Share News

జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడో తెలియడం లేదు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 08 , 2026 | 01:33 PM

భవిష్యత్తులో తాగు నీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు.

జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడో  తెలియడం లేదు: సీఎం చంద్రబాబు
CM Chandrababu

పశ్చిమగోదావరి, జూన్ 8: ప్రజల భవిష్యత్ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈరోజు(సోమవారం) సిద్ధాంతంలో రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను సీఎం పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్తులో తాగు నీరు, సాగునీరుకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకునే బాధ్యతను మంత్రి రామానాయుడికి అప్పగించామన్నారు. ఎప్పుడు చూసినా గోదావరి జిల్లా ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. పంటలు పండించడంలో జిల్లాలో రైతులకు మించిన వారు లేరని కొనియాడారు. రాయలసీమ, విశాఖ జిల్లాల్లో పరిశ్రమల కోసం భూములు కావాలంటే ఇస్తారని.. ఇక్కడ మాత్రం సెంటు భూమి కూడా ఇవ్వరని అన్నారు.


అక్వా రైతుల సంక్షేమం కోసం ఓ ప్రణాళిక రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రశాంతంగా ఉండే ఈ జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో ప్రజల మధ్య చిచ్చు పెట్టారని.. గొడవలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ప్రజల భూములను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిందని మండిపడ్డారు. గొడ్డలి పట్టుకునే వారికి నాగలి పట్టుకున్న రైతు గుర్తుకు రాలేదని వ్యాఖ్యానించారు. ‘మీ భూమి మీద సైకో ఫొటో వేశారు. భూమి మీది.. ఫొటో సైకోది.. నిద్ర లేస్తూనే ఆయన మొహం చూడాల్సి వచ్చేది. జగన్ పిచ్చితనానికి ట్రీట్‌మెంట్ ఎక్కడ ఉందో తెలీదు. మీకేమైనా తెలిస్తే, ఆ అడ్రస్ ఆయనకు పంపుతాను’ అంటూ సీఎం చంద్రబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు.


భూ సమస్యల పరిష్కారం కోసం బ్లాక్‌చైన్ టెక్నాలజీని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. QR కోడ్‌తో రాజముద్ర కలిగిన పాస్ పుస్తకాలు జారీ చేశామన్నారు. ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరని అన్నారు. రీసర్వేలో E-KYC పెట్టి రైతులను భాగస్వాములను చేశామని చెప్పారు. 6,688 గ్రామాల్లో రీసర్వే నిర్వహించి భూ రికార్డులు అప్‌డేట్‌ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 26 లక్షల పాస్‌ పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. నిషేధిత జాబితా 22Aలో ఉన్న భూ సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రైతుల ఖాతాల్లో రూ.8వేల కోట్ల అన్నదాత సుఖీభవ నిధులు జమ చేశామని చంద్రబాబు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లో రైతులకు నగదు చెల్లింపులు జరుగుతున్నాయన్నారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. ఒక్క పరిశ్రమ రాలేదని.. యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని మండిపడ్డారు. త్వరలో ఆక్వా రైతుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.


‘నా దగ్గర తోక జాడిస్తే చూస్తూ ఊరుకోను. నేను సీఎంగా ఉన్నంతవరకు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. గొడ్డలి పార్టీవి అన్నీ తప్పుడు ప్రచారాలే. నిరుద్యోగులను మోసం చేసిన చరిత్ర వైసీపీది. నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాకే జగన్ రాజకీయాలు చేసుకోవాలి. వివేకాను చంపి.. నా చేతిలో గొడ్డలి పెట్టారు. జగన్ వంటివారికి ఎప్పటికప్పుడు బుద్ధి చెప్పాలి. పరీక్షలు అంటే తెలియనివాళ్లు విమర్శలు చేస్తున్నారు’ అంటూ సీఎం దుయ్యబట్టారు. తెలంగాణలోనూ వైసీపీ నేతలు భూములను కాజేయాలని చూశారని సీఎం తెలిపారు. ఇక్కడ చాలదన్నట్లు.. తెలంగాణలోనూ కబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. కోడికత్తి డ్రామాలు చేసేవారికి రైతుల బాధలు తెలియవన్నారు. తిరుమల దేవదేవుడి అంశంలోనూ ద్రోహం చేశారని మండిపడ్డారు. కలియగ దైవం వేంకటేశ్వర స్వామిని అపవిత్రం చేశారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే దుర్మార్గులను దూరం పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

బిహార్‌‌ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి

బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 08 , 2026 | 01:56 PM