Share News

ఓటును ఏకపక్షంగా తొలగించలేదు.. ప్రకాశ్ రాజ్‌ విమర్శలపై ఈసీ క్లారిటీ..

ABN , Publish Date - Aug 12 , 2026 | 10:02 AM

ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది.

ఓటును ఏకపక్షంగా తొలగించలేదు.. ప్రకాశ్ రాజ్‌ విమర్శలపై ఈసీ క్లారిటీ..
Prakash Raj vote controversy

ఇంటర్‌నెట్ డెస్క్: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలపై ఎలక్షన్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. ఆయన ఓటును ఏకపక్షంగా తొలగించలేదని స్పష్టం చేసింది. ప్రకాశ్‌ రాజ్‌ ఓటర్‌ ఐడీలో నమోదైన అడ్రస్‌కు ఈసీ అధికారులు వెళ్లారని, నాలుగేళ్ల క్రితమే ఆయన నమోదిత చిరునామా నుంచి మారారని వెల్లడించింది. మరో ప్రాంతంలో నివసిస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్ అంగీకరించారని తెలిపింది. పొరుగువారు, ప్రాపర్టీ మేనేజర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగానే ఆ ఓటును 'షిఫ్టెడ్' (మారిన చిరునామా) జాబితాలోకి మార్చినట్లు పేర్కొంది. ప్రకాశ్ రాజ్ ఓటును పూర్తిగా తొలగించలేదని, ప్రస్తుతం ఆయన ఉంటున్న కొత్త చిరునామా ప్రకారం 'ఫారమ్ 6' సమర్పించి ఓటర్ ఐడీని సులభంగా అప్‌డేట్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.


ఓటు తొలగించటంపై వ్యంగ్యంగా స్పందించిన ప్రకా

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా బెంగళూరు నియోజకవర్గం నుంచి తన ఓటును తొలగించటంపై ప్రకాశ్ రాజ్ వ్యంగ్యంగా స్పందించారు. తను పుట్టి, పెరిగిన ప్రాంతం నుంచి ఓటును తొలగించటం ఓ పెద్ద జోక్ అని ఆయన అన్నారు. తనతో పాటు దాదాపు 65 లక్షల మంది ఓటర్ల పేర్లను ఇలాగే తొలగించారంటూ మండిపడ్డారు. ఓటును ఎలాగైనా తిరిగి పొందుతానని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం తన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియో రిలీజ్ చేశారు.


ఇవి కూడా చదవండి

కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ వన్‌వే

విశాఖలో నీటి కొరతపై ముందస్తు చర్యలు: జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్

Updated Date - Aug 12 , 2026 | 10:39 AM