Share News

ప్రియమైన పియానో...

ABN , Publish Date - Mar 29 , 2026 | 10:55 AM

ఉన్నత కుటుంబాల్లో ‘పియానో’ లగ్జరీకి ప్రతిరూపం. క్లాసికల్‌ నుంచి వెస్ట్రన్‌ దాకా అన్ని రకాల సంగీతాన్ని దీనిపై అలవోకగా పలికించొచ్చు.

ప్రియమైన పియానో...

ఉన్నత కుటుంబాల్లో ‘పియానో’ లగ్జరీకి ప్రతిరూపం. క్లాసికల్‌ నుంచి వెస్ట్రన్‌ దాకా అన్ని రకాల సంగీతాన్ని దీనిపై అలవోకగా పలికించొచ్చు. ఒకప్పుడు సినిమాల్లో అనేక పాటలు పియానో నేపథ్యంగా సాగేవి. పియానోను వాయించడం వల్ల కలిగే ఆనందాన్ని, సంగీతంలో దాని ప్రాముఖ్యతను తెలపటానికి ‘వరల్డ్‌ పియానో డే’ (మార్చి 29)ను ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకొంటారు. ఈ సందర్భంగా పియానోకు సంబంధించిన కొన్ని ఆసక్తికర సంగతులివి...

  • నేడు ‘వరల్డ్‌ పియానో డే’

  • 2000లో న్యూజిలాండ్‌లో అతి పెద్ద పియానోను తయారుచేశారు. ఇది ప్రపంచంలోనే పెద్దదిగా గుర్తింపు తెచ్చుకుంది. దీనిలో 156 మెట్లు (కీ) ఉంటాయి. ఈ పియానో బరువు 1.4 టన్నులు.

  • పియానో నేర్చుకోవడం వల్ల పిల్లల్లో భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


  • అతి సుదీర్ఘమైన పియానో కచేరీ 103 గంటల 8 సెకన్ల పాటు సాగింది. దీనిని నిర్వహిం చింది రోమూవాల్డ్‌ కోపర్క్సీ అనే సంగీతకారుడు.

  • ఒక సాధారణ పియానోలో సుమారు 12 వేల భాగాలుంటాయి. వాటిలో 10 వేలు కదులుతూ ఉంటాయి.

  • పియానో అనే పదం ఇటాలియన్‌ ‘పియానోఫోర్ట్‌’ నుంచి వచ్చింది. దీని అర్థం ‘మృదువుగా, బిగ్గరగా’. దీని నుంచి వచ్చే శబ్దం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో శ్రావ్యంగా కూడా ఉంటుంది.

  • తొలినాళ్లలో పియానోలు చాలా ఖరీదైనవిగా ఉండేవి. వాటిని ధనవంతులు కూడా కొనలేకపోయేవారు. శతాబ్దం పాటు వాటిని రాజవంశీయులు మాత్రమే తమ మందిరాల్లో ఉంచుకునేవారు.


book5.2.jpg

  • పాశ్చాత్య దేశాల్లో పియానో వాయిద్యంపై మక్కువ ఎక్కువ. ఒక్క అమెరికాలోనే కోటి 80 లక్షల మంది పియానో వాయిద్య కారులున్నారు.

  • తొలి పియానోను ఇటలీలో 1709లో బార్టోలోమియో క్రిస్టొఫరీ రూపొందించాడు.

  • జర్మన్‌ పియానిస్ట్‌ నీల్స్‌ ఫ్రామ్హ్‌ తొలిసారిగా ‘పియానో డే’ను 2015లో ప్రతిపాదించారు. అప్పటి నుంచి ప్రతీ ఏడాది పియానో దినోత్సవాన్ని జరుపుతున్నారు.


  • ఈ సంగీత వాయిద్యం రెండు రకాల మేళవింపుగా ఉంటుంది. ఒకటి తీగ వాయిద్యం అయితే, రెండోది ఒక చిన్న సుత్తి లాంటి పరికరం తీగలను తట్టడం ద్వారా శబ్దప్రయోగం జరుగుతుంది.

  • ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పియానో హీంట్జూమాన్‌ తయారుచేసిన ‘గ్రాండ్‌’ పియానో. దీనికి ఆయన క్రిస్టల్స్‌ పొదిగాడు. 2015లో ఇది సుమారు28 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యింది.


ఈ వార్తలు కూడా చదవండి:

‘మతం’ చిక్కుల్లో జగన్‌!

ఎస్ఐఆర్ వర్సెస్ అల్లర్లు.. బెంగాల్‌లో వేడెక్కిన ఎన్నికల ప్రచారం

Read Latest Telangana News and National News

Updated Date - Mar 29 , 2026 | 10:55 AM