టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, రామకృష్ణ, విజయ్ నామినేషన్
ABN , Publish Date - Jun 08 , 2026 | 01:02 PM
టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 10:50 గంటల నుంచి 11:50 గంటల వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది.
అమరావతి, జూన్ 8: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ నామినేషన్లు దాఖలు చేశారు. ఈరోజు(సోమవారం) ఉదయం ఏపీ అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 10:50 గంటల నుంచి 11:50 గంటల వరకు నామినేషన్ కార్యక్రమం జరిగింది. రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్.వనితా రాణికి ముగ్గురు టీడీపీ అభ్యర్థులు.. రెండు సెట్‌ల చెప్పున నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, మంత్రులు కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని హాజరయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీగా తరలివచ్చారు. జనసేన ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కూటమి ఐక్యతకు ప్రతీకగా రాజ్యసభ నామినేషన్ కార్యక్రమం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ సహా పలువురు టీడీపీ నాయకులు హాజరయ్యారు. టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమం అసెంబ్లీలో సందడిగా సాగింది.
టీటీడీ దేవస్థానంలో ప్రత్యేక పూజలు
ఈరోజు ఉదయం వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు సాన సతీశ్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ ప్రత్యేక పూజలు చేశారు. వీరికి వెంకటపాలెం టీటీడీ దేవస్థానం పండితులు సాదర స్వాగతం పలికారు. టీడీపీ అభ్యర్థులు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని వేద పండితులు ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం ఏపీ అసెంబ్లీ వరకు టీడీపీ అభ్యర్థులు సైకిళ్లపై వెళ్లి.. ఆపై నామినేషన్ దాఖలు చేశారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ రోడ్డు ప్రమాదంలో నెల్లూరు వాసుల మృతిపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి
బిహార్‌లో నెల్లూరు యాత్రికుల బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
Read Latest AP News And Telugu News