Share News

పాకిస్థాన్‌లో పుల్వామా దాడి సూత్రధారి హతం.. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు..

ABN , Publish Date - May 21 , 2026 | 03:36 PM

2019 పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ (Hamza Burhan) పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌‌లో హతమైనట్లు సమాచారం. ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి.

పాకిస్థాన్‌లో పుల్వామా దాడి సూత్రధారి హతం.. గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు..
Pulwama mastermind killed

2019 పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న హమ్జా బుర్హాన్ (Hamza Burhan) పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌‌లో హతమైనట్లు సమాచారం. ముజఫరాబాద్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు (Pulwama mastermind killed).


పుల్వామా దాడికి పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ (JeM) ఉగ్రసంస్థ బాధ్యత వహించింది. జైష్-ఎ-మహ్మద్‌ సంస్థకు అనుబంధంగా పని చేసిన హమ్జా బుర్హాన్ పుల్వామా దాడి ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని భారత దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. తాజాగా అతడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవడం సంచలనంగా మారింది (Hamza Burhan dead).


ఇటీవల పాకిస్థాన్‌లో భారత వ్యతిరేక ఉగ్రవాదులు వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో హతమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి (Pulwama attack Pakistan). గతంలో పఠాన్‌కోట్, సంజ్వాన్, కాందహార్ హైజాక్ వంటి ఘటనలతో సంబంధం ఉన్న పలువురు ఉగ్రవాదులు కూడా ఇదే తరహాలో మృతి చెందారు. కాగా, హమ్జా బుర్హాన్ హత్య వెనుక ఎవరు ఉన్నారో కనిపెట్టేందుకు స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..


రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 21 , 2026 | 03:37 PM