-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP Telangana National and International breaking Live Updates of 12th August 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Aug 12 , 2026 | 05:54 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Aug 12, 2026 21:24 IST
BRS మాజీ MLA రేగా కాంతారావు అరెస్ట్
లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో రేగా కాంతారావు అరెస్ట్
బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
రేగా కాంతారావుపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు
ఇప్పటికే తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు
-
Aug 12, 2026 21:09 IST
మంజీరా బ్యారేజ్ మరమ్మతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
మంజీరా బ్యారేజ్ మరమ్మతులకు రూ.14.20 కోట్లు మంజూరు
డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ సూచనలతో మరమ్మతులకు శ్రీకారం
భారీ వరదలతో మంజీరా బ్యారేజ్ ఏప్రాన్‌కు దెబ్బతిన్న నిర్మాణ భాగాలు
-
Aug 12, 2026 20:53 IST
హైదరాబాద్: ఉచిత పథకాల అమలుపై హైకోర్టులో పిటిషన్
తదుపరి విచారణ వరకు చెల్లింపులు చేయొద్దని ఆదేశం
తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై హైకోర్టు స్టే
మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ హైకోర్టు
-
Aug 12, 2026 20:49 IST
హైడ్రా చర్యలపై హైకోర్టు ఆగ్రహం
కోర్టు పరిధిలోని అంశాలపై జోక్యం తగదన్న హైకోర్టు
కూల్చివేతలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు ఆదేశం
కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు ఆదేశం
తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా
-
Aug 12, 2026 19:32 IST
ఢిల్లీ విమానాశ్రయంలో కలకలం.. ప్రయాణికుడి హ్యాండ్‌బ్యాగ్‌లో కోతి పుర్రె
ఢిల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికుడి బ్యాగ్‌లో కనిపించిన వింత వస్తువు
ఎక్స్-రే మిషన్ తనిఖీల్లో కనిపెట్టిన సీఐఎస్ఎఫ్ సిబ్బంది
వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 1972 కింద కేసు నమోదు
కేసును లోతుగా విచారిస్తున్న పోలీసులు, అటవీ శాఖ అధికారులు
-
Aug 12, 2026 19:08 IST
విజయవాడ: జిల్లా కోర్టులో లొంగిపోయిన మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్ CEO పసుపులేటి అంకుశం
ఈ నెల 28 వరకు రిమాండ్
స్క్రబ్ తయారీ పెట్టుబడుల పేరుతో వేలాది మంది బాధితుల నుంచి వందల కోట్ల వసూలు
-
Aug 12, 2026 19:00 IST
సీఎం రేవంత్‌రెడ్డికి TBJP చీఫ్ రాంచందర్‌రావు లేఖ
ఎలివేటెడ్ కారిడార్ రాజీవ్ రహదారి నిర్మాణంతో నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని రాంచందర్‌రావు విజ్ఞప్తి
-
Aug 12, 2026 18:49 IST
హైదరాబాద్: సర్జరీ విజయవంతమై కోలుకుంటున్నా: 'X'లో జూ.ఎన్టీఆర్
కిమ్స్ వైద్య బృందానికి కృతజ్ఞతలు: జూ.ఎన్టీఆర్
మీ అందరి అండతో త్వరలో మీ ముందుకు వస్తా: జూ.ఎన్టీఆర్
నా క్షేమం కోరుకున్న అందరికీ కృతజ్ఞతలు: జూ.ఎన్టీఆర్
-
Aug 12, 2026 18:43 IST
అమరావతి: సీఎం చంద్రబాబుతో GST కౌన్సిల్ అధికారుల సమావేశం
దేశానికే ఆదర్శంగా ఏపీ AI ఆధారిత పన్నుల పరిపాలన
ఏపీ పన్నుల శాఖ సంస్కరణలకు GST కౌన్సిల్ అధికారుల ప్రశంసలు
AI ఆధారిత పన్నుల పరిపాలన దేశవ్యాప్తంగా అమలుకు నమూనా: GST అధికారులు
సీఎం చంద్రబాబుతో సమావేశమైన GST కౌన్సిల్ సెక్రటేరియట్ సీనియర్ అధికారులు
APCTDలో AI ఆధారిత రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలను పరిశీలించిన GST అధికారులు
-
Aug 12, 2026 18:39 IST
రాజ్యసభలో కేరళ పేరు మార్పు బిల్లుపై చర్చ
అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదించింది: ఎంపీ విజయ్
మావిగన్ అంటూ కొందరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు: ఎంపీ విజయ్
ఎంపీ చింతకాయల విజయ్ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీల అభ్యంతరం
-
Aug 12, 2026 18:37 IST
ఏపీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష
పాల్గొన్న హోంమంత్రి అనిత, డీజీపీ ఇతర ఉన్నతాధికారులు
శాంతిభద్రతలు, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ
సైబర్ క్రైమ్, బ్లేడ్, గంజాయి బ్యాచ్‌ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి: చంద్రబాబు
సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల కట్టడిపై పోలీసులకు సూచనలు
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు స్టేషన్ల పనితీరుపై క్షేత్రస్థాయిలో SHOలు, ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
-
Aug 12, 2026 18:25 IST
భూపాలపల్లి జిల్లా కోర్టులో మేడిగడ్డ కేసు విచారణ
మేడిగడ్డ బ్యారేజ్ కేసు విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా
మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి సమన్లు
కేసీఆర్‌కు గతంలో జారీచేసిన సమన్లు అందకపోవడంతో మళ్లీ నోటీసులు
పిటిషనర్ రాజలింగమూర్తి మరణించినా గతంలో హైకోర్టు ఆదేశాలతో కొనసాగుతున్న విచారణ
-
Aug 12, 2026 18:08 IST
హైదరాబాద్: ఆగస్టు 13న ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు సన్మానం: మంత్రి అజహరుద్దీన్
సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విద్యార్థుల సన్మాన కార్యక్రమం: మంత్రి అజహరుద్దీన్
గ్రూప్-1, గ్రూప్-2లో ప్రతిభ చూపిన మైనారిటీ విద్యార్థులకు సన్మానం: మంత్రి అజహరుద్దీన్
IIT-JEE, EAPCETలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సన్మానం: మంత్రి అజహరుద్దీన్
-
Aug 12, 2026 18:07 IST
మహిళా సంఘాలకు మిల్లింగ్ బాధ్యతలు అప్పగించే సీఎం నిర్ణయంపై మంత్రి సీతక్క హర్షం
మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకే ఈ నిర్ణయం: మంత్రి సీతక్క
మహిళా సంఘాల సాధికారతకు సీఎం నిర్ణయం మరో ముందడుగు: సీతక్క
-
Aug 12, 2026 17:51 IST
ఢిల్లీ: మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ కమిటీ నివేదిక
జస్టిస్ యశ్వంత్ వర్మ దుష్ప్రవర్తన నిరూపితమైంది: త్రిసభ్య కమిటీ
జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అపారమైన నగదు నిల్వలు ఉన్నాయి: త్రిసభ్య కమిటీ
న్యాయమూర్తుల(విచారణ) చట్టం-1968 ప్రకారం నమోదైన మూడు ప్రధాన ఆరోపణలు రుజువయ్యాయి: త్రిసభ్య కమిటీ
విచారణ ముగింపు దశలో ఏకపక్షంగా వైదొలగిన జస్టిస్ యశ్వంత్ వర్మ కుట్ర వాదనకు ఆధారాలు లేవు: త్రిసభ్య కమిటీ
-
Aug 12, 2026 17:32 IST
మాజీ MLA రేగా కాంతారావు ముందస్తు బెయిల్ పిటిషన్
లైంగిక దాడి చేశారన్న యువతి ఫిర్యాదుతో పంజాగుట్ట పీఎస్‌లో రేగా కాంతారావుపై కేసు నమోదు
FIR క్వాష్ చేయాలన్న పిటిషన్‌పై తీర్పు రిజర్వ్
అప్పటివరకు పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ రేగా కాంతారావు పిటిషన్
-
Aug 12, 2026 17:32 IST
GRMB ఎజెండాపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు
ఈ నెల 18న GRMB సమావేశం
తెలంగాణ ప్రాజెక్టులపై మూడు అంశాలు ఎజెండాలో పెట్టడంపై అభ్యంతరం
సమ్మక్క బ్యారేజీకి అనుమతులు నిలిపివేయాలన్న అంశాన్ని తొలగించాలి: ప్రభుత్వం
ప్రాజెక్టుల TAC అనుమతుల వివరాల అంశం తొలగించాలి: ప్రభుత్వం
-
Aug 12, 2026 17:29 IST
హైదరాబాద్: ఈ నెల 17న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి
-
Aug 12, 2026 17:27 IST
నంద్యాల: శ్రీశైలం CI జీవన్ గంగనాథ్‌బాబు, దేవస్థానం భద్రతాధికారి మధ్య ఫోన్‌లో వాగ్వాదం
ఆలస్యంగా వెలుగులోకి ఫోన్ కాల్ సంభాషణ
దర్శనం సమయం ముగియడంతో లోపలికి వెళ్లకూడదంటూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అడ్డంకులు
నువ్వు ఎవరు నాకు చెప్పేదంటూ CSOతో సీఐ గంగనాథ్ వాగ్వాదం
CSOతో దురుసుగా మాట్లాడిన సీఐ ఫోన్ కాల్ ఆడియో వైరల్
-
Aug 12, 2026 17:12 IST
పల్నాడు: ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
పాడేరు DSP వెన్నా రాజసింహారెడ్డిపై కేసు నమోదు
నరసరావుపేట రూరల్ పీఎస్‌లో పాడేరు DSPపై కేసు నమోదు
DSP హోదాతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు అభియోగాలు
DSPతో పాటు ఆయన కుటుంబసభ్యులపై కేసు నమోదు
-
Aug 12, 2026 17:05 IST
అమరావతి: స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లును పరిశీలించిన మంత్రి నారాయణ
2 స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును త్వరలో ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
-
Aug 12, 2026 16:51 IST
అమరావతి: రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు సెలెక్ట్ కమిటీ సమావేశం
అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహణ
కమిటీ ఛైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సమావేశం
హేట్ స్పీచ్ బిల్లుపై చర్చించనున్న సెలెక్ట్ కమిటీ
-
Aug 12, 2026 16:41 IST
జగన్ వ్యవహారశైలిని ప్రజలు గమనిస్తున్నారు: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
అసెంబ్లీకి రావట్లేదని జగన్ చెప్పడం విడ్డూరం: ఎంపీ కలిశెట్టి
నాలుగు గోడల మధ్య రాజకీయం చేయడం, గొడవలు సృష్టించడం మాత్రమే జగన్‌కు తెలుసు: ఎంపీ
ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేనని జగన్ తెలుసుకోవాలి: ఎంపీ కలిశెట్టి
వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితం: ఎంపీ కలిశెట్టి
-
Aug 12, 2026 16:29 IST
జూనియర్ ఎన్టీఆర్ భుజానికి సర్జరీ విజయవంతం
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్‌కు సర్జరీ
ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో జూనియర్ ఎన్టీఆర్
ఎన్టీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది: కిమ్స్ వైద్యులు
-
Aug 12, 2026 16:28 IST
ఏపీలో శాంతిభద్రతలపై సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరైన 1,300 మంది పోలీస్ సిబ్బంది
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న SHOలు
క్షేత్రస్థాయి నివేదికలతో హాజరైన ఉన్నతాధికారులు
పోలీస్ స్టేషన్ల పనితీరుపై సీఎం చంద్రబాబు ఫోకస్
మహిళలు, బలహీనవర్గాల భద్రతపై సీఎం దిశానిర్దేశం
-
Aug 12, 2026 16:15 IST
అమరావతి: రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు SIPB ఆమోదం
వివిధ ప్రాజెక్టుల ద్వారా 21,627 మందికి ఉద్యోగాల కల్పన
-
Aug 12, 2026 16:07 IST
సంగారెడ్డి: జిల్లా కలెక్టరేట్ వద్ద స్పల్ప ఉద్రిక్తత
స్కాలర్‌షిప్‌లు, ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా
విద్యార్థులు, పోలీసుల మధ్య తోపులాట
ఆందోళన చేస్తున్న ఏబీవీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
Aug 12, 2026 16:06 IST
అమరావతి: సభకు రాని వారు MLAలుగా ఎందుకు?: స్పీకర్ అయ్యన్న పాత్రుడు
కొందరు MLAల దొంగ సంతకాల నియంత్రణకే ఫొటో రికగ్నైజేషన్ పెట్టాం: స్పీకర్
6 నెలలుగా సభకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం వివిధ స్థాయిలో చర్చ జరుగుతోంది: స్పీకర్
-
Aug 12, 2026 15:49 IST
హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్‌లో వర్షం
గోల్కొండ, మెహిదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీ, మాదాపూర్‌లో వర్షం
-
Aug 12, 2026 15:39 IST
నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
188 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
36 పాయింట్ల నష్టంతో ముగిసిన నిఫ్టీ
-
Aug 12, 2026 15:28 IST
ఢిల్లీ: ఆగస్టు 19వ తేదీన సీడబ్ల్యూసీ సమావేశం
విద్యార్థుల నిరసనలు, రామ మందిరంలో విరాళాల దుర్వినియోగంపై చర్చ
దేశంలో నెలకొన్న తాజా పరిణామాలపైనా చర్చించే అవకాశం
-
Aug 12, 2026 15:27 IST
ప్రతిపక్షాలు అరాచక మనస్తత్వాన్ని బయటపెడుతున్నాయి: బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్
పార్లమెంట్ సమావేశాలకు అంతరాయం కలిగిస్తూ, కీలక అంశాలపై చర్చలను అడ్డుకుంటున్నారు: నబీన్
చర్చల నుంచి ఎవరు పారిపోతున్నారో ప్రజలు గమనిస్తున్నారు: నితిన్ నబీన్
మోదీ ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ, సభకు అంతరాయం కలిగించడానికే మొగ్గు చూపుతున్నారు: నబీన్
-
Aug 12, 2026 15:20 IST
అమరావతి: అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్
మంత్రులతో వివిధ అంశాలపై చంద్రబాబు చర్చ
వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి: సీఎం
ఇటీవల ఇంత అన్యాయంగా జవాబుపత్రాల మూల్యాంకనం జరగలేదు: చంద్రబాబు
మూడుసార్లు పేపర్లు వాల్యూయేషన్ చేయడం ఏంటి?: చంద్రబాబు
సిట్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించింది.. దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే: సీఎం
మంత్రులందరూ సిట్ రిపోర్ట్‌పై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయాలని దిశానిర్దేశం
-
Aug 12, 2026 15:17 IST
మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం
విపక్షాల నిరసనల మధ్యే బిల్లుకు ఆమోదం
గందరగోళం మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా
-
Aug 12, 2026 15:16 IST
టాప్ ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ ఆడాలి: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్
దేశవాళీ క్రికెట్‌పై కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు
అగ్రశ్రేణి ఆటగాళ్లపై కపిల్ దేవ్ అసంతృప్తి
దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్న కపిల్
మల్టీ డే మ్యాచ్‌లు ఆడేలా బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి: కపిల్
-
Aug 12, 2026 15:04 IST
నీట్ పేపర్ లీక్ కేసులో 13 మందిపై CBI అభియోగాలు
20 వేల పేజీలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన CBI
CBI అభియోగాలపై రేపు రౌస్ అవెన్యూ కోర్టు విచారణ
-
Aug 12, 2026 14:45 IST
హైదరాబాద్: నీటిపారుదలశాఖపై సీఎం రేవంత్ సమీక్ష
-
Aug 12, 2026 14:42 IST
ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసల జల్లు
చంద్రబాబు విజనరీ లీడర్.. అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి ముర్ము
ఏ పని చేసినా అద్భుతంగా చేయడం చంద్రబాబు ప్రత్యేకత: ద్రౌపది ముర్ము
నిరంతర శ్రమ, దార్శనికత కలిగిన చంద్రబాబు అభివృద్ధికి చిరునామా: రాష్ట్రపతి
-
Aug 12, 2026 14:36 IST
సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి పర్యటనలో స్వల్ప మార్పు
సీఎం రేవంత్ హెలిప్యాడ్ స్థలం మార్చిన ఉన్నతాధికారులు
ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్న సీఎం
ఈ నెల 15న IIT హైదరాబాద్ క్యాంపస్‌లో ల్యాండ్ కానున్న సీఎం హెలికాప్టర్
-
Aug 12, 2026 14:35 IST
ప.గో: కాళ్ళ మండలం సీసలిలో గంజాయి అమ్ముతున్న ముఠా అరెస్ట్
తొమ్మది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
2.25 కేజీల గంజాయి, 7 సెల్ ఫోన్లు స్వాధీనం
-
Aug 12, 2026 14:35 IST
కుత్బుల్లాపూర్: కొంపల్లిలో పేకాట రాయుళ్ల గుట్టు రట్టు చేసిన SOT పోలీసులు
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అపర్ణ సేరిన్ అపార్ట్మెంట్లో దాడులు
పోలీసులకు చిక్కిన మెదక్ మాజీ DCCB ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి
DCCB ఛైర్మన్ సహా మొత్తం 8 మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
రూ.3,28,000 నగదు స్వాధీనం చేసుకున్న SOT పోలీసులు
-
Aug 12, 2026 14:33 IST
అమరావతి: సీఎం చంద్రబాబు సెక్యూరిటీ చీఫ్, ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్
స్వాతంత్ర్య వేడుకల్లో ఎస్పీ భద్రయ్యకు ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ ప్రదానం చేయనున్న సీఎం చంద్రబాబు
-
Aug 12, 2026 14:32 IST
FCRA సవరణ బిల్లుపై లోక్‌సభలో దుమారం
బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: కేసీ వేణుగోపాల్
FCRA సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలి: కేసీ వేణుగోపాల్
మైనారిటీలే లక్ష్యంగా బిల్లు తయారుచేశారు: అఖిలేష్ యాదవ్
బిల్లుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికైనా సిద్ధం: కిరణ్ రిజిజు
లోక్‌సభ మ.3 గంటలకు వాయిదా
-
Aug 12, 2026 14:21 IST
లోక్‌సభ: FCRA సవరణ బిల్లుపై కీలక పరిణామం
బిల్లును JPCకి పంపాలని అమిత్ షా ప్రతిపాదన
ఉమ్మడి కమిటీలో మొత్తం 31 మంది ఎంపీల్లో 21 మంది లోక్‌సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు
కమిటీ సమావేశాల నిర్వహణకు 1/3 వంతు కోరమ్ తప్పనిసరిగా ఉండాలని ప్రతిపాదన
-
Aug 12, 2026 14:02 IST
అమరావతి: మాషా అల్లా ఎంటర్‌ప్రైజెస్ స్కాం బాధితులకు న్యాయం చేస్తాం: అనిత
బాధితుల సమస్యపై విజయవాడ సీపీతో హోంమంత్రి అనిత చర్చ
క్రైం డీసీపీ తిరుమలేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేశాం: హోంమంత్రి అనిత
బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు: హోంమంత్రి అనిత
ఆర్థిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత
-
Aug 12, 2026 14:01 IST
కొమురం భీం జిల్లా: కెరమెరి మండలం గొండుగూడ గ్రామంలో విషాదం
ప్రమాదవశాత్తు వాగులో పడి ఆత్రం లక్ష్మీ (4) అనే చిన్నారి మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 13:59 IST
నంద్యాలలో రెచ్చిపోయిన రౌడీషీటర్ ఇమ్రాన్
తన ఏరియాలోని బార్‌కు ఎలా వస్తారంటూ ముగ్గురిపై బీర్ బాటిల్‌తో దాడి
దాడిలో హరిజనపేటకు చెందిన రాజు, దేవా, మల్లికి తీవ్రగాయాలు
గాయపడిన ముగ్గురినీ నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
బార్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డైన దాడి దృశ్యాలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 13:50 IST
లోక్‌సభలో రేపు FCRA సవరణ బిల్లు పెట్టే అవకాశం
ప్రతిపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో బిల్లును JPCకి పంపే యోచనలో కేంద్రం
-
Aug 12, 2026 13:45 IST
వికారాబాద్: తాండూరులో భారీగా గంజాయి పట్టివేత
రూ.27లక్షల విలువైన 52.88 కేజీల గంజాయి సీజ్
ఒడిశా నుంచి మహారాష్ట్రకు గంజాయి అక్రమ రవాణా
ముగ్గురిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ అధికారులు
-
Aug 12, 2026 13:31 IST
ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా
కేవలం మండలికి వెళ్లాలని వైసీపీ నిర్ణయం
మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు ఎంపిక
అసెంబ్లీలో ఉన్నవి రెండు పక్షాలే.. మూడోది లేదు: బొత్స సత్యనారాయణ
మాకెందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు?: బొత్స
చట్టంలో ఉంటే డిస్‌క్వాలిఫై చేయండి: బొత్స సత్యనారాయణ
-
Aug 12, 2026 13:15 IST
హైదరాబాద్: తెలంగాణ నీటి వాటాల్లో రాజీపడేది లేదు: మంత్రి శ్రీధర్‌బాబు
GRMB సమావేశానికి హాజరవుతాం.. బలంగా కొట్లాడతాం: మంత్రి శ్రీధర్‌బాబు
అసత్యాలతో ప్రజలను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారు: శ్రీధర్‌బాబు
నిబంధనల ప్రకారమే భూ కేటాయింపులు: శ్రీధర్‌బాబు
5 ఎకరాల భూమిని రూ.7.5 కోట్లకు ఇచ్చాం: మంత్రి శ్రీధర్‌బాబు
-
Aug 12, 2026 13:00 IST
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం
పాల్గొన్న పలువురు మత్రులు
పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలపై చర్చ
37 ప్రాజెక్టులకు దాదాపు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడికి ప్రతిపాదనలు
-
Aug 12, 2026 12:44 IST
హోర్ముజ్ మా సొంతం.. ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక
హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ తమదేనన్న ట్రంప్
ఇరాన్ తమను రెచ్చగొడితే భారీ ప్రతిస్పందన ఉంటుందని వార్నింగ్
ఇరాన్ మొదటి నుంచీ అసత్యాలే చెబుతోందని మండిపాటు
-
Aug 12, 2026 12:32 IST
తమిళనాడు మంత్రి ఆదవ అర్జున కీలక వ్యాఖ్యలు
పార్లమెంట్‌లో అధికారం ఉత్తరాది రాష్ట్రాలకేనా: ఆదవ అర్జున
ఈరోజు అసెంబ్లీలో మన గొంతు వినపడుతోంది: ఆదవ అర్జున
రేపు పార్లమెంట్‌లో మన గొంతు వినిపిస్తుంది: మంత్రి ఆదవ అర్జున
5 దక్షిణాది రాష్ట్రాలు కలిస్తే ప్రధాని ఎవరనేది నిర్ణయించుకోవచ్చు: ఆదవ అర్జున
భవిష్యత్‌లో తమిళనాడు నుంచే ప్రధాని ఉండాలి: ఆదవ అర్జున
-
Aug 12, 2026 12:32 IST
అమిత్‌షా వ్యాఖ్యలకు రాహుల్‌గాంధీ కౌంటర్
విద్యార్థులపై లాఠీఛార్జ్ ఎవరు చేశారు?: రాహుల్ గాంధీ
కాల్పులకు ఆదేశించింది ఎవరు?: రాహుల్
20 రోజులుగా అమిత్‌షా ఎందుకు మాట్లాడలేదు?: రాహుల్
పార్లమెంట్ ముగిసే సమయానికి అమిత్‌షా డ్రామాలు ఆడుతున్నారు: రాహుల్ గాంధీ
-
Aug 12, 2026 12:31 IST
పార్లమెంట్‌లో చర్చకు నేను సిద్ధం: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
ప్రతి ప్రశ్నకూ సమాధానం చెబుతా: అమిత్‌షా
-
Aug 12, 2026 12:03 IST
మేడ్చల్: దేవర యాంజాల్‌లో అగ్నిప్రమాదం
కోల్డ్ రష్ లాజిస్టిక్స్ గోదాంలో చెలరేగిన మంటలు
2 గంటలుగా ఎగిసిపడుతున్న మంటలు, ఆలస్యంగా వచ్చిన ఫైరింజన్
మంటలార్పుతున్న రెండు ఫైరింజన్లు
-
Aug 12, 2026 12:02 IST
హైదరాబాద్: ఎన్నికల సంఘం పేరుతో సైబర్ మోసం
ECI అధికారి పేరుతో రిటైర్డ్ RBI ఉద్యోగికి ఫేక్ MMS
48 గంటల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలని మెసేజ్
వెరిఫికేషన్ కోసం రూ.4 చెల్లించాలని లింక్ పంపిన కేటుగాళ్లు
బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.3.27లక్షల మాయం
సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు, కేసు నమోదు
-
Aug 12, 2026 12:01 IST
క్యూర్ పరిధిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి రేపే శ్రీకారం
రేపు కూకట్‌పల్లిలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో 16 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ టవర్ల నిర్మాణం
తొలి విడతలో 7,680 ఫ్లాట్లు నిర్మించనున్న ప్రభుత్వం
ఇందిరమ్మ ఫ్లాట్లకు భారీ స్పందన, ఇప్పటికే 46 వేలకు పైగా దరఖాస్తులు
ఈనెల 15 వరకూ దరఖాస్తు చేసుకునేందుకు గడువు
-
Aug 12, 2026 12:00 IST
రాజ్యసభలో లుంగీవాలా వివాదం
CPM MP జాన్ బ్రిట్టాస్‌పై BJP MP సుష్మితాదేవ్ ఆరోపణలు
నన్ను లుంగీవాలా అంటూ దూషించారు: జాన్ బ్రిట్టాస్
దక్షిణాది సంస్కృతిని సభలో అవమానించారు: జాన్ బ్రిటాస్
సుష్మితాదేవ్ వ్యాఖ్యలపై చైర్మన్ రాధాకృష్ణన్ ఆగ్రహం
-
Aug 12, 2026 11:47 IST
కృష్ణా: మచిలీపట్నంలో ఆక్సిజన్ సిలిండర్ల పేలుడు
ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
మచిలీపట్నం బెల్ కంపెనీ వెనుక రోడ్డులో ఘటన
సిలిండర్లు పేలడంతో సమీపంలోని కారు, బైక్‌ల ధ్వంసం
తక్షణమే ఆక్సిజన్ సిలిండర్లు తొలగించాలని స్థానికుల ఆందోళన
ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఫైర్ ఆఫీసర్
-
Aug 12, 2026 11:46 IST
కోనసీమ: అమలాపురంలో వైసీపీ నేతలపై కేసు నమోదు
పోలీసుల అనుమతి లేకుండా సోమవారం వైసీపీ ర్యాలీ
పోలీస్ యాక్ట్ 3 ఉల్లంఘన కింద 15 మందిని నిందితులుగా గుర్తింపు
మాజీ మంత్రి విశ్వరూప్, MLC బొమ్మ ఇజ్రాయెల్, మాజీ ఎంపీ అనురాధతో పాటు మరో 12 మందిపై కేసు
-
Aug 12, 2026 11:45 IST
తిరుపతి: విదేశీ భక్తులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
విదేశాల నుంచి తిరుమల వచ్చే భక్తుల కోసం ఎయిర్‌పోర్ట్‌లో ఈ-సేవా కౌంటర్ ఏర్పాటు
ఈ -సేవా కేంద్రం మంజూరు చేసిన కేంద్ర పౌరవిమానయాన శాఖ
ప్రయాణానికి 10 రోజుల ముందే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలని నిబంధన
-
Aug 12, 2026 11:44 IST
టాటాసన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ రాజీనామా
జనరల్ బాడీ మీటింగ్‌కు ముందు చంద్రశేఖరన్ కీలక నిర్ణయం
నోయల్ టాటాతో విభేదాల వల్ల వైదొలగిన చంద్రశేఖరన్
ఈ-కామర్స్‌లో నష్టాలను ప్రశ్నించిన నోయల్
2027 ఫిబ్రవరి వరకూ ఉన్న చంద్రశేఖరన్ పదవీకాలం
2017లో బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్
-
Aug 12, 2026 11:43 IST
ఢిల్లీ: లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
విపక్షాల ఆందోళనతో సభను వాయిదా వేసిన స్పీకర్
అయోధ్య విరాళాలపై మోదీ సమాధానం చెప్పాలంటూ పట్టుపట్టిన విపక్షాలు
సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరిన స్పీకర్
-
Aug 12, 2026 11:20 IST
ఏపీలో కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
స్టైఫండ్‌ను 30 శాతం పెంచాలని జూడాల డిమాండ్
కేవలం 3 శాతమే పెంచుతామంటున్న ఏపీ ప్రభుత్వం
అత్యవసర సేవలు మినహా ఇతర విధులకు జూడాల దూరం
సాయంత్రం 4 గంటల వరకూ స్వచ్ఛంద రిలే నిరాహార దీక్షలు
-
Aug 12, 2026 11:18 IST
కర్నూలు: తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద
పూర్తి స్థాయి నీటి మట్టం: 1633 అడుగులు
ప్రస్తుతం నీటి మట్టం: 1627.61 అడుగులు
ఇన్ ఫ్లో 34,051 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,680 క్యూ సెక్కులు
పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 85.359 టీఎంసీలు
-
Aug 12, 2026 11:15 IST
ఢిల్లి: యువతకు రామ్‌నాథ్ కోవింద్ జీవితం ఆదర్శం: ప్రధాని మోదీ
కోవింద్ సాధారణ పౌరుడి నుంచి రాష్ట్రపతి వరకూ ఎదిగారు: ప్రధాని మోదీ
రాజ్యాంగ విలువలకు కోవింద్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు: ప్రధాని మోదీ
ప్రజాసేవలో కోవింద్ క్రమశిక్షణ, విలువలు.. నేటి యువతకు ఆదర్శం: ప్రధాని మోదీ
కోవింద్ రాసిన పుస్తకం భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఉంది: ప్రధాని మోదీ
-
Aug 12, 2026 11:05 IST
హోర్ముజ్ జలసంధి అమెరికాదే: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్‌పై తనకు నమ్మకం లేదన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్ దుందుడుకు చర్యలకు పాల్పడితే కఠినమైన ప్రతిస్పందన ఎదుర్కోవాల్సి వస్తుంది: ట్రంప్
-
Aug 12, 2026 11:03 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో ప్రజలతో మంత్రి శ్రీధర్‌బాబు ముఖాముఖి
ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు
-
Aug 12, 2026 11:02 IST
వరంగల్: నర్సంపేటలో మరోసారి ఉద్రిక్తత
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగించేందుకు అధికారుల యత్నం
నర్సంపేటలో భారీగా మోహరించిన పోలీసులు
-
Aug 12, 2026 11:02 IST
హైదరాబాద్: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత
రాత్రి పీఎస్‌లో ఉరేసుకుని కానిస్టేబుల్ సాయి ఆత్మహత్య
పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు
ACP కార్యాలయంలో ఫర్నిచర్ ధ్వంసం చేసిన ఆందోళనకారులు
పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులకు మధ్య వాగ్వాదం
-
Aug 12, 2026 11:01 IST
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో టెన్త్ ఉత్తీర్ణత సాధించిన 70 మంది జీవిత ఖైదీలు
ఉత్తీర్ణత సాధించినవారికి SSC సర్టిఫికెట్లను ప్రదానం చేయనున్న జైళ్ల శాఖ డీజీపీ సౌమ్య మిశ్రా
-
Aug 12, 2026 10:59 IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు
యూనివర్సిటీ పూర్వ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్
విద్యార్థి నుంచి 5 గ్రాముల గంజాయి స్వాధీనం, కేసు నమోదు
-
Aug 12, 2026 10:57 IST
ముంబైలో భారీ వర్షాలు.. ఘాట్‌కోపర్‌లో విరిగిపడిన కొండచరియలు
ఇద్దరి మృతి, శిథిలాల కింద మరో ఆరుగురు
ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Aug 12, 2026 10:55 IST
ఇండోనేసియా: బాలీ తీరంలో ప్రయాణిస్తున్న ఫెర్రీలో అగ్నిప్రమాదం
106 మంది ప్రయాణికులను కాపాడిన సహాయక సిబ్బంది
కొనసాగుతున్న సహాయక చర్యలు
-
Aug 12, 2026 10:54 IST
డీలిమిటేషన్‌ను వ్యతిరేకిస్తూ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
లోక్‌సభ సీట్లు యథాతథంగా ఉంచాలని తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం విజయ్
లోక్‌సభ స్థానాలను శాశ్వతంగా 543గానే ఉంచాలని తీర్మానం
చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ అమలు చేయాలని తీర్మానం
మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టొద్దు: సీఎం విజయ్
-
Aug 12, 2026 10:53 IST
ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీల నిరసన
జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీఛార్జ్‌ను నిరసిస్తూ ఆందోళన
రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలంటూ నినాదాలు
-
Aug 12, 2026 10:53 IST
ఢిల్లీ: ప్రగతి మైదానంలో హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
భారత్ మండపం నుంచి ఇండియా గేట్ వరకూ ర్యాలీ
ర్యాలీని ప్రారంభించిన ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్
పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఎంపీలు
ఆగస్టు 15 సందర్భంగా హర్ ఘర్ తిరంగా ప్రచారం
ఐదేళ్లుగా హర్ ఘర్ తిరంగా నిర్వహిస్తున్న కేంద్రం
-
Aug 12, 2026 10:52 IST
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ మృతిపై మంత్రి కొండా సురేఖ ఆవేదన
ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన మంత్రి కొండా సురేఖ
బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని మంత్రి ఆదేశం
నవీన్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ఉద్యోగం కల్పించాలని ఆదేశం
అటవీ సిబ్బంది భద్రతకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచన
-
Aug 12, 2026 10:51 IST
భద్రాద్రి: బూర్గంపాడు మండలం నకిరీపేటలో విషాదం
వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుమార్ మృతి
-
Aug 12, 2026 10:51 IST
మణిపూర్: కాంగ్‌పోక్పి జిల్లాలో ఉద్రిక్తత
నాగా గ్రామంలో పలు ఇళ్లకు నిప్పుపెట్టిన దుండగులు
గ్రామంలో విచక్షణారహితంగా దుండగుల కాల్పులు
ఇప్పటికే ఘటనాస్థలికి భద్రతా బలగాలు
-
Aug 12, 2026 10:08 IST
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఈగల్ టీమ్ దాడులు
17 మంది HCU విద్యార్థులకు గంజాయి పాజిటివ్
డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్
అసోం నుంచి గంజాయి తీసుకొచ్చి HCUలో విక్రయాలు
-
Aug 12, 2026 10:07 IST
కేంద్ర జల్‌శక్తి శాఖ కొత్త కార్యదర్శిగా అర్చన వర్మ నియామకం
కేంద్ర వాటర్ మిషన్ డైరెక్టర్‌గా సేవలందించిన అర్చన వర్మ
జల్‌శక్తి కార్యదర్శి VL కాంతారావును అధికార భాషా శాఖ OSDగా బదిలీ
నదీ జలాల వివాదాల పరిష్కారంలో విఫలమయ్యారని కాంతారావుపై వేటు?
-
Aug 12, 2026 10:06 IST
వాషింగ్టన్ డీసీ: తనను విమానం నుంచి మార్చిన విషయాన్ని ధ్రువీకరించిన ట్రంప్
సీక్రెట్ సర్వీస్ సిబ్బంది సూచనల మేరకే తాను నడుచుకున్నట్టు ట్రంప్ వెల్లడి
ఏదో ముప్పు ఉన్నట్టు వారి దగ్గర సమాచారం ఉంది: ట్రంప్
-
Aug 12, 2026 09:50 IST
సీఎం రేవంత్ సోదరులు భూ స్కామ్‌లకు పాల్పడుతున్నారు: ఎక్స్‌లో కేటీఆర్
రూ.లక్ష పెట్టుబడితో రూ.వందల కోట్ల భూములు కొట్టేస్తున్నారు: మాజీ మంత్రి కేటీఆర్
ఇన్నోవేటర్ ఆఫ్ ది సెంచరీగా అనుముల కొండల్‌రెడ్డిని ప్రకటించాలి: కేటీఆర్
తెలంగాణ యువతకు 'అనుముల హబ్'లో అవకాశం కల్పించండి: మాజీ మంత్రి కేటీఆర్
-
Aug 12, 2026 09:45 IST
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల
విజ్ఞాన్‌భవన్‌లో పుస్తకం విడుదల చేసిన ప్రధాని మోదీ
'నా జీవితం.. నా పోరాటం' పేరుతో పుస్తక రచన
-
Aug 12, 2026 09:31 IST
ప్రకాశ్ రాజ్ విమర్శలపై ఈసీ క్లారిటీ
సొంత ఊర్లో తన ఓటు పోయిందన్న ప్రకాశ్ రాజ్
ప్రకాశ్ రాజ్ ఓటును ఏకపక్షంగా తొలగించలేదు: ఈసీ
ప్రకాశ్ రాజ్ ఓటర్ ఐడీలో నమోదైన అడ్రస్‌కు వెళ్లిన ఈసీ అధికారులు
నాలుగేళ్ల క్రితమే ప్రకాశ్ రాజ్ నమోదిత చిరునామా నుంచి మారారు: ఈసీ
మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ అంగీకరించారు: ఈసీ
-
Aug 12, 2026 09:19 IST
కామారెడ్డి: రాజంపేట మండలం శివాయిపల్లిలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం
సెల్‌ఫోన్ విషయంలో తల్లిదండ్రులు వారించడంతో మనస్తాపానికి గురైన ఇంటర్ విద్యార్థి
గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి
కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.. కోలుకుంటున్న విద్యార్థి
-
Aug 12, 2026 09:16 IST
కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో తనిఖీలు.. 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
నాగావళి ఎక్స్‌ప్రెస్ రైల్లో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్, రైల్వే పోలీసులు
సంబల్పూర్ నుంచి నాందేడ్ వెళ్తున్న రైల్లో గంజాయి స్వాధీనం
గంజాయిని ఎవరు తరలించారనే దానిపై దర్యాప్తు.. నిందితుల కోసం గాలింపు
-
Aug 12, 2026 09:15 IST
కామారెడ్డి: మాచారెడ్డి మండలం గజ్యానాయక్ తండాలో డెంగీ కలకలం
ఒకే కుటుంబంలో ఇద్దరికి డెంగీ పాజిటివ్
సిరిసిల్లలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన బాధితులు
గ్రామంలో రక్త నమూనాలు సేకరించిన వైద్య సిబ్బంది
-
Aug 12, 2026 09:14 IST
హైదరాబాద్: బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత కేసు నమోదు
15 ఏళ్ల తర్వాత బంజారాహిల్స్ పీఎస్‌లో యువతి ఫిర్యాదు
యువతి సవతి సోదరుడిపై పోక్సో కేసు నమోదు
బాల్యంలో సవతి సోదరుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు
15 ఏళ్ల తర్వాత పోలీసులను ఆశ్రయించిన యువతి
ప్రస్తుతం క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్ చదువుతున్న యువతి
-
Aug 12, 2026 09:10 IST
హైదరాబాద్: పరారీలో ఉన్న జీవిత ఖైదీ అరెస్ట్
2023లో పెరోల్‌పై బయటకు వచ్చి పరారైన నిందితుడు శ్రీకాంత్
ఏపీలో శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసిన మల్కాజ్‌గిరి పోలీసులు
2015లో భార్య హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్
-
Aug 12, 2026 09:08 IST
కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో దారుణం
బాలికను ప్రేమ పేరుతో నమ్మించి, గర్భవతిని చేసిన మచిలీపట్నానికి చెందిన వ్యక్తి
తల్లిదండ్రుల ఫిర్యాదుతో కంకిపాడులో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు
కంకిపాడు నుంచి మచిలీపట్నం చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి కేసు బదలాయింపు
వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలింపు
-
Aug 12, 2026 08:57 IST
ఢిల్లీ: ప్రగతి మైదానంలో ప్రారంభమైన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ
ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
హాజరైన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, గజేంద్ర సింగ్ షెకావత్, వీరేంద్ర కుమార్ తదితరులు
-
Aug 12, 2026 08:35 IST
నల్లగొండ: ప్రభుత్వాస్పత్రిలో ఉరేసుకుని బాలింత ఆత్మహత్య
8 రోజుల క్రితం ప్రసవం కోసం ఆస్పత్రిలో చేరిన మమత(28)
మగబిడ్డకు జన్మనిచ్చిన మమత
మృతురాలు మునుగోడు మండలం చీకటిమామిడి వాసి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 08:30 IST
కొమురంభీం: పెంచికల్‌పేట్ మండలం అగర్‌గూడ శివారులో పులి సంచారం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన
-
Aug 12, 2026 08:25 IST
ఏలూరు: పుట్లగట్లగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం
గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
డ్రైవర్ సహా 20 మంది ప్రయాణికులకు గాయాలు
హైదరాబాద్ నుంచి కాకినాడ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
-
Aug 12, 2026 08:21 IST
పల్నాడు జిల్లా: దుర్గి మండలం ఓబులేసునిపల్లెలో హత్య
ఇంటి ముందు నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయోలుపై గొడ్డలితో దాడి
దాడిలో అక్కడికక్కడే మృతి చెందిన ఇమ్మానుయోలు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 08:19 IST
హైదరాబాద్: ఎల్బీనగర్ పీఎస్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య
రాత్రి పీఎస్‌లోని రెస్ట్‌రూమ్‌లో ఉరేసుకున్న సాయి
2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ సాయికుమార్
పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన మృతుడి కుటుంబ సభ్యులు
-
Aug 12, 2026 08:10 IST
తిరుపతి: పెళ్లి పేరుతో వితంతువును మోసం చేసిన వ్యక్తి
8 సవర్ల బంగారం, రూ.10 వేల నగలు దోచుకున్న ప్రసాద్‌రెడ్డి
అలిపిరి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళ
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 08:08 IST
హైదరాబాద్: పటాన్‌చెరు మండలం రుద్రారం MSN ఫార్మా కంపెనీలో ప్రమాదం
ఉద్యోగి వెంకటేశ్వర్లు(45)కు తీవ్రగాయాలు
గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 08:05 IST
చిత్తూరు: మొగిలి ఘాట్ రోడ్డులో ఏనుగు బీభత్సం
బెంగళూరు-చెన్నై ఎక్స్‌ప్రెస్ పనులు చేస్తుండగా మనీష్ సింగ్(24)పై ఏనుగు దాడి
పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
-
Aug 12, 2026 08:00 IST
హైదరాబాద్: చందానగర్ పాపిరెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్పలో విషాదం
విద్యుత్ షాక్‌తో 18 నెలల చిన్నారి గణేష్ మృతి
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
-
Aug 12, 2026 07:50 IST
AICC కార్యదర్శి సచిన్ సావంత్ వరుస సమావేశాలు
నేటి నుంచి TPCC కార్యదర్శులతో సచిన్ సావంత్ భేటీ
-
Aug 12, 2026 07:45 IST
అనకాపల్లి: బాలికపై సచివాలయ ఉద్యోగి అత్యాచారం
కూతురిపై అత్యాచారానికి ప్రోత్సహించిన తల్లి
సచివాలయ ఉద్యోగి, బాలిక తల్లిపై కేసు నమోదు
-
Aug 12, 2026 07:30 IST
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీలో ఘర్షణ
మద్యం మత్తులో బీటెక్ విభాగంలో సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవ
బీర్ బాటిళ్లు, కర్రలతో పరస్పరం దాడులు
ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థుల బహిష్కరణ
-
Aug 12, 2026 07:15 IST
కృష్ణా: గుడివాడ వన్‌టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ బదిలీ
వీఆర్‌కు పంపిస్తూ ఎస్పీ ఉత్తర్వులు
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ర్యాలీ సందర్భంగా కొడాలి నానితో ఎస్ఐ వ్యవహరించిన తీరుపై విమర్శలతో చర్యలు
-
Aug 12, 2026 07:00 IST
అమరావతి: శాంతిభద్రతలపై నేడు సీఎం చంద్రబాబు సమీక్ష
హాజరుకానున్న డీజీపీ, ఉన్నతాధికారులు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల్లోని అధికారులు, SHOలు హాజరు
శాంతిభద్రతలు, మహిళలు-చిన్నారులపై నేరాల కట్టడిపై సమీక్ష
సైబర్ క్రైమ్, సోషల్ మీడియా సైకోలపై స్పెషల్ ఫోకస్
-
Aug 12, 2026 06:45 IST
హైదరాబాద్: గాంధీభవన్‌లో ప్రజలతో ముఖాముఖి
హాజరుకానున్న మంత్రి శ్రీధర్ బాబు
మధ్యాహ్నం 12 గంటల వరకూ అందుబాటులో ఉండనున్న శ్రీధర్ బాబు
ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించనున్న శ్రీధర్ బాబు
-
Aug 12, 2026 06:35 IST
పాలిమర్ నోట్లను ప్రవేశపెట్టాలన్న RBI ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం
రూ.10, 20 పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్న RBI
పాలిమర్ నోట్లపై రాజ్యసభకు తెలిపిన కేంద్రమంత్రి నిర్మల
200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్‌లో ప్రవేశపెట్టాలని ప్రతిపాదన
విజయవంతమైతే పాలిమర్ నోట్లు చలామణిలోకి తీసుకురావాలని RBI సూచన
-
Aug 12, 2026 06:30 IST
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు హైఅలర్ట్
పంద్రాగస్టు సందర్భంగా ఈ నెల 31 వరకూ అలర్ట్
సందర్శకుల పాసులు.. తాత్కాలికంగా నిలిపివేత
బాంబ్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు
-
Aug 12, 2026 06:25 IST
హైదరాబాద్: ఎల్లుండి ట్యాంక్‌బండ్‌పై భారీ తిరంగా ర్యాలీ
'హర్ ఘర్ తిరంగా'లో భాగంగా టీబీజేపీ ర్యాలీ
ఎల్లుండి మధ్యాహ్నం 1:30కు అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ
-
Aug 12, 2026 06:22 IST
ఇరాన్‌తో చర్చల తీరుపై ట్రంప్ అసహనం
చర్చల పేరుతో ఇరాన్ డ్రామాలు ఆడుతోంది: ట్రంప్
చర్చల వేళ ఒకటి.. బహిరంగంగా మరోటి చెబుతున్నారు
ఇరాన్ ప్రతినిధులు నిజాయతీ లేని వ్యక్తులు: ట్రంప్
-
Aug 12, 2026 06:20 IST
నేడు నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటన
బాధితుల సమస్యలను తెలుసుకోనున్న కమిషన్
అధికారులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించే అవకాశం
-
Aug 12, 2026 06:15 IST
నేడు సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన
కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొననున్న కేటీఆర్
ఉచిత కళ్లద్దాలను పంపిణీ చేయనున్న కేటీఆర్
-
Aug 12, 2026 06:10 IST
కర్నూలు: ఘర్షణ కేసులో 10 మందికి రిమాండ్
ఆలూరు మండలం నేమకల్‌లో ఘర్షణ కేసు
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో 10 మంది అరెస్ట్
నిందితులను ఆలూరు కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
14 రోజుల రిమాండ్ విధించిన న్యాయాధికారి
-
Aug 12, 2026 06:09 IST
హైదరాబాద్: HIV, ఎయిడ్స్‌పై రేపు అవగాహన ర్యాలీ: మంత్రి రాజనర్సింహ
రేపటి నుంచి 2 నెలల పాటు ప్రచార కార్యక్రమాలు: రాజనర్సింహ
హైదరాబాద్‌లో రేపు ఉదయం 7 గంటలకు ర్యాలీ: మంత్రి రాజనర్సింహ
-
Aug 12, 2026 06:07 IST
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డిని మరోసారి కస్టడీ కోరిన పోలీసులు
మరో రెండు రోజులు కస్టడీ కోరిన పోలీసులు
కస్టడీపై ముగిసిన వాదనలు, ఈ నెల 14కు తీర్పు రిజర్వ్
ఉదయ్ కృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు
రేపు బెయిల్ పిటిషన్‌పై ఉప్పరపల్లి కోర్టులో కొనసాగనున్న వాదనలు
-
Aug 12, 2026 06:05 IST
రేపు హైదరాబాద్ కిమ్స్‌లో NTR భుజానికి సర్జరీ
ఇటీవల షూటింగ్‌లో జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం
భుజం గాయంతో కొన్నిరోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఎన్టీఆర్‌కు చికిత్స
-
Aug 12, 2026 06:00 IST
ఢిల్లి: నేడు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల
ఉదయం 9.30 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో పుస్తకాన్ని విడుదల చేయనున్న ప్రధాని మోదీ
'నా జీవితం.. నా పోరాటం' పేరుతో పుస్తక రచన