ఆలింగనం... అద్భుతం...
ABN , Publish Date - May 24 , 2026 | 10:15 AM
ఒక్క కౌగిలింత ఎంతో ఓదార్పునిస్తుంది... అంతకన్నా ఎక్కువగా భరోసానిస్తుంది... ఒక్క ఆలింగనం ఆందోళనను తగ్గించి, మనసును తేలిక చేస్తుంది.
ఒక్క కౌగిలింత ఎంతో ఓదార్పునిస్తుంది... అంతకన్నా ఎక్కువగా భరోసానిస్తుంది... ఒక్క ఆలింగనం ఆందోళనను తగ్గించి, మనసును తేలిక చేస్తుంది. ఒక్క ‘హగ్’ ప్రతీ ఒక్కరిలో శారీరకంగా, మానసికంగా ఎంతో మార్పును తీసుకొస్తుంది. అంతేనా... బాధ నుంచి బయట పడేస్తుంది. ఒకరిని మరొకరు ‘హగ్’ చేసుకోవడం వల్ల ఇంకా ఏమేం ప్రయోజనాలు చేకూరతాయంటే....
ఆలింగనం సెరటోనిన్ విడుదలను ప్రేరేపిస్తుంది. ఇది మూడ్ ను నియంత్రించే న్యూరో ట్రాన్స్‌మీటర్. హగ్ అనేది ఒత్తిడిని తగ్గించి ఉత్సాహవంతమైన మూడ్‌లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల హాయిగా నిద్ర పోతారు.
నవజాత శిశువులను హత్తు కోవడం వల్ల ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయి. తక్కువ బరువుతో జన్మించిన శిశువులు కోలుకునే అవకాశం రెట్టింపవుతుంది.
ఆలింగనం చేసుకోవడం వల్ల సాన్ని హిత్యం పెరుగుతుంది. నమ్మకం, భద్రత రెట్టింపవుతాయి. కౌగిలింత భాగస్వామిని మరింత దగ్గర చేస్తుందని ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 83 శాతం మంది అభిప్రాయపడ్డారు.
కౌగిలింత... ‘ఆక్సిటోసిన్’ అనే హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. వీటిని ‘హ్యాపీ హార్మోన్లు’ అని కూడా పిలుస్తారు. ఈ హార్మోన్లు సంతోషంగా ఉండేందుకు సహాయపడతాయి. ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో అప్పుడు రక్తపోటు సాధారణ స్థితికి వచ్చేస్తుంది. గుండె జబ్బుల రిస్క్ తగ్గిపోతుంది.
ఒక వ్యక్తిని ప్రేమతో ఆలింగనం చేసుకుంటే... ఆ వ్యక్తిలో రోగనిరోధక శక్తి పెరుగు తుంది. ఆక్సిటోసిన్‌తో పాటు రకరకాల ఇన్‌ఫెక్షన్లపై పోరాడే హార్మోన్లు విడుదలవుతాయి. స్ట్రెస్ హార్మోన్ అయినటువంటి ‘కార్టిసాల్’ విడుదల క్రమక్రమంగా తగ్గిపోతుంది.-
ప్రేమతో దగ్గరకు తీసుకుంటే అనుబంధం మరింత బలోపేతం అవుతుంది. మాటల కన్నా ఆలింగనం ఎన్నో రెట్లు శక్తిమంత మైనది.
కౌగిలించుకోవడం వల్ల ఆటోమేటిక్‌గా నరాల వ్యవస్థ రిలాక్స్ అవుతుంది. సోషల్ యాంగ్జయిటీ తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో బాగా రాణించగలుగుతారు.
ఆలింగనంతో హార్మోన్లలో సమతుల్యత వస్తుంది. ఆకలి తగ్గుతుంది. దీనివల్ల తినడం చాలా తగ్గిస్తారు. ఫలితంగా బరువు నియంత్రణలోకి వస్తుందని కొన్ని పరిశోధనల్లో తేలింది.
హగ్ చేసుకోవడం వల్ల సాధారణ జలుబు నుంచి రక్షణ లభిస్తుందని 2014లో జరిపిన ఒక అధ్యయనంలో వెల్లడైంది.
కౌగిలింత భద్రతతో కూడిన అనుభూతిని అందిస్తుంది. మానసికంగా, శారీరకంగా భరోసాను ఇస్తుంది.
ఏదైనా ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి ఒక్క ఆలింగనం ఎంతో ఉపశమనాన్ని అందిస్తుంది. మోరల్ సపోర్టు వల్ల నొప్పి నుంచి ఒక్కసారిగా ఉపశమనంగా ఫీలవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..
వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News