స్నానం చేసేటప్పుడు చేసే ఈ తప్పులు జుట్టు రాలడానికి కారణం
ABN , Publish Date - Mar 06 , 2026 | 09:15 AM
ఈ రోజుల్లో జుట్టు రాలడం సమస్య చాలా మందిని వేధిస్తోంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, స్నానం చేసేటప్పుడు చేసే కొన్ని చిన్న తప్పులు కూడా జుట్టు బలహీనపడటానికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా మంది జుట్టును జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ జుట్టు రాలడం సమస్య తగ్గడం లేదు. దీనికి ప్రధాన కారణాలు మన ఆహారం, జీవనశైలి. దీనికి తోడు స్నానం చేసే సమయంలో చేసే కొన్ని తప్పులు కూడా జుట్టు మూలాలను బలహీనపరుస్తాయి. అందుకే తలస్నానం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
షాంపూలను తరచుగా మార్చడం
చాలా మంది తరచూ కొత్త కొత్త షాంపూలను ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం వల్ల జుట్టు పొడిబారి నిర్జీవంగా మారుతుంది. అందువల్ల జుట్టు రాలిపోయే అవకాశం ఉంటుంది.
షాంపూను నేరుగా తలకు వేయడం
షాంపూను నేరుగా తలకు వేయడం మంచిది కాదు. ముందుగా అరచేతిలో కొద్దిగా నీటితో కలిపి తర్వాత జుట్టుకు వేయాలి. అలాగే కండిషనర్‌ను జుట్టు మూలాలకు కాకుండా జుట్టు పొడవున మాత్రమే వేయాలి. కండిషనర్ వేర్లకు చేరితే తలపై జిడ్డు పెరిగి జుట్టు కుదుళ్లు మూసుకుపోతాయి.
తలస్నానం తర్వాత జుట్టును గట్టిగా రుద్దడం
తలస్నానం చేసిన తర్వాత చాలా మంది టవల్‌తో జుట్టును గట్టిగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల జుట్టు క్యూటికల్స్ దెబ్బతిని జుట్టు బలహీనపడుతుంది. అందుకే మృదువైన కాటన్ వస్త్రం లేదా మైక్రోఫైబర్ టవల్‌తో నెమ్మదిగా తేమను తుడవాలి.
తరచుగా తలస్నానం చేయడం
రోజూ తలస్నానం చేయడం వల్ల జుట్టులోని సహజ నూనెలు తొలగిపోతాయి. దీంతో జుట్టు పొడిబారుతుంది. తలపై ఎక్కువ నూనె ఉత్పత్తి అవుతుంది. అందుకే వారానికి రెండు లేదా మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది.
తడి జుట్టును దువ్వడం
చాలామంది తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టును దువ్వుకుంటారు. కానీ తడి జుట్టు చాలా బలహీనంగా ఉంటుంది. ఆ సమయంలో దువ్వితే జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి ముందుగా జుట్టును సహజంగా ఆరనివ్వాలి. తర్వాత వెడల్పాటి దంతాల దువ్వెనతో మెల్లగా దువ్వాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
ఏ ఆహారాలు అజీర్ణానికి కారణమవుతాయి?
For More Latest News