Share News

విషాదం: ముంబైలో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి

ABN , Publish Date - Aug 12 , 2026 | 09:31 AM

ముంబైలో భారీ వర్షాల వేళ ఘట్‌కోపర్-కుర్లా రహదారి సమీపంలోని అశోక్ నగర్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు..

విషాదం: ముంబైలో విషాదం.. కొండచరియలు విరిగిపడి ఇద్దరి మృతి
Mumbai landslide

ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో భారీ వర్షాల వేళ ఘట్‌కోపర్-కుర్లా రహదారి సమీపంలోని అశోక్ నగర్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున సుమారు 3.48 గంటలకు చిరాగ్ నగర్‌లోని గౌషియా చాల్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రాథోడ్ మెడికల్ సమీపంలో కొండచరియలు విరిగిపడటంతో అక్కడి ఇళ్లు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ముంబై పోలీసులు, బీఎంసీ అధికారులు ఇప్పటివరకు రెండు మృతదేహాలను వెలికితీసి సమీప ఆసుపత్రికి తరలించారు.

శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చన్న అనుమానంతో సహాయక బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. చిక్కుకున్న వారి సంఖ్యపై భిన్న అంచనాలు వెలువడుతున్నాయి. తొలుత మూడు నుంచి నాలుగు మంది ఉంటారని భావించినప్పటికీ, ఆ తర్వాత ఆరుగురు నుంచి ఎనిమిది మంది వరకు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని బీఎంసీ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య కూడా నాలుగు నుంచి ఐదు వరకూ ఉండొచ్చని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.


ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది, ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎంసీ వార్డు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగిస్తూ ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనలో ఇళ్లలో చిక్కుకున్న 18 ఏళ్ల సోహెల్ అన్సారీ, 14 ఏళ్ల మొహమ్మద్ అన్సారీలను రక్షించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, వర్షాకాలానికి ముందే ఈ ప్రాంతంలోని పలు ఇళ్లకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.


Also Read:

ప్రైవేటు ఆస్పత్రుల్లో గది అద్దెలకు కళ్లెం.. పార్లమెంటరీ ఆరోగ్య కమిటీ కీలక సిఫారసు..

రాహుల్ గాంధీ పక్కనున్న వారెవరు.. కేంద్ర మంత్రి ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం ఏంటంటే..

Updated Date - Aug 12 , 2026 | 10:22 AM