Share News

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్

ABN , Publish Date - Apr 11 , 2026 | 10:54 AM

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి ట్రిప్‌కు వెళ్లాలనుకుంటున్నారా? సరైన ప్లానింగ్ ఉంటే, కేవలం రూ. 20 వేలలో కొచ్చి ట్రిప్‌ను సులభంగా పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

తక్కువ బడ్జెట్‌లో కొచ్చి టూర్
Kochi Budget Trip

ఇంటర్నెట్ డెస్క్: కేరళంలోని కొచ్చి (కొచ్చిన్) అరేబియా సముద్ర తీరంలో ఉన్న అందమైన రేవు పట్టణం. దీనిని 'అరేబియా సముద్రపు రాణి'గా కూడా పిలుస్తారు. చారిత్రక ఫోర్ట్ కొచ్చి, చైనా చేపల వలలు, బ్యాక్‌వాటర్స్, సుగంధ ద్రవ్యాల తోటలు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణలు. ప్రకృతి అందాలు, సంస్కృతి, ఆధునికత కలిసిన కొచ్చి.. పర్యాటకులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది.


హైదరాబాద్ టూ కొచ్చి

హైదరాబాద్ నుంచి కొచ్చికి వెళ్లడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ఫ్లైట్ ద్వారా వెళ్తే సుమారు గంటనరలోపు చేరవచ్చు, ఖర్చు కేవలం రూ. 3,000 నుంచి 7,000 వరకు ఉంటుంది. ముందుగా బుకింగ్ చేస్తే ఖర్చు చాలా తగ్గుతుంది. ట్రైన్‌లో ప్రయాణిస్తే 22 నుంచి 27 గంటలు పడుతుంది. ఖర్చు కేవలం రూ.600 నుంచి 2,000 మధ్య ఉంటుంది. బస్‌లో వెళ్తే 12 నుంచి 16 గంటలు పడుతుంది, ఖర్చు రూ.1,000 నుంచి 3,000 వరకు ఉంటుంది. కొచ్చికి వెళ్లిన తర్వాత హాస్టల్‌లో ఉండటానికి, ఆహారం కోసం, అలాగే లోకల్ ట్రావెల్ ఖర్చులకు కలిపి సుమారు రూ.3,000 నుంచి రూ.5,000 వరకు ఖర్చు ఉండొచ్చు. ఇప్పుడు కొచ్చిలో చూడాల్సిన ముఖ్య ప్రదేశాలు ఏవో చూద్ధాం..

Kochi.jpg


ఫోర్ట్ కొచ్చి:

కేరళంలోని ఎర్నాకులం జిల్లాలో ఉన్న ఫోర్ట్ కొచ్చి ఒక చారిత్రక సముద్రతీర పట్టణం. పోర్చుగీస్, డచ్, బ్రిటిష్ వలస పాలనల ప్రభావంతో, ఇది భవనాలు, చర్చిలు, చైనీస్ చేపల వలలతో ప్రత్యేక సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇది పర్యాటకులకు, చరిత్ర ప్రేమికులకు, ప్రశాంతతను కోరుకునేవారికి ఒక అద్భుతమైన ప్రదేశం. ఫోర్ట్ కొచ్చి బీచ్‌లో ఉండే ప్రత్యేకమైన చేపల వలలు కొచ్చికి ప్రధాన ఆకర్షణ. ముఖ్యంగా సూర్యాస్తమయ సమయంలో ఇవి చాలా అందంగా కనిపిస్తాయి.

Fort Kochi.jpg

మట్టంచేరి ప్యాలెస్:

కొచ్చిలోని మట్టంచేరి ప్యాలెస్ (డచ్ ప్యాలెస్) 1545-1555 ప్రాంతంలో పోర్చుగీసువారు నిర్మించి కొచ్చిన్ రాజు వీర కేరళ వర్మకు బహుమతిగా ఇచ్చిన చారిత్రక కట్టడం. ఇది నలుకేట్టు తరహా కేరళ వాస్తుశిల్పం, యూరోపియన్ శైలుల కలయికతో ఉంటుంది. హిందూ పురాణాల చిత్రలేఖనాలు, కొచ్చిన్ రాజుల చిత్రపటాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

Palace.jpg


సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి:

భారతదేశంలోని పురాతన యూరోపియన్ చర్చిలలో ఒకటైన సెయింట్ ఫ్రాన్సిస్ చర్చి తోపాటు మెరైన్ డ్రైవ్, చెరై బీచ్‌ లను కూడా చూడవచ్చు. సాయంత్రం సమయంలో నడవడానికి, బోటింగ్ చేయడానికి ఈ బీచ్‌లు అనువైనవి. అంతేకాకుండా, హిల్ ప్యాలెస్ మ్యూజియం కూడా సందర్శించవచ్చు. ఇది కొచ్చి మహారాజా నివాసం, కేరళలోని అతిపెద్ద పురావస్తు మ్యూజియం. సాంప్రదాయ కథకళి, కలరిపయట్టు ప్రదర్శనలు చూడవచ్చు. ఇలా ఈ ట్రిప్ మొత్తం కేవలం రూ. 20 వేలలో ఈజీగా ఎంజాయ్ చేయవచ్చు.

Kathakali.jpg


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 11 , 2026 | 11:10 AM