMC ఎంపీ సుఖేందు రాజీనామా

    • పార్టీ అసెంబ్లీ సభ్యుల్లో వచ్చిన తిరుగుబాటు..

    • పార్లమెంట్ వైపు కూడా పాకొచ్చని ఇటీవల సుఖేందు వ్యాఖ్యలు

  • Jun 08, 2026 12:01 IST

    కాకినాడ: తునిలో ఇంకా దొరకని రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ

    • దొండవక అగ్రహారం గ్రామంలో ఉత్కంఠ

    • రెండో రోజూ కొనసాగుతున్న గాలింపు చర్యలు

    • డ్రోన్లు, డాగ్ స్క్వాడ్‌తో అన్వేషణ

    • కిడ్నాప్ కోణంలోనూ పోలీసుల దర్యాప్తు

    • శనివారం అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి

  • Jun 08, 2026 11:44 IST

    NIA కస్టడీకి విజయవాడ ఉగ్ర లింక్ నిందితులు

    • రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న NIA

    • జాంపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో నిందితుల విచారణ

    • ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటు కొనసాగనున్న విచారణ

  • Jun 08, 2026 11:44 IST

    హైదరాబాద్: పాలనలో మోదీ తనదైన ముద్ర వేశారు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

    • 12 ఏళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం: కిషన్‌రెడ్డి

    • సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నాం: కిషన్‌రెడ్డి

    • అవినీతికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్: కిషన్‌రెడ్డి

    • కోల్ సెక్టార్‌లో అవినీతి, అక్రమాలకు తావు లేదు: కిషన్‌రెడ్డి

    • కోల్ వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉంది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

  • Jun 08, 2026 11:42 IST

    మూడో రోజు లంచ్ బ్రేక్‌ సమయానికి అఫ్గాన్‌ 18/0

    • భారత్‌ విధించిన ఫాలోఆన్‌లో బ్యాటింగ్‌ చేస్తున్న అఫ్గానిస్థాన్‌

    • ఏకైక టెస్టులో భారత్‌ పూర్తి ఆధిపత్యం

    • తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 564/8 వద్ద డిక్లేర్‌

    • తొలి ఇన్నింగ్స్‌లో అఫ్గానిస్థాన్‌ 152 పరుగులకు ఆలౌట్‌

    • భారీ ఆధిక్యంతో మ్యాచ్‌పై పట్టు బిగించిన భారత్‌

  • Jun 08, 2026 11:11 IST

    బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

    • యాత్రికులు మరణించడం బాధాకరం: సీఎం చంద్రబాబు

    • క్షతగాత్రులకు వైద్యసాయం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశం

  • Jun 08, 2026 11:10 IST

    సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ డీకే అరుణ ఆగ్రహం

    • తెలంగాణ ఎవరబ్బ జాగీరు కాదు: ABNతో డీకే అరుణ

    • మమ్మల్ని తెలంగాణలో తిరగనివ్వడం కాదు.. మిమ్మల్ని మేం తిరగనివ్వం

    • పద్ధతి దాటి మాట్లాడితే.. మేమూ మాట్లాడాల్సి వస్తుంది: డీకే అరుణ

  • Jun 08, 2026 11:08 IST

    హైదరాబాద్: గండిపేట భూ కబ్జా కేసులో కస్టడీకి పోలీసుల పిటిషన్

    • బ్రహ్మనాయుడు కస్టడీ కోరుతూ నార్సింగి పోలీసుల పిటిషన్

    • వారం రోజుల కస్టడీకి అనుమతివ్వాలని ఉప్పరపల్లి కోర్టులో పిటిషన్

    • ఇప్పటికే ఈ కేసులో రాధాకృష్ణ, నిమ్మల రాజేష్, వేణుగోపాల్‌ను ప్రశ్నించిన సైబరాబాద్ పోలీసులు

    • ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న బొల్ల బ్రహ్మనాయుడు

  • Jun 08, 2026 11:07 IST

    విద్యాశాఖను సీఎం రేవంత్ సర్కస్‌లా మార్చారు: కవిత

    • పేదలకు చదువు దూరం చేసేందుకే ప్రభుత్వ స్కూల్స్ మూసేస్తామని చెబుతున్నారు: కవిత

  • Jun 08, 2026 11:05 IST

    బిహార్ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు నెల్లూరు వాసుల మృతి

    • ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి

    • బిహార్ అధికారులతో మంత్రి అత్యవసర సంప్రదింపులు

    • మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: మంత్రి నారాయణ

  • Jun 08, 2026 10:42 IST

    శంషాబాద్ రావాల్సిన రెండు విమానాల మళ్లింపు

    • గోవా నుంచి రావాల్సిన ఇండిగో విమానం విశాఖకు మళ్లింపు

    • ఢిల్లీ నుంచి రావాల్సిన ఖతార్ విమానం బెంగళూరుకు మళ్లింపు

    • ప్రతికూల వాతావరణంతో విమానాల దారి మళ్లింపు

  • Jun 08, 2026 10:42 IST

    పోలవరం: నేలకోట ప్రాంతంలో పెద్దపులి గుర్తింపు

    • పులిని బంధించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్

    • థర్మల్ డ్రోన్లు, రేడియోకాలర్ సహాయంతో పులి కదలికలను గుర్తిస్తున్న రెస్క్యూ బృందం

    • గ్రామాల వైపు పులి వెళ్లకుండా ప్రత్యేక చర్యలు

  • Jun 08, 2026 10:41 IST

    డొమినికన్ రిపబ్లిక్‌లో విమాన ప్రమాదం

    • ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్

    • ప్రమాదంలో ఇద్దరు పైలట్ల మృతి

    • లా రోమానా అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో ఘటన

  • Jun 08, 2026 10:39 IST

    బీటెక్ విద్యార్థి ప్రాణం తీసిన ర్యాగింగ్

    • హైదరాబాద్‌లో అదృశ్యమైన బీటెక్ విద్యార్థి మృతి

    • రాహుల్ ఆత్మహత్య చేసుకున్నట్టు గుర్తింపు

    • ఒంగోలులోని సింగరాయకొండ దగ్గర బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న రాహుల్

    • మే 27న కాలేజీ దగ్గర ర్యాగింగ్ చేసిన సీనియర్లు

    • అదే రోజు నుంచి కనిపించకుండాపోయిన రాహుల్

    • మృతుడి స్వస్థలం జగిత్యాల జిల్లా అయిలాపూర్

  • Jun 08, 2026 09:54 IST

    మేడ్చల్: వివాదంలో చిక్కుకున్న నటుడు సుప్రీత్‌రెడ్డి (కాట్రాజ్)

    • తనపై సుప్రీత్‌రెడ్డి దాడి చేశారని పోలీసులకు క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు

    • కారుకు అడ్డుగా ఉన్నానని దుర్భాషలాడుతూ దాడి చేశాడని ఫిర్యాదు

    • ఫిర్యాదుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 08, 2026 09:48 IST

    ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. తీవ్రత 7.8గా నమోదు

    • ఫిలిప్పీన్స్‌లో సునామీ హెచ్చరికల జారీ

    • ఫిలిప్పీన్స్‌ తీరంలో 3 అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డ అలలు

    • ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కోరిన మార్కోస్

    పూర్తి కథనం..

  • Jun 08, 2026 09:47 IST

    NBC ఇంటర్వ్యూ నుంచి ట్రంప్ వాకౌట్

    • 2020 ఎన్నికలు రిగ్గింగ్ అయ్యాయన్న ట్రంప్ ఆరోపణలపై ప్రశ్నించిన యాంకర్

    • తీవ్ర ఆగ్రహంతో వాకౌట్ చేసిన ట్రంప్

  • Jun 08, 2026 09:46 IST

    ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడితో మళ్లీ పెరిగిన చమురు ధరలు

    • 96.39 డాలర్లకు చేరిన బ్యారెల్ క్రూడాయిల్

    • డాలర్‌తో పోలిస్తే 95.29కి చేరిన రూపాయి మారకం విలువ

  • Jun 08, 2026 09:46 IST

    నీట్-యూజీ 2026కు భారీ భద్రత

    • రహస్య ప్రదేశాలకు.. ప్రశ్నపత్రాలు తయారు చేసిన నిపుణులు

    • జూన్ 21న పరీక్ష ముగిసే వరకూ రహస్య ప్రాంతంలోనే నిపుణులు

  • Jun 08, 2026 09:28 IST

    అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాజ్యసభ అభ్యర్థులు

    • ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించిన.. రామకృష్ణ, సతీష్, విజయ్

    • రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన పలువురు మంత్రులు, MLAలు

  • Jun 08, 2026 09:27 IST

    కరీంనగర్: PMJ జ్యువెలరీ చోరీ కేసు.. ఇంకా దొరకని ఆభరణాల ఆచూకీ

    • విచారణలో నోరు మెదపని ప్రధాన నిందితుడు సుబోధి సింగ్

    • పోలీసులను తప్పుదారి పట్టించేలా వాంగ్మూలాలు

  • Jun 08, 2026 09:09 IST

    పల్నాడు: వెల్దుర్తి మండలం గంగలకుంటలో మహిళ హత్య

    • ఇంట్లో ఉన్న మహిళ కొల్లి వీరమ్మపై గొడ్డలితో దాడి చేసి చంపిన దుండగులు

    • అక్కడికక్కడే మృతి చెందిన వీరమ్మ

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Jun 08, 2026 08:28 IST

    బిహార్: ఔరంగాబాద్ దగ్గర బస్సును ఢీకొట్టిన లారీ

    • ముగ్గురి మృతి, మరో 15 మందికి తీవ్రగాయాలు

    • నెల్లూరు జిల్లా సంగం నుంచి యాత్రికులతో కాశీ వెళ్లిన బస్సు

    • బస్సులో ఆత్మకూరు, సంగం, దుత్తలూరుకు చెందిన 43 మంది యాత్రికులు

  • Jun 08, 2026 07:24 IST

    ఇజ్రాయెల్‌పై మిస్సైల్స్‌తో విరుచుకుపడిన ఇరాన్

    • సైనిక స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్స్‌తో దాడి

    • మిస్సైల్స్‌ను మార్గమధ్యలోనే అడ్డుకున్న అమెరికా

    • లెబనాన్‌ రాజధాని బీరుట్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు

    • ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగానే దాడికి దిగినట్టు టెహ్రాన్ వెల్లడి

  • Jun 08, 2026 07:03 IST

    ముగిసిన మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటన

    • ఇవాళ విజయవాడకు చేరుకోనున్న మంత్రి నారా లోకేష్‌

  • Jun 08, 2026 07:03 IST

    నేడు అధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ

    • అమర్నాథ్ యాత్ర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

  • Jun 08, 2026 06:36 IST

    ఖమ్మం: పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి రైల్వేబ్రిడ్జి దగ్గర రోడ్డుప్రమాదం

    • రైల్వే బ్రిడ్జి‌ని ఢీకొట్టి బోల్తా పడిన KVR ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు

    • నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలు

    • ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు

  • Jun 08, 2026 05:50 IST

    విజయవాడ: రేపటి నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్‌

    • ఈ నెల 30 వరకు కొనసాగే APLలో పాల్గొననున్న ఏడు జట్లు

    • విశాఖలో 9 నుంచి 13 వరకు, కడపలో 17 నుంచి 21 వరకు పోటీలు

    • మంగళగిరిలో ఈ నెల 24 నుంచి 30 వరకు APL పోటీలు

    • నేడు విశాఖలో కౌన్సిల్ భేటీ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని శివనాథ్‌

  • Jun 08, 2026 05:50 IST

    తిరుపతిలో నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు

    • సీఎం చంద్రబాబు పర్యటనతో కార్యక్రమాన్ని రద్దు చేసిన అధికారులు

  • Jun 08, 2026 05:49 IST

    ఢిల్లీ: నేడు ఇండియా కూటమి భేటీ

    • NDAకు వ్యతిరేకంగా సమిష్టి కార్యాచరణపై చర్చ

    • ఇండియా కూటమి భేటీకి మమత, బహిష్కరించిన DMK, ఆప్‌

  • Jun 08, 2026 05:48 IST

    హైదరాబాద్‌: ఇవాళ రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ

    • నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ

  • Jun 08, 2026 05:48 IST

    వృద్ధుడి వీడియోలపై స్పందించిన సీఎం చంద్రబాబు

    • సీఎం చంద్రబాబును కలవాలన్న వృద్ధుడి వీడియో వైరల్

    • వీడియోలు పోస్ట్ చేసిన కామధేనువులంకకు చెందిన వృద్ధుడు

    • 'సత్యనారాయణ గారు.. సిద్ధాంతంలో కలుద్దాం' అంటూ.. ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టిన చంద్రబాబు

  • Jun 08, 2026 05:46 IST

    నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు టూర్‌

    • పెనుగొండ మండలం సిద్ధాంతంలో చంద్రబాబు పర్యటన

    • పట్టాదారు పాస్‌ పుస్తకాలు పంపిణీ చేయనున్న చంద్రబాబు

    • ఆచంట నియోజవర్గ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం

  • Jun 08, 2026 05:46 IST

    రాజ్యసభ నామినేషన్లకు నేడు తుదిగడువు, రేపు పరిశీలన

    • ఈ నెల 18న రాజ్యసభ ఎన్నికల పోలింగ్‌, సాయంత్రం ఫలితాలు