-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 28th August 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 28 , 2026 | 08:10 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Aug 28, 2026 10:17 IST
ఢిల్లీ: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్ నియామకం
సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ కింద ఐదేళ్లు పదవిలో కొనసాగనున్న ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్
2012 బ్యాచ్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేష్
-
Aug 28, 2026 10:16 IST
హైదరాబాద్: మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజా భవన్‌లో రాఖీ వేడుకలు
తన వ్యక్తిగత, భద్రత సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సీతక్క
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రముఖులకు రాఖీ కట్టిన మంత్రి సీతక్క
రాఖీ పండగ సందర్భంగా తనకు రాఖీ కట్టిన మహిళా సిబ్బందికి నూతన వస్త్రాలు బహుకరించిన మంత్రి సీతక్క
-
Aug 28, 2026 10:14 IST
కోనసీమ: సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కథ సుఖాంతం
ఎట్టకేలకు కోనసీమకు చేరుకున్న ఏడుగురు మత్స్యకారులు
-
Aug 28, 2026 10:13 IST
పశ్చిమగోదావరి: ఉండి మండలం యండగండిలో బైక్‌ను ఢికొన్న కారు
బైక్‌పై ఉన్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు
భార్య పరిస్థితి విషమం, హాస్పిటల్‌కు తరలింపు
-
Aug 28, 2026 09:17 IST
హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్: ఐఎండీ
హన్మకొండ, జనగామ, భూపాలపల్లి, ములుగు, వరంగల్ జిల్లాలకు వర్ష సూచన
-
Aug 28, 2026 09:16 IST
పశ్చిమగోదావరి: గోదావరి నదిలోకి దూకి గల్లంతైన దంపతుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు
యలమంచిలి మండలం చించినాడ గోదావరి బ్రిడ్జి నుండి అంతర్వేది వైపు గాలిస్తున్న ఫైర్, పోలీసు సిబ్బంది
అప్పుల కారణంగానే వేల్పూరుకు చెందిన దొడ్డా సాయి, శిరీష దంపతులు నదిలోకి దూకినట్లు సమాచారం
-
Aug 28, 2026 09:15 IST
హైదరాబాద్: పెళ్లి రద్దు కావడంతో యువతి బలవన్మరణం
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన
వికారాబాద్ నుంచి బండ్లగూడ జాగీర్‌లో ఉంటున్న మృతురాలు సంగీత కుటుంబం
ఇటీవల సంగీతకు వివాహం కుదిరి నిశ్చితార్థం చేసిన కుటుంబ సభ్యులు
నిశ్చితార్థం అనంతరం తనకు పెళ్లి ఇష్టం లేదంటూ వివాహాన్ని రద్దు చేసుకున్న పెళ్లి కొడుకు
-
Aug 28, 2026 09:14 IST
అమరావతి: ఏపీలో 'సర్' ప్రక్రియలో భాగంగా 43 లక్షల ఓటర్లకు నోటీసులు
16 లక్షలకు పైగా ఓటర్ల విచారణ పూర్తి
తగిన పత్రాలు లేకపోవడంతో 8,700 మంది అనర్హులుగా గుర్తింపు
13 లక్షల మందిని పైగా తుది జాబితాలో కొనసాగించేలా నిర్ణయం
-
Aug 28, 2026 09:14 IST
సీఎం రేవంత్ అపాయింట్‌మెంట్ కోరిన మంత్రి కొండా సురేఖ
రాఖీ కట్టేందుకు సమయం కోరిన కొండా సురేఖ
-
Aug 28, 2026 08:22 IST
హైదరాబాద్: ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్‌కు బెదిరింపు కాల్స్
అగంతకుల నుంచి రెహ్మత్ బేగ్‌కు ఫోన్ కాల్స్
డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బెదిరింపులు
డబ్బులు ఇవ్వకపోతే డీప్‌ఫేక్, మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలు బయటపెడతామంటూ హెచ్చరిక
-
Aug 28, 2026 08:21 IST
హైదరాబాద్: యువతిని ప్రేమ పేరుతో మోసం చేసిన క్యాబ్ డ్రైవర్
పెళ్లి చేసుకుంటానని రూ.20 లక్షలు తీసుకున్న యువకుడు
పీర్జాదిగూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ లక్ష్మణ్‌పై కేసు
-
Aug 28, 2026 08:20 IST
రేపటి నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మోదీ
ఉజ్బెకిస్థాన్, కిర్గిజ్‌స్థాన్ దేశాల్లో పర్యటించనున్న మోదీ
రేపటి నుంచి సెప్టెంబర్ 1 వరకు మోదీ విదేశీ పర్యటన
-
Aug 28, 2026 08:20 IST
ఆసియా క్రీడలకు ముందు కీలక పోరుకు సిద్ధమైన భారత పురుషుల హాకీ జట్టు
నేడు బెల్జియంతో తలపడనున్న భారత పురుషుల హాకీ జట్టు
-
Aug 28, 2026 08:17 IST
వరదల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్లు
టిబెట్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం సంప్రదించాల్సిన నెంబర్లు
చైనా స్థానిక అధికారులు: 0086 139 8999 0012 (వాట్సాప్‌లో సంప్రదించవచ్చు)
భారత ఎంబసీ, బీజింగ్: 0086 185 1428 4905
భారత రాయబార కార్యాలయం, ఖాట్మండు నెంబర్ +977 985 131 6807, +977 970 910 7500 (వాట్సాప్‌లో సంప్రదించవచ్చు)
-
Aug 28, 2026 08:16 IST
నేపాల్ వరదలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తం
ఢిల్లీ ఏపీ భవన్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు
011-23384016, 011-23387089, వాట్సాప్- 9059824101
ఢిల్లీ తెలంగాణ భవన్‌లో హెల్ప్‌లైన్
వందన- 9871999044, చక్రవర్తి- 9949351270, రక్షిత్- 9618597969
-
Aug 28, 2026 08:14 IST
నేడు ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్లకు లాటరీ
నేడు కుత్భుల్లాపూర్, కంటోన్‌మెంట్, రాజేంద్రనగర్, నాంపల్లి నియోజకవర్గాల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు లాటరీ
-
Aug 28, 2026 08:14 IST
నేడు జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
స్థానిక ఎన్నికల కోసం ఏర్పాటైన జనసేన కమిటీ భేటీ
జనసేన ప్రతినిధులకు ఆహ్వానం
సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ
-
Aug 28, 2026 08:12 IST
నేపాల్ వరదల్లో 392కి పెరిగిన మృతుల సంఖ్య
వరదల్లో సుమారు 1600 మంది గల్లంతు
గల్లంతైనవారిలో సుమారు 300 మంది భారతీయులు ఉన్నారన్న అధికారులు
-
Aug 28, 2026 08:11 IST
నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
నాగులుప్పలపాడు మం. చదలవాడ వద్ద రాడిసన్ హోటల్‌కు శంకుస్థాపన
20 మంది ప్రముఖుల విగ్రహాలు ఆవిష్కరించనున్న లోకేశ్
అమృత్-2 పథకం కింద డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ప్రారంభించనున్న లోకేశ్
ఒంగోలు టీడీపీ కార్యకర్తలు, నేతలతో లోకేశ్ సమావేశం
-
Aug 28, 2026 08:10 IST
రేపు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం: వాతావరణ శాఖ
ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబరు 2 వరకు వర్షాలు పడే చాన్స్
రానున్న రెండు రోజుల్లో పిడుగులతో వర్షాలు