ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూస్తే ఏమవుతుందో తెలుసా?
ABN , Publish Date - Mar 06 , 2026 | 07:38 AM
చాలా మందికి ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. కానీ ఈ అలవాటు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని మీకు తెలుసా? ఉదయం ఫోన్ వాడటం వల్ల మీ ఆరోగ్యానికి ఎలా హాని కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామందికి ఉదయం నిద్ర లేవగానే మొబైల్ ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. ముందుగా వాట్సాప్, తర్వాత సోషల్ మీడియా లేదా వార్తలను చూస్తుంటారు. ఈ ప్రక్రియ కొన్ని నిమిషాల నుంచి అరగంట వరకు కొనసాగుతుంది. అయితే ఇలా నిద్ర లేవగానే ఫోన్ చూడడం ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది హార్మోన్ల స్థాయిల నుంచి మెదడు పనితీరువరకు అనేక అంశాలపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఉదయం సమయం మెదడు చురుకుగా పనిచేసే సమయం. అందుకే ఆ సమయంలో కొన్ని మంచి అలవాట్లను పాటించడం మంచిది. ఉదాహరణకు, నిద్రలేవగానే కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని లోతుగా శ్వాస తీసుకోవడం మంచిది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి రోజువారీ పనులకు సిద్ధం కావడంలో సహాయపడుతుంది. కానీ నిద్రలేవగానే మొబైల్ స్క్రీన్ చూస్తూ మెసేజ్‌లు, సోషల్ మీడియా స్క్రోల్ చేస్తే మెదడుకు ఒక్కసారిగా ఎక్కువ సమాచారం చేరుతుంది.
ఫోన్ వాడకం ఆరోగ్యంపై ప్రభావం
ఉదయం లేవగానే ఫోన్ ఉపయోగించడం వల్ల మెదడుపై అనవసర ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందేశాలు లేదా వార్తలు ఆందోళన కలిగించేలా ఉండవచ్చు. దీని వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలు పెరిగి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అలాగే సోషల్ మీడియాలో చాలామంది తమ విజయాలు, మంచి క్షణాలను మాత్రమే పంచుకుంటారు. వాటిని చూసి ఇతరులతో పోల్చుకోవడం, ఆందోళన చెందడం వంటి భావనలు కలుగుతాయి. ఈ పరిస్థితిని ‘డిజిటల్ స్ట్రెస్’ అని అంటారు.
కళ్లపై కూడా ప్రభావం
అధికంగా ఫోన్ వాడటం వల్ల కళ్లపై కూడా ప్రభావం పడుతుంది. తలనొప్పి, కళ్లలో నీరు కారడం, కంటి నొప్పి వంటి సమస్యలు పెరుగుతాయి. రాత్రివేళల్లో కూడా ఎక్కువగా ఫోన్ ఉపయోగించడం వల్ల నిద్ర కూడా దెబ్బతింటుంది.
ఈ అలవాటును ఎలా తగ్గించాలి?
నిద్రలేవగానే కనీసం 15 నుంచి 20 నిమిషాల వరకు మొబైల్ ఫోన్ ఉపయోగించకుండా ఉండాలి. అత్యవసర కాల్ అయితే మాత్రమే మాట్లాడాలి. సోషల్ మీడియా లేదా ఇతర యాప్స్ చూడకుండా ఉండటం మంచిది. దానికి బదులుగా లైట్ స్ట్రెచింగ్ చేయడం, నీళ్లు తాగడం వంటి మంచి అలవాట్లు పెంచుకోవాలి. ఇలా చేస్తే రోజు సానుకూలంగా ప్రారంభమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News