-
-
Home » Mukhyaamshalu » ABN AndhraJyothy AP and Telangana National International breaking Live Updates of 8th September 2026 kjr
-
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
ABN , First Publish Date - Sep 08 , 2026 | 06:02 AM
ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..
Live News & Updates
-
Sep 08, 2026 07:10 IST
తిరుపతి: రామచంద్రాపురం మండలంలో మహిళ మెడలో చైను లాక్కెళ్లిన దొంగలు
గడ్డకిందపల్లిలో పొలంలో ఆవులు మేపుతున్న కళావతిపై ఇద్దరు దుండగుల దాడి
స్కూటర్‌పై వచ్చి.. మహిళ మెడలోని 56 గ్రాముల చైన్ లాక్కొని పరారీ
ఆర్‌సీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు
-
Sep 08, 2026 07:05 IST
కాకినాడ: వైసీపీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత
పెద్దాపురం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ రాజీనామా
వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు జగన్‌కు లేఖ
రాజీనామా యోచనలో మరికొంతమంది వైసీపీ నేతలు
రాజీనామా చేసే నేతలు జనసేనలో చేరే అవకాశం
-
Sep 08, 2026 07:00 IST
తిరుపతి: సైబర్ వలలో టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి.. రూ. 2.25 లక్షల స్వాహా
తిరుమల పోటు కాంట్రాక్టు ఉద్యోగికి సైబర్ నేరగాళ్ల ఎర
పీఎం ముద్రా యోజన కింద రూ. 5 లక్షల లోన్ ఇస్తామని నమ్మించి మోసం
నకిలీ ఐడీ కార్డులతో యూపీఐ ద్వారా రూ. 2,25,670 కాజేసిన కేటుగాళ్లు
కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న అలిపిరి పోలీసులు
-
Sep 08, 2026 06:55 IST
హైదరాబాద్‌లో ప్రస్తుతం బంగారం ధరలు ఇవీ
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,140
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,290
కిలో వెండి ధర రూ.2,54,900
-
Sep 08, 2026 06:50 IST
జర్మనీ రాజకీయాల్లో సంచలనం
సక్సోనీ-యాన్‌హాల్ట్ రాష్ట్రంలో అతి మితవాద (ఫార్ రైట్) పార్టీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ విజయం
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీలో ఫార్ రైట్ పార్టీ గెలుపొందడం ఇదే తొలిసారి
-
Sep 08, 2026 06:47 IST
నేడు ఢాకాలో భారత్-బంగ్లా రైల్వే అధికారుల సమావేశం
రైలు సేవల పునరుద్ధరణపై అధికారుల చర్చ
2024 నుంచి నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు
-
Sep 08, 2026 06:45 IST
బీఅర్ఎస్ ఎమ్మెల్సీల అరెస్ట్
తాత మధు, నవీన్ రెడ్డిల నివాసాలకు పోలీసులు
ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో తాత మధును అరెస్ట్ చేసిన పోలీసులు
కోకాపేట తన నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అరెస్ట్
తాత మధుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసే అవకాశం
BRS నేత హరీశ్ రావు నివాసానికి పోలీసులు
-
Sep 08, 2026 06:35 IST
ఈ నెల 15 నుంచి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు
తిరుమలతో పాటు తిరుపతిలోనూ ప్రత్యేక అలంకరణలు
తిరుపతి నుంచే బ్రహ్మోత్సవ శోభ ఉట్టిపడేలా ఏర్పాట్లు
-
Sep 08, 2026 06:30 IST
విజయవాడ: యూట్యూబర్ నందనకి పోలీసుల నోటీసులు
నేడు ఇబ్రహీంపట్నం పీఎస్‌కు విచారణకు రావాలని ఆదేశం
వీసా స్కాంలో నందనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు
-
Sep 08, 2026 06:20 IST
అమరావతి: రెండోరోజు టీడీపీ ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు
టీడీపీ కేంద్ర కార్యాలయంలో కొనసాగుతున్న తరగతులు
శాసనసభా వ్యవహారాలపై ఎమ్మెల్యేలకు అవగాహన
ప్రజా సమస్యలపై ఎమ్మెల్యేలకు ప్రత్యేక శిక్షణ
స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహాలపై చర్చ
-
Sep 08, 2026 06:17 IST
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎస్సీ సంఘాల నిరసనలు
KCR ఫాంహౌస్ ముట్టడికి ఎస్సీ కాంగ్రెస్ నేతల పిలుపు
కేసీఆర్ ఫామ్‌హౌస్ ఎదుట డప్పుల నిరసనకు సిద్ధం
BRS కార్యాలయాల ఎదుట ధర్నాలు
స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలకు నిరసన
-
Sep 08, 2026 06:15 IST
రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
నేడు కౌన్సిల్‌కు హాజరుకానున్న తాతా మధు
నేటి నుంచి సభకు హాజరుకావాలని BRS సభ్యుల నిర్ణయం
-
Sep 08, 2026 06:12 IST
ఇస్రో ఎప్పటికే ప్రభుత్వ సంస్థగానే ఉంటుంది: ఇస్రో చైర్మన్ వి.నారాయణన్
ప్రైవేట్ సంస్థలతో మాత్రం కలిసి పనిచేయక తప్పదు: ఇస్రో చైర్మన్
-
Sep 08, 2026 06:10 IST
నేడు చలో అసెంబ్లీకి తెలంగాణ జనసేన పిలుపు
22Aపై నిరసనగా జనసేన ‘చలో అసెంబ్లీ’
-
Sep 08, 2026 06:07 IST
నేడు ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవం
ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ శివప్రతాప్ శుక్లా
-
Sep 08, 2026 06:05 IST
హైదరాబాద్: పోలీసులపై అనుచితంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసు
పోలీసులపై దాడులు చేసి, దుర్భాషలాడినందుకు కేసు నమోదు
ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్ రావు, సుధీర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలపై కేసు
వీడియోల ఆధారంగా కేసులను నమోదు చేసిన పోలీసులు
-
Sep 08, 2026 06:00 IST
తెలంగాణలో నేడు స్పెషల్ టెట్ నిర్వహణ
ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ఇవాళ, రేపు ప్రత్యేక టెట్
హాజరుకానున్న మొత్తం 24,986 మంది అభ్యర్థులు
హెల్ప్‌లైన్ నంబర్లు 709370 8883, 709370 8884, 7093955 8881