Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ABN , First Publish Date - Nov 11 , 2026 | 06:42 AM

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి.

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

Live News & Updates

  • Nov 11, 2026 11:25 IST

    హైదరాబాద్: మార్పు రావాలంటే ఓటుతోనే తీర్పు ఇవ్వాలి: టీఆర్ఎస్ చీఫ్ కవిత

    • గ్రాడ్యుయేట్లు ఓటరుగా నమోదు కావాలి

    • రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత కీలకం

    • మూడు పార్టీలకు బుద్ధి చెప్పే అవకాశం

    • నేటి నుంచి అధికారిక ఎన్నికల ప్రచారం: టీఆర్ఎస్ చీఫ్ కవిత

  • Nov 11, 2026 11:20 IST

    భారీ లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    • 1,250 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌

    • 25,400 మార్క్‌ దాటిన నిఫ్టీ

    • డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి

    • మార్కెట్లలో కొనుగోళ్ల జోరు కొనసాగింపు

  • Nov 11, 2026 11:15 IST

    అమరావతి: వైసీపీలో 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయిరెడ్డి

    • జగన్‌ చెప్పుడు మాటలు విని తనను ఇబ్బందులకు గురిచేశారని వెల్లడి

    • అన్ని జిల్లాల నుంచి కీలక వ్యక్తులు కొత్త పార్టీలోకి వస్తారని ప్రకటన

    • అన్ని కులాలు, మతాలకు సమాన న్యాయం, యువతకు ప్రాధాన్యత

    • ప్రజాస్వామ్య పాలన, రాజ్యాంగ హక్కుల సమాన అమలే లక్ష్యం: విజయసాయిరెడ్డి

  • Nov 11, 2026 11:10 IST

    నాగర్‌కర్నూల్‌: కోడేరు మండలం కొండ్రావుపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

    • కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

    • అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు

    • అర్హులందరికీ ఇళ్లు అందిస్తాం: మంత్రి జూపల్లి

  • Nov 11, 2026 11:05 IST

    హైదరాబాద్‌: భారత్‌ సమ్మిట్‌ రాజకీయాల కోసం కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

    • బీజేపీ అనవసర విమర్శలు మానుకోవాలి: మంత్రి శ్రీధర్‌బాబు

    • రాహుల్‌ గాంధీని సమ్మిట్‌కు ఆహ్వానిస్తే తప్పేంటి?

    • టెక్నాలజీ, ప్రస్తుత సవాళ్లపై ఎవరైనా మాట్లాడొచ్చు

    • ప్రగతిశీల భావాలున్న అన్ని పార్టీలకూ ఆహ్వానం

    • ప్రపంచవ్యాప్తంగా మారుతున్న పరిస్థితులపై చర్చలు

    • జెన్‌జీ డిమాండ్లపైనా ప్రత్యేక సెషన్‌లో చర్చిస్తాం: మంత్రి శ్రీధర్‌బాబు

  • Nov 11, 2026 11:00 IST

    తెలంగాణలో భారత్‌ సమ్మిట్‌ నిర్వహించడం గౌరవంగా ఉంది: డిప్యూటీ సీఎం భట్టి

    • 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధుల రాక

    • కాంగ్రెస్‌ సిద్ధాంతాలు ప్రపంచానికి దిక్సూచీగా పనిచేస్తాయి

    • రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల చర్చకు వేదికగా భారత్‌ సమ్మిట్‌

    • సమ్మిట్‌ ఎంతో ఉపయోగపడుతుంది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • Nov 11, 2026 10:50 IST

    మహబూబాబాద్‌: తొర్రూరు మండల పరిధిలో ఓ బాలికపై యువకుడి వేధింపులు

    • ప్రేమ పేరుతో బాలికను గర్భవతిని చేసిన యువకుడు

    • గర్భస్రావం కోసం బాలికకు మాత్రలు ఇచ్చిన యువకుడు

    • అనారోగ్యానికి గురైన బాలికకు ఆస్పత్రిలో చికిత్స

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Nov 11, 2026 10:45 IST

    అమరావతి: ఏ కన్వెన్షన్‌ వద్దకు చేరుకున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

    • మరికాసేపట్లో నూతన పార్టీని ప్రకటించనున్న విజయసాయిరెడ్డి

  • Nov 11, 2026 10:15 IST

    తెలంగాణలో రెండోసారి భారత్‌ సమ్మిట్‌ నిర్వహణ

    • ప్రపంచ పరిస్థితులపై సమ్మిట్‌లో చర్చిస్తాం

    • దేశాల మధ్య సమన్వయానికి సమ్మిట్‌ ఉపయోగపడుతుంది

    • దేశానికి గాంధీ సిద్ధాంతాలు అవసరం: కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్

  • Nov 11, 2026 10:00 IST

    భారీగా తగ్గిన వెండి ధరలు

    • కిలో వెండిపై రూ.5 వేల మేర తగ్గిన ధర

    • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షలు

    • స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

  • Nov 11, 2026 09:45 IST

    ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌

    • ఎన్విడియా షేర్ల పతనంతో మారిన కంపెనీల ర్యాంకులు

    • 6 శాతానికి పైగా పడిపోయిన ఎన్విడియా షేర్లు

    • ఒక్కరోజే 400 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ ఆవిరి

    • మూడో స్థానానికి పడిపోయిన ఎన్విడియా

    • జెన్సన్ సంపదలో రూ.62 వేల కోట్ల మేర తగ్గుదల

  • Nov 11, 2026 09:30 IST

    సూర్యాపేట: కోదాడ మండలం రెడ్లకుంటలో మంత్రి ఉత్తమ్ పర్యటన

    • లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్, ఎంపీ రఘువీర్‌రెడ్డి

    • పనుల పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి

    • డిసెంబర్‌ చివరి నాటికి పనులు పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

    • లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో 4,460 ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • Nov 11, 2026 08:40 IST

    ఆదిలాబాద్‌: నేడు ఐటీ టవర్‌ను ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్‌బాబు

    • బాసర ఆలయాన్ని సందర్శించనున్న మంత్రి

    • బాసర ట్రిపుల్‌ ఐటీని సందర్శించనున్న శ్రీధర్‌బాబు

  • Nov 11, 2026 08:30 IST

    అసోం: పట్టాలు తప్పిన కోల్‌కతా–సైరంగ్‌ ఎక్స్‌ప్రెస్‌

    • గౌహతి సమీపంలో ఆరు బోగీలు పట్టాలు తప్పిన ఘటన

    • పలువురు ప్రయాణికులకు గాయాలు

    • సాంకేతిక సమస్యతో ప్రమాదం జరిగినట్లు సమాచారం

  • Nov 11, 2026 08:20 IST

    ఇరాన్‌ దాడుల భయంతో అమెరికా కీలక నిర్ణయం

    • రెండు గగనతల ఇంధన సరఫరా విమానాలు జర్మనీకి తరలింపు

    • ఈ మేరకు కథనం ప్రచురించిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌

    • మరికొన్ని విమానాలు ఐరోపాలోని ఇతర స్థావరాలకు తరలింపు

    • భద్రతా పరమైన ముందస్తు చర్యల్లో భాగంగా నిర్ణయం

  • Nov 11, 2026 08:15 IST

    అమెరికా మధ్యవర్తిత్వంలో రష్యా-ఉక్రెయిన్‌ చర్చలు

    • అబుధాబీలో ప్రారంభమైన త్రైపాక్షిక సంప్రదింపులు

    • రెండు రోజుల పాటు కొనసాగనున్న చర్చలు

    • తొలిరోజు కీలక అంశాలపై మంతనాలు

    • ఉన్నతస్థాయి ప్రతినిధుల సమక్షంలో సంక్లిష్ట అంశాలపై చర్చలు

  • Nov 11, 2026 08:00 IST

    ప్రపంచంలో మూడో స్థానానికి పడిపోయిన దిగ్గజ చిప్‌ కంపెనీ

    • CEO జెన్సన్‌ హువాంగ్‌ వివాహేతర సంబంధంపై ప్రచారంతో కంపెనీ విలువకు దెబ్బ

    • భారీగా తగ్గిన జెన్సన్‌ హువాంగ్‌ సంపద

    • రెండు రోజుల్లో 10.6 శాతం పతనమైన Nvidia షేర్లు

    • షేర్ల పతనంతో రూ.43.70 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఆవిరి

  • Nov 11, 2026 07:55 IST

    తిరుపతి: కపిలేశ్వరాలయంలో హోమ మహోత్సవాలకు అంకురార్పణ

    • కార్తిక మాసం సందర్భంగా ప్రత్యేక హోమాలు

    • నవంబర్‌ 10 నుంచి డిసెంబర్‌ 8 వరకు నిర్వహణ

    • టీటీడీ ఆధ్వర్యంలో జరగనున్న ఉత్సవాలు

  • Nov 11, 2026 07:50 IST

    చెన్నై: నేడు మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం విజయ్‌ భేటీ

    • టీవీకే ఎమ్మెల్యేల వరుస వివాదాలపై చర్చించనున్న సీఎం

    • తాజా పరిణామాలపై సమీక్షించే అవకాశం

  • Nov 11, 2026 07:45 IST

    విశాఖపట్నం: నేడు నగరానికి సీఎం చంద్రబాబు

    • సింగపూర్ మంత్రి హువాంగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ

    • WIPO డైరెక్టర్‌ జనరల్‌, జపాన్ రాయబారి, UAE మంత్రితో సమావేశం

    • రెన్యూ సంస్థ సీఈవో సుమంత్‌ సిన్హాతో చర్చలు

    • CII సీఈవోలతో ప్రత్యేక సమావేశం

    • రాత్రి 8 గంటలకు అంతర్జాతీయ ప్రతినిధులకు విందు

  • Nov 11, 2026 07:40 IST

    విశాఖపట్నం: నేటి నుంచి రెండు రోజుల పాటు అమిత్‌ షా పర్యటన

    • ఇవాళ రాత్రి విశాఖకు చేరుకోనున్న కేంద్ర హోంమంత్రి

    • ఎల్లుండి CII పార్టనర్‌షిప్‌ సదస్సులో పాల్గొననున్న అమిత్‌ షా

    • ఉమెన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌కు శ్రీకారం

    • మహిళా అభివృద్ధి సదస్సులోనూ పాల్గొననున్న కేంద్ర హోంమంత్రి

  • Nov 11, 2026 07:35 IST

    ఢిల్లీ: ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం

    • 301 పాయింట్లుగా నమోదైన సగటు AQI

    • 59 కేంద్రాల్లో 29 చోట్ల 300 దాటిన కాలుష్య స్థాయి

    • చావ్లాలో అత్యధికంగా 398 పాయింట్ల AQI నమోదు

    • ఢిల్లీ-NCRలో గ్రాప్‌-3 ఆంక్షల అమలు

  • Nov 11, 2026 07:30 IST

    అమరావతి: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావ ర్యాలీ

    • ఉదయం 11:11 గంటలకు పార్టీ ప్రకటన

    • కొత్త పార్టీ పేరును వెల్లడించనున్న విజయసాయిరెడ్డి

  • Nov 11, 2026 07:10 IST

    మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం మామిడిపెల్లిలో విషాదం

    • అటవీ జంతువుల వేట కోసం అమర్చిన విద్యుత్‌ తీగలు తగిలి బోయిడిరెడ్డి (42) మృతి

    • కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

  • Nov 11, 2026 07:05 IST

    శ్రీ సత్యసాయి జిల్లా: పరిగి మండలం ఊటకూరులో దారుణం

    • జామపండు కోసిందనే కారణంతో ఆరేళ్ల బాలికపై వృద్ధురాలి దాడి

    • చిన్నారికి తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

    • తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

  • Nov 11, 2026 07:00 IST

    హైదరాబాద్‌: నేడు మాదాపూర్‌లో తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవం

    • సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • ముఖ్య అతిథులుగా హాజరుకానున్న అక్కినేని నాగార్జున, నాగచైతన్య

  • Nov 11, 2026 06:55 IST

    అనంతపురం: కుందుర్పి మండలంలో చిరుత సంచారం

    • బొమ్మజ్జిపల్లి, బి.కొత్తూరు, బసాపురం పరిసరాల్లో కదలికలు

    • పొలాల వద్ద చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు

    • ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన

  • Nov 11, 2026 06:50 IST

    అమరావతిలో నేడు సింగపూర్ ప్రతినిధుల బృందం పర్యటన

    • సీఎం చంద్రబాబుతో సింగపూర్ మంత్రి బృందం సమావేశం

    • రాజధాని నిర్మాణ పనులను పరిశీలించనున్న బృందం

  • Nov 11, 2026 06:45 IST

    నేడు వరంగల్‌ జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

    • గోదావరి నీటి లభ్యత, విద్యుత్ కొరతపై సమీక్ష

  • Nov 11, 2026 06:40 IST

    నేడు మౌలానా అబ్దుల్‌ కలాం అజాద్‌ జయంతి వేడుకలు

    • బంజారా భవన్‌లో నేషనల్ ఎడ్యుకేషనల్‌ డే వేడుకలు

    • హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి

    • మధ్యాహ్నం 2 గంటలకు విద్యాశాఖ అధికారులతో సీఎం భేటీ

  • Nov 11, 2026 06:35 IST

    నేడు మాదాపూర్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

    • పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువు ప్రారంభం

  • Nov 11, 2026 06:30 IST

    నేడు ఢిల్లీకి ఏపీ మంత్రి నారాయణ

    • స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు అందుకోనున్న మంత్రి నారాయణ

    • విజ్ఞాన్ భవన్‌లో అవార్డులను ప్రదానం చేయనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము