Share News

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..

ABN , Publish Date - May 21 , 2026 | 04:09 PM

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది.

ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు.. నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ..
Indian stock market

ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ సూచీలు మధ్యాహ్నం తర్వాత కిందకు దిగి వచ్చాయి. ఇంట్రాడే గరిష్ఠంతో పోల్చుకుంటే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లు కోల్పోయింది. విదేశీ మదుపర్లు బుధవారం రూ.1597 కోట్ల విలువైన షేర్లను అమ్మేయడం ప్రతికూలంగా మారింది. అలాగే ఉదయం గరిష్ఠాల వద్ద మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడం సూచీలను వెనక్కి లాగింది. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు కూడా సూచీలను నష్టాల బాట పట్టించాయి. ఈ నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాలతో రోజును ముగించాయి (Indian stock market).


గత సెషన్ ముగింపు (75,318)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 400 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి వెళ్లింది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు నష్టాల బాటపట్టాయి. చివరకు సెన్సెక్స్ 135 పాయింట్ల నష్టంతో 75,183 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 4 పాయింట్ల స్వల్ప నష్టంతో 23,654 వద్ద స్థిరపడింది (stock market news today).


సెన్సెక్స్‌, నిఫ్టీలో సమ్మన్ క్యాపిటల్, అంబర్ ఎంటర్‌ప్రైజెస్, గ్రాసిమ్, కేన్స్ టెక్, ఏంజెల్ వన్ మొదలైన షేర్లు లాభాలు ఆర్జించాయి (share market news). జుబిలెంట్ ఫుడ్, పీఐ ఇండస్ట్రీస్, బాష్, ఎమ్‌సీఎక్స్ ఇండియా, మ్యాన్‌కైండ్ ఫార్మా మొదలైన షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి. బ్యాంక్ నిఫ్టీ 122 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 22 పాయింట్లు నష్టపోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 96.19గా ఉంది.


ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..


రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 21 , 2026 | 04:09 PM