-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 27th July 2026
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Jul 27 , 2026 | 07:13 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.
Live News & Updates
-
Jul 27, 2026 21:27 IST
డ్రాగన్ సినిమా షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం
వైద్యుల పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్
NTRకు 6-8 వారాల విశ్రాంతి అవసరం: వైద్యులు
అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: NTR కార్యాలయం
-
Jul 27, 2026 21:14 IST
ఉమ్మడి ఆదిలాబాద్‌లో వైద్య సేవలపై మంత్రి రాజనర్సింహ సమీక్ష
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్‌లో ప్రభుత్వ వైద్యసేవల బలోపేతం: మంత్రి రాజనర్సింహ
ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ
గిరిజన ప్రాంత ఆస్పత్రుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: రాజనర్సింహ
ITDA పరిధి ఏరియా ఆస్పత్రుల్లో దశలవారీగా సిటీ స్కాన్ సేవలు: రాజనర్సింహ
ఆదిలాబాద్ రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి చేస్తాం: మంత్రి రాజనర్సింహ
-
Jul 27, 2026 21:01 IST
హైదరాబాద్: రాజ్యాంగ స్ఫూర్తితోనే హైడ్రా విధులు నిర్వర్తిస్తున్నా: రంగనాథ్
ఆర్టికల్ 21, 48A ప్రకారమే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ: హైడ్రా చీఫ్ రంగనాథ్
రూ.1.50 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను కాపాడాం: హైడ్రా చీఫ్ రంగనాథ్
6 చెరువులను పూర్తిగా పునరుద్ధరించాం: హైడ్రా చీఫ్ రంగనాథ్
మరో 20 చెరువుల పనులు కొనసాగుతున్నాయి: హైడ్రా చీఫ్ రంగనాథ్
వేల ఎకరాల ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి అప్పగించాం: హైడ్రా చీఫ్ రంగనాథ్
-
Jul 27, 2026 20:55 IST
పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పనులపై పవన్ కల్యాణ్ సమీక్ష
క్షేత్రస్థాయి పరిశీలనకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయ సిబ్బంది
నూతన రోడ్లు, నాగులాపల్లి తాగునీటి సరఫరా పథకంపై ఆరా
అభివృద్ధి పనుల నాణ్యత పరిశీలించాలని పవన్ స్పష్టీకరణ
నియోజకవర్గంలో 100 భజన మందిరాల నిర్మాణానికి ప్రణాళికలు
-
Jul 27, 2026 20:34 IST
టీపీసీసీ సంస్థాగత వ్యవహారాలపై సమీక్ష జరిగింది: మహేష్‌గౌడ్
డీసీసీ, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పనితీరుపై సమీక్ష
ఎల్లుండి ఢిల్లీలో మరోసారి తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశం
మీనాక్షి నేతృత్వంలో SIRపై మరోసారి సమీక్ష
ఎల్లుండి సమావేశానికి సీఎం రేవంత్ హాజరవుతారు: టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్
-
Jul 27, 2026 20:05 IST
పోలవరం ప్రాజెక్టులో ప్రమాద ఘటనపై మంత్రి నిమ్మల స్పందన
ఇద్దరు సిబ్బంది మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది: నిమ్మల
ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి ఇద్దరు సిబ్బంది మృతి
ఒక మృతదేహం వెలికితీత, మరొకరి కోసం గాలింపు
-
Jul 27, 2026 19:49 IST
పోలవరం: విద్యార్థిని శివాని ఆత్మహత్యపై పోలీసుల దర్యాప్తు
ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించిన FSL, క్లూస్ టీమ్
శివాని సూసైడ్ నోట్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిన పోలీసులు
-
Jul 27, 2026 19:36 IST
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంపై సీఎం చంద్రబాబు సమీక్ష
భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు: సీఎం చంద్రబాబు
ఆగస్టు 1న ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభిస్తారు: చంద్రబాబు
2,703 ఎకరాల్లో రూ.4.727 కోట్లతో ఎయిర్‌పోర్టు: చంద్రబాబు
500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుసిటీ: సీఎం చంద్రబాబు
-
Jul 27, 2026 19:07 IST
హైదరాాబాద్: ఎల్‌నినో నేపథ్యంలో జల సంరక్షణపై మంత్రి సీతక్క పిలుపు
ప్రతి వర్షపు నీటి బొట్టునూ ఒడిసిపట్టాలని మహిళలకు విజ్ఞప్తి
తెలంగాణ జలసిరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: మంత్రి సీతక్క
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత నిర్మించాలి: మంత్రి సీతక్క
-
Jul 27, 2026 18:44 IST
అమరావతి: వైఎస్ జగన్‌కు మంత్రి నారా లోకేశ్ సవాల్
DSC ఆరోపణలపై జగన్‌తో బహిరంగ చర్చకు సిద్ధం: మంత్రి నారా లోకేశ్
వైసీపీ హయాంలో మద్యం, భూ స్కామ్‌లపై కూడా చర్చిద్దాం: నారా లోకేశ్
అభివృద్ధి-సంక్షేమం టీడీపీ సిద్ధాంతం: నారా లోకేశ్
విధ్వంసం, అసభ్యపదజాలమే గొడ్డలి పార్టీ విధానం: మంత్రి నారా లోకేశ్
-
Jul 27, 2026 18:43 IST
హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
రంగనాథ్‌ను బలిపశువును చేశారు: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
హైడ్రాను నిషేధిస్తే పేదల ఇళ్లు సురక్షితంగా ఉంటాయి: రాంచందర్‌రావు
రేవంత్, MIM కనుసన్నల్లో హైడ్రా నడిచింది: రాంచందర్‌రావు
ఫాతిమా కాలేజీ, బడాబాబుల జోలికి హైడ్రా వెళ్లలేదు: రాంచందర్‌రావు
తొలి నుంచి పేదల ఇళ్లే హైడ్రా టార్గెట్: రాంచందర్‌రావు
హైడ్రాను రద్దు చేయాలి: టీబీజేపీ చీఫ్ రాంచందర్‌రావు
-
Jul 27, 2026 18:39 IST
హైదరాబాద్: ప్యారడైజ్ సర్కిల్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరి అరెస్టు
తెలంగాణ ఈగల్ ఫోర్స్, పోలీసుల జాయింట్ ఆపరేషన్
నిందితుల నుంచి 4 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్ స్వాధీనం
ముంబై నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సరఫరా
-
Jul 27, 2026 18:28 IST
హైడ్రా చీఫ్ రంగనాథ్‌కు మద్దతుగా రేవంత్ సర్కార్
హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు ఆదేశాల అంశంలో లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
కోర్టు ధిక్కరణ పిటిషన్లను పరిశీలిస్తున్న అధికారులు
హైకోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్‌కు వెళ్లే యోచనలో ప్రభుత్వం
-
Jul 27, 2026 17:43 IST
ఇది విద్యార్థుల భవిష్యత్‌కు కీలకమైన బిల్లు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
చర్చ జరగాలని విపక్షాలు కోరాయి: కిరణ్ రిజిజు
మేం ఏకంగా బిల్లునే తీసుకొచ్చాం: కిరణ్ రిజిజు
చర్చకు సమయం కేటాయించాం: కిరణ్ రిజిజు
చర్చ జరగనివ్వకుండా విపక్షం అడ్డుకుంది: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
-
Jul 27, 2026 17:43 IST
తమిళనాడు సీఎం విజయ్‌కు హైకోర్టులో చుక్కెదురు
కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు..
ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
బాధిత కుటుంబాలకు ఉద్యోగం ఇవ్వడాన్ని తప్పుబట్టిన మద్రాస్ హైకోర్టు
అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి: మద్రాస్ హైకోర్టు
-
Jul 27, 2026 16:09 IST
హైదరాబాద్: చట్టబద్ధంగా నడుచుకునే సంస్థ హైడ్రా: రంగనాథ్
న్యాయ వ్యవస్థపై పూర్తి గౌరవం ఉంది: రంగనాథ్
కోర్టులకు కొందరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు: రంగనాథ్
ఒకచోట భూమి చూపిస్తూ మరోచోట కబ్జా చేస్తున్నారు: రంగనాథ్
ప్రైవేట్ భూముల్లోని పార్కుల స్థలంలోనే హైడ్రా బోర్డులు: రంగనాథ్
రూ.లక్షన్నర కోట్ల విలువైన 3,350 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాం: రంగనాథ్
25 చెరువులను పునరుద్ధరిస్తున్నాం: రంగనాథ్
-
Jul 27, 2026 16:00 IST
అయోధ్య విరాళాల చోరీ కేసులో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
విచారణకు ఐజీ కిరణ్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసిన యూపీ ప్రభుత్వం
సిట్ బృందంలో ఫోరెన్సిక్ ఆడిటర్‌ను చేర్చాలని సుప్రీం కోర్టు ఆదేశం
దర్యాప్తుపై 2 వారాల్లో స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సిట్‌కు డెడ్‌లైన్
విరాళాల వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టాలని పిటిషనర్ విజ్ఞప్తి
-
Jul 27, 2026 15:52 IST
ఢిల్లి: ఉద్యమం శాంతియుతంగా జరిగింది: సోనమ్ వాంగ్‌చుక్
మహాత్మాగాంధీకి కృతజ్ఞత చెప్పేందుకే రాజ్‌ఘాట్‌కు వచ్చా: వాంగ్‌చుక్
అహింసాయుత ఉద్యమం గాంధీ చూపిన మార్గమే: పర్యావరణ ఉద్యమకారుడు వాంగ్‌చుక్
-
Jul 27, 2026 15:43 IST
హైడ్రా కమిషనర్ పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించండి.. హైకోర్టు ఆదేశం
కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరైంది కాదు: హైకోర్టు
అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు సూచన
63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై హైకోర్టు ఆగ్రహం
లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టిన హైకోర్టు
-
Jul 27, 2026 15:37 IST
తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలు
కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందంటూ రంగనాథ్ అఫిడవిట్
లోతుకుంట సర్వే నెంబర్ 1, 2లోని భూమిలోకి వెళ్లలేదు: రంగనాథ్
కోర్టుకు పిటిషనర్ అవాస్తవాలు చెప్పారు: రంగనాథ్
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి: హైకోర్టు
కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఇన్ని ఎక్కువ ఎందుకు ఉన్నాయి?: హైకోర్టు
-
Jul 27, 2026 15:33 IST
జింబాబ్వే సిరీస్ తర్వాత భారత కోచ్‌పై చర్చ!
తాత్కాలిక కోచ్ లక్ష్మణ్ నేతృత్వంలో జింబాబ్వేతో సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్
వీవీఎస్ లక్ష్మణ్‌ను పూర్తి స్థాయి కోచ్‌గా నియమించాలంటూ వార్తలు
వార్తలపై స్పందించిన వీవీఎస్ లక్ష్మణ్
-
Jul 27, 2026 15:31 IST
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్: భారత్‌కు స్వర్ణం
25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఈషా సింగ్‌కు స్వర్ణం
మరో షూటర్ మను బాకర్‌కు కాంస్యం
-
Jul 27, 2026 15:29 IST
ఢిల్లి: దేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
BRS, కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల సింగరేణికి తీవ్ర నష్టం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సింగరేణికి BRS, కాంగ్రెస్ ప్రభుత్వాలు బకాయిలు పెట్టాయి: కిషన్‌రెడ్డి
సింగరేణి ఆదాయానికి భారీగా గండికొట్టారు: కిషన్‌రెడ్డి
సింగరేణికి కేంద్రం సహాయ, సహకారాలు అందిస్తోంది: కిషన్‌రెడ్డి
బొగ్గు గనుల వేలంలో నాడు BRS ప్రభుత్వం పాల్గొనలేదు: కిషన్‌రెడ్డి
-
Jul 27, 2026 15:25 IST
సికింద్రాబాద్ యశోద ఆస్పత్రికి KCR
BRS నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి KCR పరామర్శ
సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై KCR ఆరా
-
Jul 27, 2026 15:11 IST
భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
800 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్
200 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ
-
Jul 27, 2026 14:55 IST
ఢిల్లీ: ఏపీ పౌర సరఫరాలశాఖ–NCCF మధ్య ఒప్పందం
ఏపీలో 1,000 'మీ మార్ట్స్' ఏర్పాటుకు MoUపై సంతకాలు
తొలిదశలో పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 'మీ మార్ట్స్'
రేషన్ దుకాణాల ద్వారా అందుబాటులోకి 'మీ మార్ట్స్' సేవలు
-
Jul 27, 2026 14:52 IST
కాసేపట్లో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి కేసీఆర్
బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్
ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్న బీఆర్ఎస్ నాయకులు
-
Jul 27, 2026 14:43 IST
కృష్ణా ట్రైబ్యునల్ తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం
ప్రత్యేక బెంచ్ ముందు విచారణకు నివేదిస్తామన్న CJI
తదుపరి విచారణ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా
తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వాలన్న కర్ణాటక విజ్ఞప్తిని తోసిపుచ్చిన CJI
-
Jul 27, 2026 14:42 IST
చిత్తూరు: శాంతిపురం మండలం కడపల్లి దగ్గ రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురి మృతి
మరో ఐదుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
-
Jul 27, 2026 14:41 IST
సుప్రీం కోర్టులో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్ కొట్టివేత
ఏపీ లిక్కర్ కేసులో దొడ్డా వెంకట సత్యప్రసాద్‌కు ముందస్తు బెయిల్‌ను కొట్టివేయాలని ఎల్‌ఓపీ దాఖలు
అప్రూవర్‌గా మార్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న చెవిరెడ్డి
అనుమానాలుంటే అభ్యంతరాలతో కోర్టును ఆశ్రయించవచ్చన్న CJI జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం
చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పిటిషన్‌ను డిస్మిస్ చేసిన CJI ధర్మాసనం
-
Jul 27, 2026 14:39 IST
సమావేశాలకు పదే పదే అడ్డు తగలడం సరికాదు: స్పీకర్ ఓంబిర్లా
సమావేశాలు సజావుగా సాగేందుకు సభ్యులు సహకరించాలి: స్పీకర్ ఓంబిర్లా
లోక్‌సభలో చర్చకు తగినంత సమయం ఇస్తాం: స్పీకర్
ముందే నిర్ణయించిన సమయం కంటే ఎక్కువ ఇస్తాం: స్పీకర్
అందరూ చర్చకు సహకరించాలి: స్పీకర్
విద్యార్థుల భవిష్యత్‌పై చర్చలో పాల్గొనాలి: స్పీకర్ ఓంబిర్లా
-
Jul 27, 2026 14:09 IST
పార్లమెంట్ ఉభయసభలు మరోసారి వాయిదా
విపక్షాల ఆందోళనలతో వాయిదాపడ్డ ఉభయసభలు
రాజ్యసభ మధ్యాహ్నం 3గంటలకు, లోక్‌సభ సాయంత్రం 5గంటలకు వాయిదా
-
Jul 27, 2026 14:02 IST
అమరావతి: విద్యార్థిని శివాని మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు
గిరిజన బిడ్డ తనువు చాలించడం బాధాకరం: సీఎం చంద్రబాబు
శివాని మృతిపై దర్యాప్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
శివాని కుటుంబానికి అండగా ప్రభుత్వం: సీఎం చంద్రబాబు
-
Jul 27, 2026 13:38 IST
హైదరాబాద్: మధ్యాహ్నం 3గంటలకు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి కేసీఆర్
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్న కేసీఆర్
సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకోనున్న కేసీఆర్
-
Jul 27, 2026 13:37 IST
జమ్మూకశ్మీర్ లైబ్రరీల్లో వివాదాస్పద పుస్తకాలు
వేర్పాటువాద పుస్తకాలపై బీజేపీ ఆగ్రహం
జమ్మూ విద్యాశాఖ మంత్రి రాజీనామాకు బీజేపీ డిమాండ్
వివాదాస్పద పుస్తకాలపై విచారణకు బీజేపీ డిమాండ్
పుస్తకాల వెనుక కుట్ర ఉందని బీజేపీ ఆరోపణ
-
Jul 27, 2026 13:30 IST
ఢిల్లీ: ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
రామాలయానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఆలయ నిర్మాణానికి కలెక్టర్ ఇచ్చిన ఎన్‌ఓసీని సమర్ధించిన సుప్రీంకోర్టు
ప్రభుత్వ స్థలంలో గుడి నిర్మాణంలో తప్పులేదన్న సుప్రీంకోర్టు
-
Jul 27, 2026 13:25 IST
ఏలూరు: పోలవరం ఎగువ కాఫర్ డ్యాం దగ్గర ఇద్దరు గల్లంతు
గ్యాప్-2 సమీపంలో డి వాటరింగ్ కెనాల్‌లో పడి గల్లంతు
గల్లంతైన వారి కోసం NDRF బృందాల గాలింపు
గల్లంతైనవారు ప్రాజెక్టు సిబ్బందిగా గుర్తింపు
-
Jul 27, 2026 13:25 IST
ఢిల్లీ: మేదాంత ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్
విద్యావిధానంలో మార్పులు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన సోనమ్ వాంగ్‌చుక్
రాజ్‌ఘాట్‌లో మహాత్మాగాంధీ స్మృతికి నివాళులర్పించనున్న వాంగ్‌చుక్
రాజ్‌ఘాట్ నుంచి లద్దాఖ్ వెళ్లనున్న సోనమ్ వాంగ్‌చుక్
-
Jul 27, 2026 13:24 IST
ఢిల్లీ: విద్యార్థులపై దాడి పట్ల మల్లికార్జున ఖర్గే ఆగ్రహం
విద్యార్థులపై దాడి అప్రజాస్వామికం: ఖర్గే
అమిత్ షా జవాబుదారీగా ఉండాలి: ఖర్గే
విద్యార్థులను నేరస్థుల్లా చూడొద్దు: ఖర్గే
-
Jul 27, 2026 13:07 IST
హైదరాబాద్: ఎస్ఆర్ నగర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలో చోరీకి యత్నం
ట్రాఫిక్ పోలీసుల అప్రమత్తతతో నిందితుడి అరెస్ట్
-
Jul 27, 2026 13:05 IST
ఢిల్లీ: విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజు
లీకేజీల నిరోధానికి చరిత్రాత్మక బిల్లు తెచ్చాం: కిరణ్ రిజిజు
పరీక్షల బిల్లుపై చర్చకు సహకరించాలి: కిరణ్ రిజిజు
పేపర్ లీక్‌లపై కఠిన చట్టాలు తీసుకొచ్చాం: కిరణ్ రిజిజు
-
Jul 27, 2026 13:04 IST
ఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక వ్యాఖ్యలు
కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదు: సౌరవ్ దాస్
నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పారు: సౌరవ్ దాస్
అయినప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు పెడుతున్నారు: సౌరవ్ దాస్
అస్సాం, బెంగాల్, బిహార్‌లో ఎక్కువ కేసులు పెట్టారు: సౌరవ్ దాస్
-
Jul 27, 2026 12:33 IST
తూర్పుగోదావరి: గోపాలపురం మండలంలో పులి కలకలం
కరకపాడు-నందిగూడెం అటవీ ప్రాంతంలో పులి పాదముద్రల గుర్తింపు
పులి పాదముద్రలను పరిశీలించిన అటవీ అధికారులు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన
-
Jul 27, 2026 12:30 IST
పోలవరం: ఇర్లపల్లిలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
ఉరేసుకుని శివాని ఆత్మహత్య
ఇటీవల తల్లికి వందనం కార్యక్రమంలో చంద్రబాబుతో కలిసి భోజనం చేసిన శివాని
విద్యార్థిని శివానితో చంద్రబాబు సెల్ఫీ
విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది
-
Jul 27, 2026 12:28 IST
బిహార్: ఏకే-47తో కాల్పులు.. పోలీసు సస్పెన్షన్
విద్యార్థుల నిరసనల్లో కాల్పుల కలకలం
బిహార్ పోలీసుపై సస్పెన్షన్ వేటు
ఏకే-47తో కాల్పులు జరిపిన వీడియో వైరల్
-
Jul 27, 2026 12:14 IST
ఢిల్లీ: లోక్‌సభ ముందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు
విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రమంత్రి జితేంద్ర సింగ్
కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాల నినాదాలు
లోక్‌సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా
అన్ని అంశాలపై చర్చిద్దామన్న లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా
బిల్లుపై సవరణలకు ఒంటిగంట వరకు సమయం ఇచ్చిన స్పీకర్
బిల్లుపై అన్ని పార్టీలు మాట్లాడాలి: స్పీకర్ ఓం బిర్లా
-
Jul 27, 2026 12:06 IST
ఢిల్లీ: రాజ్యసభలో విపక్ష సభ్యుల ఆందోళన
రాజ్యసభ మ.2గంటలకు వాయిదా
-
Jul 27, 2026 12:05 IST
పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన
నీట్ సహా పలు అంశాలపై చర్చకు పట్టు
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వాడారంటూ నిరసన
-
Jul 27, 2026 11:58 IST
జనగామ జిల్లాలో అబార్షన్‌తో గర్భిణి మృతి
మూడో కాన్పులోనూ ఆడబిడ్డ అని చెప్పడంతో అబార్షన్
అబార్షన్ చేసిన ఏఎన్ఎం.. సహకరించిన ఆర్ఎంపీ డాక్టర్, గర్భిణి తల్లి
అబార్షన్ వికటించి తీవ్ర రక్తస్రావం.. పలు ఆస్పత్రుల్లో చేరిక
పరిస్థితి విషమించి గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
మృతురాలి భర్త ఫిర్యాదుతో నలుగురిపై కేసు నమోదు
-
Jul 27, 2026 11:57 IST
ఏపీ అభివృద్ధిని చూసి వైసీపీ ఓర్వలేకపోతోంది: బుద్దా వెంకన్న
కులమతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలను జగన్ ప్రోత్సహిస్తున్నారు: బుద్దా వెంకన్న
ప్రభుత్వంపై బురద జల్లడమే జగన్ విధానం: బుద్దా వెంకన్న
వైసీపీ ట్రాప్‌లో ప్రజలు పడొద్దు: నేత బుద్దా వెంకన్న
-
Jul 27, 2026 11:20 IST
ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీకి కేటీఆర్
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కేటీఆర్ భేటీ
సిరిసిల్ల రైల్వే లైన్ కోసం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేయనున్న కేటీఆర్
రాత్రి బ్రిటీష్ ఎంపీ ఉదయ్ నాగరాజు ఏర్పాటు చేసిన గెట్ టుగెథర్‌లో పాల్గొననున్న కేటీఆర్
బ్రిటన్ ఎంపీగా ఎన్నికైన తెలంగాణకు చెందిన ఉదయ్ నాగరాజు
-
Jul 27, 2026 11:18 IST
ఢిల్లీ: ‘ఛలో సంసద్’పై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు
శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు: సుప్రీంకోర్టు
పోలీసుల బలప్రయోగాన్ని సమర్థించలేం: సుప్రీంకోర్టు
పోలీసులపై ఆకతాయిల దాడులు ఆందోళనకరం: సుప్రీంకోర్టు
నిరసనలకు దేశవ్యాప్తంగా ఏకరూప మార్గదర్శకాలు అవసరం: సుప్రీంకోర్టు
సంఘ విద్రోహులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారం: సుప్రీంకోర్టు
-
Jul 27, 2026 11:13 IST
ఢిల్లీ: పార్లమెంటుకు చేరుకున్న కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
ధర్మేంద్ర ప్రధాన్‌కు ఘన స్వాగతం పలికిన బీజేపీ- ఎన్డీఏ ఎంపీలు
‘ధర్మేంద్ర ప్రధాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు
-
Jul 27, 2026 11:11 IST
లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా
-
Jul 27, 2026 11:04 IST
ప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలు
-
Jul 27, 2026 10:58 IST
వాషింగ్టన్: సియాటెల్ ఫుడ్ ఫెస్టివల్‌లో కాల్పులు
కాల్పుల్లో ఇద్దరి మృతి.. ఐదుగురికి గాయాలు
స్పేస్ నీడిల్ సమీపంలో ఘటన
బైట్ ఆఫ్ సియాటెల్ ఫెస్టివల్‌లో కాల్పులతో కలకలం
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
-
Jul 27, 2026 10:50 IST
హైదరాబాద్: కృష్ణా జలాలపై బీఆర్ఎస్ డ్రామాలాడుతోంది: మంత్రి వాకిటి శ్రీహరి
కృష్ణా నీటిపై మాట్లాడే హక్కు బీఆర్ఎస్‌కు లేదు: వాకిటి శ్రీహరి
పాలమూరు ప్రజలను మోసం చేయొద్దు: వాకిటి శ్రీహరి
జూరాల రైతులను బీఆర్ఎస్ పట్టించుకోలేదు: మంత్రి వాకిటి
బీఆర్ఎస్ దుష్ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు: మంత్రి వాకిటి శ్రీహరి
-
Jul 27, 2026 10:39 IST
నిజామాబాద్: ఎస్ఆర్ఎస్‌పీ బ్యాక్ వాటర్‌లో గల్లంతైన నాలుగు మృతదేహాల వెలికితీత
అమ్ము, ఖలీమ్, అజీమ్ మృతదేహాలను నిన్న వెలికితీయగా.. ఇవాళ అర్హాన్ డెడ్ బాడీ లభ్యం
మృతులు నిజామాబాద్ నగర వాసులుగా గుర్తింపు
-
Jul 27, 2026 10:37 IST
వైభవ్ సూర్యవంశీపై వీవీఎస్ లక్ష్మణ్ ప్రశంసలు
వైభవ్ సత్తాను రెండేళ్ల క్రితమే గుర్తించాం: లక్ష్మణ్
ఎప్పుడూ దూకుడుగా ఆడటమే వైభవ్ పని: లక్ష్మణ్
ఫిట్‌నెస్‌పై వైభవ్ మరింత దృష్టి పెట్టాలని సూచించిన వీవీఎస్
-
Jul 27, 2026 10:36 IST
ఐరోపాలో కార్చిచ్చు.. 3 లక్షల మంది తరలింపు
ఫ్రాన్స్, స్పెయిన్‌లలో విలయం!
ఫ్రాన్స్‌లో నగర సరిహద్దుల దాకా చేరిన మంటలు
స్పెయిన్‌లోనూ పరిస్థితి అత్యంత భయానకం
రంగంలోకి ఐరోపా సమాఖ్య (EU).. అంతర్జాతీయ సాయం
-
Jul 27, 2026 10:29 IST
భారతరత్న డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం చంద్రబాబు
దేశానికి ఎన్నో శాస్త్ర, సాంకేతిక విజయాలు అందించారు: సీఎం
-
Jul 27, 2026 10:26 IST
సీఆర్పీఎఫ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
సీఆర్పీఎఫ్ సిబ్బంది ధైర్యసాహసాలకు అభినందనలు: పవన్
దేశ అంతర్గత భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర: పవన్
ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై పోరులో సీఆర్పీఎఫ్ సేవలు ప్రశంసనీయం: పవన్
సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబాల త్యాగాలకు వందనం: పవన్ కల్యాణ్
-
Jul 27, 2026 10:14 IST
ఢిల్లీ: లోక్‌సభ, రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్
జూలై 20న ఢిల్లీలో విద్యార్థుల నిరసనలపై జరిగిన ఘటనపై చర్చించాలని డిమాండ్
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు బల ప్రయోగం చేయడంపై సభలో చర్చించాలని డిమాండ్
-
Jul 27, 2026 10:03 IST
పెరిగిన బంగారం ధరలు
రూ.930 పెరిగి రూ.1,45,860కి చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం
రూ.850 తగ్గి రూ.1,33,700కి చేరిన 22క్యారెట్ల 10గ్రా. బంగారం
కిలో వెండి ధర రూ.2,40,000..
-
Jul 27, 2026 10:01 IST
ఢిల్లీ: కాసేపట్లో రాహుల్ గాంధీ ఛాంబర్‌లో ఇండీ కూటమి నేతల భేటీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తదనంతర పరిణామాలు, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
-
Jul 27, 2026 09:54 IST
చిత్తూరు: నేటి నుంచి 4 రోజులు కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లి, కుప్పంలో భువనేశ్వరి పర్యటన
NTR మెమోరియల్ ట్రస్ట్, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్న భువనేశ్వరి
-
Jul 27, 2026 09:30 IST
నేడు లోక్‌సభ ముందుకు పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లు
-
Jul 27, 2026 09:02 IST
హైదరాబాద్: కొండాపూర్‌లో విదేశీ యువతి పట్ల అనుచిత ప్రవర్తన
తన బాయ్ ఫ్రెండ్ కోసం మార్చిలో ఇండియాకు వచ్చిన నెదర్లాండ్స్ యువతి
యువతిని వేధించిన బాయ్‌ఫ్రెండ్ స్నేహితుడు
గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు
-
Jul 27, 2026 08:58 IST
కర్నూలు: నగరంలోని ముజఫర్ నగర్‌లో యువకుల మధ్య ఘర్షణ
రఫీ, పవన్‌లపై కత్తితో దాడి చేసిన అరుణ్
ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Jul 27, 2026 08:55 IST
ఏలూరు: జిల్లాలోకి మళ్ళీ ప్రవేశించిన పెద్దపులి
పోలవరం మండలం ఎల్‌ఏండి పేట శివారు ఒంటికొండ మెట్ట వద్ద పులి పాద ముద్రలను గుర్తించిన అటవీ శాఖ అధికారులు
-
Jul 27, 2026 08:47 IST
హైకోర్టులో నేడు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డి పిటిషన్ విచారణ
తనపై నమోదైన వేధింపుల కేసును కొట్టివేయాలని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ పిటిషన్
కేసు నమోదు తర్వాత ఉదయ్ ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత అజ్ఞాతంలోకి ఉదయ్ కృష్ణారెడ్డి
-
Jul 27, 2026 08:47 IST
హైదరాబాద్: ఇండిగో విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత
ఎయిర్‌పోర్ట్‌లో ఆస్పత్రికి తరలింపు
చికిత్స పొందుతూ వికాస్ పాశ్వాన్ (26) మృతి
హైదరాబాద్-పట్నా విమానంలో ఘటన
-
Jul 27, 2026 08:29 IST
క్షిపణుల కొరత వార్తలపై మండిపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
ప్రపంచంలో ఎవరి దగ్గరా లేనంత, కావలసిన దానికంటే చాలా ఎక్కువ ఆయుధ సంపత్తి తమ వద్ద ఉందన్న ట్రంప్
మీడియా కథనాలను తోసిపుచ్చిన అమెరికా అధ్యక్షుడు
-
Jul 27, 2026 07:19 IST
నేడు నెల్లూరులో విద్యార్థినులకు 10వేల సైకిళ్ల పంపిణీ
మంత్రి నారాయణ సొంత నిధులతో మెగా కార్యక్రమం
అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్న లోకేష్
10వేల సైకిళ్ల పంపిణీతో వరల్డ్ రికార్డ్ లక్ష్యం
గిన్నిస్‌బుక్ ప్రతినిధుల పర్యవేక్షణలో కార్యక్రమం
-
Jul 27, 2026 07:18 IST
నేడు 6వ రోజు పార్లమెంట్ సమావేశాలు
నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీఛార్జి అంశంలో ఉభయ సభల్లో విపక్షాల వాయిదా తీర్మానాలు
మోదీ పాలనలో పేపర్ లీక్‌లతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించనున్న విపక్షాలు
-
Jul 27, 2026 07:17 IST
విజయవాడ: నేటి నుంచి దుర్గగుడిలో శాకంబరి ఉత్సవాలు
ఇంద్రకీలాద్రిపై 3 రోజులు శాకంబరి ఉత్సవాలు
-
Jul 27, 2026 07:16 IST
అమెరికాతో కాల్పుల విరమణ చర్చలపై పట్టుబిగిస్తోన్న ఇరాన్
కాల్పుల విరమణ చర్చలకు మూడు షరతులు విధించిన ఇరాన్
హోర్ముజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందన్న IRGC
హోర్ముజ్ పూర్తిగా తమ నియంత్రణలోనే ఉండేందుకు అంగీకరించాలన్న ఇరాన్
కొత్త మార్గాలకు అంగీకరించబోమని స్పష్టం చేసిన ఇరాన్
-
Jul 27, 2026 07:15 IST
జూరాలను తాకిన కృష్ణమ్మ
నేడు MGLI నుంచి రిజర్వాయర్లకు నీరు విడుదల
-
Jul 27, 2026 07:14 IST
నేడు ఉదయం ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి
AICC సమావేశానికి హాజరుకానున్న రేవంత్‌రెడ్డి
-
Jul 27, 2026 07:13 IST
బెంగాల్-ఉత్తర ఒడిశా తీరంలో వాయుగుండంగా మారిన అల్పపీడనం
ఇవాళ చాంద్‌బలి-కానింగ్ మధ్య తీరం దాటే అవకాశం
ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం
నేడు ఉత్తరాంధ్రలో ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్
ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉండే ఛాన్స్
కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ. వేగంతో గాలులు విచే ఛాన్స్