-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International Live Updates of 21th May 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - May 21 , 2026 | 07:03 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
May 21, 2026 21:54 IST
అమరావతి: నిషేధిత జాబితా భూములకు త్వరలో విముక్తి: మంత్రి అనగాని
ఇప్పటికే 1.6 లక్షల ఎకరాలకుపైగా రైతులకు శాశ్వత హక్కులు
మరో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు త్వరలో మోక్షం: మంత్రి అనగాని సత్యప్రసాద్
-
May 21, 2026 21:53 IST
అమరావతి: గ్రామీణ నీటి సరఫరాశాఖపై డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
తాగునీటి నాణ్యతపై రాజీపడొద్దు: డిప్యూటీ సీఎం పవన్
నెలలోపు ఫిల్టర్ బెడ్ల క్లీనింగ్ పూర్తికావాలి: పవన్
పనులు పూర్తయ్యేలా కలెక్టర్లు పర్యవేక్షించాలి: పవన్
గృహ అవసరాలకూ పూర్తిస్థాయి శుద్ధిచేసిన నీరు: పవన్
-
May 21, 2026 21:00 IST
కోల్‌కతా: ఆర్జీకార్ మెడికల్ కాలేజ్ హత్యాచారం కేసు పునఃవిచారణ
సీబీఐ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో SIT
సాక్ష్యాలను ధ్వంసం చేశారన్న ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశం
జూన్ 25లోపు నివేదిక సమర్పించాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశం
-
May 21, 2026 20:59 IST
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టుల గ్రౌండింగ్: సీఎం చంద్రబాబు
2028 చివరినాటికి ప్రాజెక్టులు ప్రారంభించేలా కార్యాచరణ: సీఎం చంద్రబాబు
పెట్టుబడిదారులకు సింగిల్ పోర్టల్ ద్వారా సేవలు: చంద్రబాబు
భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం: సీఎం చంద్రబాబు
-
May 21, 2026 20:04 IST
పార్థసారథిరెడ్డి చెప్పినవన్నీ వాస్తవాలే: ABNతో తులసిరెడ్డి
పులివెందుల ప్రజలందరికీ ఈ విషయాలు తెలుసు: ABNతో తులసిరెడ్డి
పదవి కోసం జగన్ ఏమైనా చేస్తాడు: ABNతో తులసిరెడ్డి
ఎలాంటి అబద్ధాలనైనా జగన్ మాట్లాడగలరు: ABNతో తులసిరెడ్డి
-
May 21, 2026 20:04 IST
వైఎస్ వివేకా లాంటి మరణం ఎవరికీ రాకూడదు: ABNతో పార్థసారథిరెడ్డి
ప్రణాళికా ప్రకారం వివేకాను హత్య చేశారు: ABNతో పార్థసారథిరెడ్డి
హత్య చేసింది ముమ్మాటికీ ఈ శాంతి ప్రవచనాలు చెబుతున్నవారే: ABNతో పార్థసారథిరెడ్డి
పులివెందులలో ఎవరిని అడిగినా ఇదే చెబుతారు: ABNతో పార్థసారథిరెడ్డి
-
May 21, 2026 19:18 IST
విజయనగరం: చీపురుపల్లి రైల్వే స్టేషన్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
బ్రహ్మపూర్ - విశాఖపట్నం పాసింజర్ రైల్లో 13 కిలోల గంజాయి స్వాధీనం
బరంపురం నుంచి ఎర్నాకులం తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
-
May 21, 2026 19:16 IST
కర్నూలు: గనుల రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు : మంత్రి కొల్లు రవీంద్ర
ఇసుక సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ ఉండకూడదు
ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా అధికారులు పని చేయాలి : మంత్రి కొల్లు రవీంద్ర
-
May 21, 2026 19:15 IST
కడప విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
మంత్రి లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన ఉమ్మడి కడప జిల్లా టీడీపీ నేతలు
కార్యకర్తలు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, ఫొటోలు దిగిన మంత్రి
కడప జిల్లాలో మంత్రి లోకేష్ రెండు రోజుల పర్యటన
కాసేపట్లో కడప నియోజకవర్గ సమన్వయ సమావేశంలో పాల్గొననున్న మంత్రి లోకేష్
-
May 21, 2026 17:40 IST
ప్రొఫెసర్ నాగేశ్వర్, ఓ టీవీ ఛానల్‌పై ఏపీలో కేసు నమోదు
కాకినాడ జిల్లా ఇంద్రపాలెం పీఎస్‌లో జనసేన ఫిర్యాదు
పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, అమిత్ షాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై కేసు
-
May 21, 2026 16:52 IST
కాసేపట్లో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ
ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల అమలు, ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష
పశ్చిమాసియా సంక్షోభం, ఆర్థిక ప్రభావంపైనా చర్చ
-
May 21, 2026 16:50 IST
బ్లాక్ మార్కెట్‌లో ఐపీఎల్ ఉప్పల్ మ్యాచ్ టికెట్లు
ఉప్పల్‌లో రేపు బెంగళూరు, హైదరాబాద్ మ్యాచ్
ముందుగానే టికెట్లు కొని బ్లాక్‌లో అమ్ముతున్న ముఠా
బ్లాక్ మార్కెట్‌కు టికెట్లు తరలించారని అభిమానుల ఆగ్రహం
బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు స్పెషల్ ఫోకస్
బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వారిపై 10 కేసులు నమోదు
-
May 21, 2026 16:31 IST
గోవుల అక్రమ రవాణా, గోవధ.. ఆందోళనకరం: రాంచందర్‌రావు
గోవధ నిషేధ చట్టాలను ఉల్లంఘిస్తున్నారు: బీజేపీ తెలంగాణ అధ్యుక్షుడు రాంచందర్‌రావు
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు: రాంచందర్‌రావు
గోరక్షకులపై కేసులను ఉపసంహరించుకోవాలి: రాంచందర్‌రావు
-
May 21, 2026 16:30 IST
పల్నాడు: జగన్‌కు ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సవాల్
సూపర్ సిక్స్ అమలుపై ఎక్కడైనా చర్చకు సిద్ధం: జీవీ
జగన్ కోరుకున్న ఊరిలోనే పథకాల అమలును చూపిస్తాం: జీవీ
కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్‌కు లేదు: జీవీ
-
May 21, 2026 16:27 IST
ఢిల్లీ: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసిన కిషన్‌రెడ్డి
తెలంగాణలో కొత్త ప్రాజెక్టులు, ఎలక్ట్రిఫికేషన్ తదితర అంశాలపై చర్చించాం: కిషన్‌రెడ్డి
42 రైల్వేస్టేషన్ల అభివృద్ధి పనులపై చర్చించాం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
-
May 21, 2026 16:26 IST
కొత్తగూడెం: అశ్వారావుపేట సమీపంలో భారీగా గంజాయి సీజ్
మూడు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం, నలుగురి అరెస్టు
-
May 21, 2026 16:25 IST
అమరావతి: మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష
భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు
ఎస్ఐపీబీలో ఆమోదించిన ప్రాజెక్టులపై కమిటీతో రివ్యూ
-
May 21, 2026 16:25 IST
పుల్వామా దాడి కీలక సూత్రధారి హంజా బుర్హాన్ హతం
POKలో హంజా బుర్హాన్‌ను కాల్చి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
2019 పుల్వామా దాడి ఘటనలో 40 మంది CRPF జవాన్ల మృతి
-
May 21, 2026 16:24 IST
ఏపీలో భగ్గుమంటున్న ఎండలు
కనిగిరిలో అత్యధికంగా 48.03 డిగ్రీల ఉష్ణోగ్రత
పిడుగురాళ్లలో 47.97, అచ్చంపేటలో 47.71 డిగ్రీలు
కృష్ణా జిల్లా నందివాడలో 47.61 డిగ్రీలు నమోదు
ఎన్టీఆర్ జిల్లా తొర్రగూడిపాడులో 47.38 డిగ్రీలు
కంచికచర్లలో 46.71 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
-
May 21, 2026 15:42 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
135 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
4 పాయింట్లు కోల్పోయి ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ
-
May 21, 2026 15:35 IST
బండి భగీరథ్ కేసుపై కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
ఫోక్సో కేసు తీవ్ర ఆందోళన కలిగించింది: మీనాక్షి
బాధితురాలిని నిందించడం కాదు.. నేరస్తుల పెంపకాన్ని ప్రశ్నించాలి: మీనాక్షి నటరాజన్
-
May 21, 2026 14:22 IST
RS ప్రవీణ్, KTR జడ్జిలుగా తీర్పు ఇస్తున్నారు: రేవంత్‌రెడ్డి
పోక్సో కేసులో బాధితుల వివరాలు వెల్లడించకూడదు: సీఎం రేవంత్‌రెడ్డి
KTR మనిషిలా వ్యవహరించడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి
బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారు: రేవంత్
BRS నేతలు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారు: సీఎం రేవంత్‌రెడ్డి
-
May 21, 2026 13:56 IST
ఢిల్లీ: నీట్ పేపర్ లీక్ కేసులో కొనసాగుతున్న CBI దర్యాప్తు
NTA చీఫ్‌కు నోటీసులు జారీ చేసిన పార్లమెంటరీ ఎడ్యుకేషన్ కమిటీ
పార్లమెంటరీ ఎడ్యుకేషన్ కమిటీ ముందు విచారణకు హాజరైన NTA చీఫ్ అభిషేక్ సింగ్
పేపర్ లీక్‌పై వివరణ ఇవ్వనున్న NTA చీఫ్ అభిషేక్ సింగ్
-
May 21, 2026 13:55 IST
బండి భగీరథ్ కేసుపై స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి
పోక్సో కేసులో ఎవరి విషయాలు చెప్పడానికి లేదు: సీఎం
పోక్సో కేసులోనూ BRS అతిగా ప్రవర్తించింది: సీఎం
ఫిర్యాదు అందిన వెంటనే భగీరథ్ కేసులో చర్యలు: సీఎం
-
May 21, 2026 13:53 IST
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం
తమిళనాడులో AI శాఖను సృష్టించిన సీఎం విజయ్
వేలచ్చేరి MLA కుమార్‌ను AI శాఖా మంత్రిగా నియామకం
-
May 21, 2026 13:42 IST
మెదక్: తూప్రాన్ మండలం నాగులపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం
మంటల్లో చిక్కుకున్న కంటైనర్
కంటైనర్‌లో ఉన్న 8 కార్లు దగ్ధం
-
May 21, 2026 13:11 IST
బ్యాంక్ కస్టమర్లకు ఆర్బీఐ శుభవార్త
లోన్ రికవరీ ఏజెంట్ల ఆగడాలకు చెక్
కొత్త విధివిధానాలను విడుదల చేసిన ఆర్బీఐ
అక్టోబర్ 1నుంచి కొత్త నిబంధనలు అమలు
నిబంధనలు పాటించకపోతే బ్యాంకులపై కఠిన చర్యలు
రికవరీ పేరుతో వేధిస్తే సహించేది లేదు: ఆర్బీఐ
-
May 21, 2026 13:06 IST
పెద్దపల్లి: ఓదెల మండలం ఇందుర్తిలో అగ్నిప్రమాదం
వరికొయ్యలను తగులబెట్టిన గుర్తుతెలియని వ్యక్తులు
పంట చేనులో ఆరబోసిన సీడ్ వడ్లు
నిప్పు రవ్వలు ఎగిసిపడి ధాన్యం కుప్పలకు అంటుకున్న మంటలు
ట్రాక్టర్‌తో వాటర్ తీసుకొచ్చి మంటలను ఆర్పేసిన రైతులు
నలుగురు రైతులకు చెందిన ధాన్యం పూర్తిగా కాలిపోవడంతో రూ. 20 లక్షల నష్టం
-
May 21, 2026 13:01 IST
అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు
ఇష్టపూర్వక శారీరక సంబంధం అత్యాచారం కాదు
పెళ్లి ప్రతిపాదన లేదని నిరూపించలేనప్పుడు అత్యాచారంగా పరిగణించలేమన్న హైకోర్టు
యువతి FIRను రద్దు చేసిన కోర్టు
పరస్పర అంగీకారంతో ఉన్న సంబంధాలను దుర్వినియోగం చేయొద్దని సూచించిన కోర్టు
-
May 21, 2026 12:59 IST
అమరావతి: బక్రీద్ హాలిడే మారింది
బక్రీద్ సెలవును ఈ నెల 27వ తేదీన కాకుండా 28వ తేదీకి మార్చిన ప్రభుత్వం
అంతకుముందు ఈ నెల 27 బుధవారం సెలవు దినంగా పేర్కొన్న ప్రభుత్వం
ప్రస్తుతం ఈనెల 28వ తేదీ అంటే గురువారం సెలవు దినంగా ప్రకటిస్తూ GO జారీ చేసిన చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్
-
May 21, 2026 12:25 IST
హైదరాబాద్: ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో అదుపులోకి వచ్చిన మంటలు
12 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చిన ఫైర్ సిబ్బంది
అగ్ని ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం
-
May 21, 2026 12:18 IST
గుంటూరు: ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యాఖ్యల వెనుక కుట్ర ఉంది: గాదె వెంకటేశ్వరరావు
పవన్ కల్యాణ్‌పై నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు నిరాధారం: గాదె
జనసేన పార్టీలో కోర్ కమిటీ లేదు: గాదె
2024 ఎన్నికల ముందు అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు: గాదె
ఇంగిత జ్ఞానం లేకుండా జనసేనపై ఆయన బురద జల్లుతున్నారు: గాదె
పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ నాగేశ్వర్ విత్ డ్రా చేసుకోవాలి: గాదె
-
May 21, 2026 12:15 IST
ముఖ్యమంత్రి రేవంత్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ
రైతుల ప్రాణాలు పోతున్నా పంటలు కొనరా?: కేటీఆర్
కొనుగోలు కేంద్రాల్లో కుప్పకూలుతున్నా కనికరించరా?: కేటీఆర్
ధ్యానం తగలబెట్టుకుంటున్నా తండ్లాట తీర్చరా?: కేటీఆర్
-
May 21, 2026 12:07 IST
మంచిర్యాల: చెన్నూర్‌లో జాతీయ రహదారిపై రైతుల ఆందోళన
ధాన్యం లారీలు పంపించాలని నిరసన
స్థానిక గోదాముల్లోనే అన్‌లోడ్ చేయాలని డిమాండ్
-
May 21, 2026 11:44 IST
అమరావతి: ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ (APSFTVTDC) డైరెక్టర్లు వీరే..
సుమన్ తల్వార్
ఎస్. శివాజీ
చదలవాడ శ్రీనివాసరావు
బుర్రా సాయిమాధవ్
వై. ఝాన్సీ
కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద(వివేక్ కూచిభొట్ల)
వి. సముద్ర
కే. ఉమామహేశ్వర రావు
మీర్.ఎస్
కందిమళ్ల సాంబశివరావు
ఏ. సత్యనారాయణ
ఎస్. వెంకట కృష్ణారెడ్డి
జీ. రాజ్ వెంకటేశ్వర యాదవ్
డి. సత్యనారాయణ
-
May 21, 2026 11:42 IST
అమరావతి: ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల నియామకం
ఏపీఎస్ఎఫ్ టీవీటీడీసీ (APSFTVTDC) ఛైర్మన్‌గా పి. భరత్ భూషణ్ నియామకం
వైస్ ఛైర్మన్‌గా చిక్కాల మెహర్ రమేష్ కుమార్ నియామకం
ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌తో పాటు మరో 14 మందిని సభ్యులుగా నియమించిన ప్రభుత్వం
-
May 21, 2026 11:39 IST
హైదరాబాద్: నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి
నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
దేశానికి సాంకేతికను పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ: సీఎం
దేశంలో మహిళా రిజర్వేషన్లు తీసుకొచ్చిన మహనీయుడు: సీఎం
సరళీకృత విధానాలతో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళిన గొప్ప దార్శనికుడు: సీఎం
సోనియా గాంధీ సాహసోపేత నిర్ణయంతోనే తెలంగాణ కల సాకారమైంది: సీఎం
తెలంగాణకు గాంధీ కుటుంబంతో అవినాభావ సంబంధం ఉంది: సీఎం
-
May 21, 2026 11:30 IST
అమరావతి: టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం ప్రారంభం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
పొదుపు చర్యల్లో భాగంగా ఆన్‌లైన్‌లో పొలిట్‌బ్యూరో భేటీ
-
May 21, 2026 11:30 IST
తిరుపతి: తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ
భక్తులతో కిక్కిరిసిపోయిన క్యూ కాంప్లెక్స్‌లలోని కంపార్ట్‌మెంట్స్
ఇప్పటికే క్యూలలో వున్న భక్తులకు దర్శనానికి 24గంటల నుంచి 30 గంటలు పట్టే అవకాశం
క్యూలు భక్తులతో నిండిపోవడంతో మిగతా వారిని వెనక్కి పంపుతున్న టీటీడీ
శుక్రవారం ఉదయం 9 గంటలకు క్యూల వద్దకు రావాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ
-
May 21, 2026 11:23 IST
హార్దిక్ పాండ్యాకు షాక్
కోల్‌కతా-ముంబై మ్యాచ్‌లో నిబంధనలు ఉల్లంఘించిన హార్దిక్ పాండ్యా
దీంతో పాండ్యాకు జరిమానా విధించిన బీసీసీఐ
మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించిన బీసీసీఐ
-
May 21, 2026 11:19 IST
సంగారెడ్డి: పుల్కల్ (మం) గోంగ్లూర్ గ్రామంలో డొమెస్టిక్ సిలిండర్ కోసం భారీ క్యూ
భారత్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట వంట గ్యాస్ కోసం బారులుతీరిన జనం
స్టాక్ రావడంతో ఉదయం 4 గంటల నుంచి గ్యాస్ ఏజెన్సీ వద్ద పడిగాపులు
గ్యాస్ బుక్ చేసి రోజులు గడుస్తున్నా.. సిలిండర్ ఇవ్వడం లేదంటున్న వినియోగదారులు
-
May 21, 2026 11:15 IST
ఢిల్లీ: మూడు రోజుల పాటు సమ్మెకు దిగిన టాక్సీ, ఆటో యూనియన్లు
పెరుగుతున్న ఇంధన ధరల నేపథ్యంలో తమ ఛార్జీలను తక్షణమే పెంచాలని ఢిల్లీ ప్రభుత్వానికి డిమాండ్
ఢిల్లీలో నిలిచిపోయిన టాక్సీ, ఆటో సేవలు
-
May 21, 2026 11:14 IST
హైదరాబాద్: రాజీవ్‌గాంధీ విగ్రహానికి సీఎం రేవంత్ నివాళులు
-
May 21, 2026 11:10 IST
చెన్నై: ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించిన తమిళనాడు గవర్నర్
-
May 21, 2026 10:55 IST
మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణ
ఈ నెల 25 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా మహిళా వారోత్సవాలు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా వారోత్సవాలు
గ్రామీణ మహిళలు, SHGలు, యువతులు, బాలికలకు ప్రత్యేక కార్యక్రమాలు
మహిళల ఆర్థిక స్వావలంబనపై ప్రభుత్వం ఫోకస్
-
May 21, 2026 10:54 IST
తమిళనాడులో ఆగని రాష్ట్ర గీతం వివాదం
సీఎం విజయ్ మంత్రివర్గ విస్తరణలో తమిళ రాష్ట్ర గీతం మూడో స్థానానికి పరిమితం
వందేమాతరంతో మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం ప్రారంభం
-
May 21, 2026 10:52 IST
హైదరాబాద్: మదీనా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం
ఎస్‌వైజే కాంప్లెక్స్‌లో ఎగసిపడుతున్న మంటలు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది
అదుపులోకి రాని మంటలు
కాంప్లెక్స్‌లో సుమారు 100కు పైగా దుకాణాలు ఉన్నట్టు సమాచారం
-
May 21, 2026 10:22 IST
హైదరాబాద్: అమీర్‌పేటలో హాస్టల్స్ ముసుగులో అసాంఘిక కార్యక్రమాలు
లేడీస్ హాస్టల్ ముసుగులో తప్పుడు పనులు జరుగుతున్నాయని యువతి ఆరోపణ
నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
తనకు జరిగిన అనుభవాలను వీడియో ద్వారా వెల్లడించిన యువతి
-
May 21, 2026 10:12 IST
తిరుపతి: హిందూ ధర్మప్రచారకుడు రాధామనోహర్ దాస్‌పై పెద్దాపురంలో కేసు నమోదు
మతపరమైన మనోభావాలను కించపరిచే వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు
కేసుపై స్పందించిన బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాశ్ రెడ్డి
హిందూ బంధువులంతా ఆయనకు అండగా ఉంటారు: భానుప్రకాశ్ రెడ్డి
కేసు విషయంలో లీగల్‌గా బీజేపీ అండగా ఉంటుంది: భానుప్రకాశ్ రెడ్డి
రాష్ట్ర డీజీపీని కలిసి వినతిపత్రం ఇస్తాం: భానుప్రకాశ్ రెడ్డి
-
May 21, 2026 10:00 IST
తెలంగాణలో జూన్ 2న 92 మంది ఖైదీల విడుదల
ఖైదీలకు క్షమాభిక్షకు గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా గ్రీన్‌సిగ్నల్
-
May 21, 2026 09:54 IST
ఢిల్లీ: విదేశీ పర్యటన ముగించుకుని ఇండియాకు చేరుకున్న ప్రధాని మోదీ
-
May 21, 2026 09:38 IST
నేడు రాజీవ్ గాంధీ వర్ధంతి
నివాళులర్పించిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, తదితరులు
-
May 21, 2026 09:36 IST
తైవాన్‌ను చుట్టుముట్టిన చైనా
చైనాకు చెందిన 7 గస్తీ విమానాలు, 7 నౌకలు, 1 అధికారిక నౌకను గుర్తించిన తైవాన్
-
May 21, 2026 09:33 IST
మరో 23 మందికి మంత్రి పదవులు..
తమిళనాడు కేబినెట్‌లో కొత్తగా 23 మందికి చోటు
గవర్నర్‌కు లిస్ట్ పంపిన తమిళనాడు సీఎం విజయ్
-
May 21, 2026 09:31 IST
గుంటూరు IRRలోని టీచర్స్ కాలనీలో అగ్నిప్రమాదం
డ్రైనేజీ పైపులు నిల్వ చేసిన ప్రాంతంలో ఘటన
-
May 21, 2026 09:26 IST
మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా ప్రారంభం
బాబీ కొల్లి దర్శకత్వంలో మెగాస్టార్ నటిస్తున్న రెండో సినిమా ఇది
ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా పూజా కార్యక్రమాలు
అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ ఓపెనింగ్
పవన్ క్లాప్ కొట్టగా.. వి.వి వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు
-
May 21, 2026 09:23 IST
హైదరాబాద్: అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో ఫ్లాట్ ఓనర్ ఆత్మహత్య
శ్రీధర్‌రెడ్డి అనే వ్యక్తి దగ్గర అప్పు తీసుకుని ఫ్లాట్ కొన్న జయరాం
గడువు ముగిసినా.. అప్పు చెల్లించకపోవడంతో నిలదీసిన శ్రీధర్‌రెడ్డి
మనస్థాపంతో జయరాం ఆత్మహత్య
IS సదన్‌లో జిరాక్స్ షాప్ నిర్వహిస్తున్న జయరాం
షాపులోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని జయరాం ఆత్మహత్య, భార్య ఫిర్యాదు
-
May 21, 2026 09:02 IST
ఇరాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు
శాంతి చర్చలు, దాడుల మధ్యలో ఉన్నాం: ట్రంప్
దౌత్యానికి ఉన్న అవకాశాలు త్వరలోనే మూసుకుపోవచ్చు: ట్రంప్
ఇరాన్ సమాధానం చెప్పాల్సిందే: ట్రంప్
సమాధానం రాకపోతే పరిణామాలు వేగంగా మారిపోతాయి: ట్రంప్
-
May 21, 2026 08:15 IST
ముంబై: థానేలో భారీ అగ్నిప్రమాదం
గవాదేవి మార్కెట్‌లో చెలరేగిన మంటలు
ముగ్గురు ఫైర్ సిబ్బందికి గాయాలు
రూ.కోటి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతి
-
May 21, 2026 07:56 IST
బెంగాల్: నేడు ఫల్తా నియోజకవర్గంలో రీపోలింగ్
మొత్తం 285 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
పోలింగ్ కేంద్రాల దగ్గర కేంద్ర బలగాలతో బందోబస్తు
ఈ నెల 24న ఓట్ల లెక్కింపు
-
May 21, 2026 07:55 IST
ఇటలీ పర్యటన విజయవంతమైంది: ప్రధాని మోదీ
ఇటలీ ప్రధాని మెలోనితో అనేక రంగాలపై చర్చించా: ప్రధాని మోదీ
భారత్-ఇటలీ సంబంధాలను పెంపొందించాలని నిర్ణయించాం: ప్రధాని మోదీ
మెలోని, ఇటలీ ప్రజల స్నేహానికి ధన్యావాదాలు: ప్రధాని మోదీ
-
May 21, 2026 07:54 IST
హైదరాబాద్: అబ్దుల్లాపూర్‌మెట్‌లో దొంగల కలకలం
అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి మహిళ మెడలోని బంగారం అపహరణ
వేసవి వేడి తట్టుకోలేక ఇంటి తలుపులు తెరిచి పడుకున్న బాధితురాలు
నిద్రిస్తున్న మహిళ మెడలోంచి 4 తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిన దుండగులు
బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు
-
May 21, 2026 07:15 IST
హైదరాబాద్: పోక్సో కేసులో భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు వినతి
భగీరథ్ అరెస్ట్ కావడంతో పిటిషన్‌పై ఇక ఉత్తర్వులు అవసరం లేదని కోర్టుకు సమాచారం
హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ సమర్పించిన న్యాయవాది ఎన్.నవీన్ కుమార్
పిటిషన్‌ను ‘ఉపసంహరణ’ కేటగిరీలో నమోదు చేసిన హైకోర్టు రిజిస్ట్రీ
-
May 21, 2026 07:08 IST
అమరావతి: నేడు తెలుగుదేశం పొలిట్ బ్యూరో సమావేశం
ఆన్‌లైన్‌లో సమావేశం నిర్వహించనున్న టీడీపీ
ఉదయం 11 గంటలకు జరిగే సమావేశంలో మహానాడు ఏర్పాట్లు, చేయాల్సిన తీర్మానాలపై చర్చ
నూతన కార్యవర్గం, పొలిట్‌బ్యూరో నియామకం తర్వాత తొలిసారి పొలిట్ బ్యూరో సమావేశం
-
May 21, 2026 07:05 IST
నేడు తమిళనాడు కేబినెట్ విస్తరణ
కాంగ్రెస్‌కు 2 మంత్రి పదవులు కేటాయించిన విజయ్
కాంగ్రెస్ తరఫున విశ్వనాథన్, రాజేష్‌కుమార్‌కు అవకాశం
IUML, VCKకి ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం
అధికార భాగస్వామ్యానికి దూరంగా వామపక్షాలు