Share News

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? ఇలా చెక్ చేసుకోండి

ABN , Publish Date - Mar 05 , 2026 | 03:53 PM

దేశంలో మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్ సిలిండర్‌నే వాడుతారు. అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే వాళ్లు పడే ఇబ్బంది మాటల్లో చెప్పలేం. సిలిండర్‌లో గ్యాస్ అయిపోతున్న విషయాన్ని కొన్ని చిట్కాలతో ముందుగానే తెలుసుకోవచ్చు.. అవేంటో చూద్దాం..

సిలిండర్‌లో గ్యాస్ ఎంత ఉందో తెలుసుకోవడం ఎలా? ఇలా చెక్ చేసుకోండి
LPG Cylinder Gas Level Check

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో మెజారిటీ ప్రజలు వంట కోసం గ్యాస్‌నే ఎక్కువగా వాడుతారు. ఇంట్లో అకస్మాత్తుగా గ్యాస్ అయిపోతే ఎన్నో ఇబ్బందులు పడతారు. బుకింగ్‌ చేసిన తర్వాత గ్యాస్ సిలిండర్ (Gas cylinder) వచ్చే వరకు ఎదురు చూపులు తప్పవు. ముందుగానే గ్యాస్ బుక్ చేసుకుంటే ఈ సమస్యే ఉండదు. మరి, ముందుగానే గ్యాస్ అయిపోతుందన్న విషయం తెలుసుకోవడం ఎలా? కొన్ని చిట్కాలతో మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో తెలుసుకోవచ్చు.


1. సిలిండర్‌పై తడి గుడ్డ చుట్టి 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత గుడ్డను తొలగించండి. సిలిండర్‌పై నీటి తేమ ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు గ్యాస్ ఉన్నట్లు లెక్క. పొడి కనిపించే భాగంలో గ్యాస్ అయిపోనట్లు అర్థం. ఈ చిట్కాతో గ్యాస్ ఎన్ని రోజులు వస్తుందో ఒక ఐడియా ఉంటుంది.

2. సాధారణంగా గ్యాస్ స్టవ్ వెలిగించినప్పుడు మంట నీలం రంగు(Blue)లో ఉంటుంది. కానీ, సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడానికి వచ్చినప్పుడు ఆ మంట రంగు పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంది. ఇది సిలిండర్ అడుగున గ్యాస్ తక్కువగా ఉందనడానికి ప్రాథమిక సంకేతం.

3. మీరు బర్నర్‌ను ఫుల్ సెట్టింగ్‌లో ఉంచినప్పటికీ, మంట చాలా తక్కువగా వస్తుంటే గ్యాస్ ప్రెజర్ తగ్గిందని అర్థం. గ్యాస్ చివరి దశకు చేరుకున్నప్పుడు ప్రెజర్ తగ్గి మంట సన్నగా వస్తుంది.

4. సిలిండర్ అడుగున గ్యాస్ తక్కువగా ఉన్నప్పుడు స్టవ్ వెలిగించినప్పుడు కొంచెం వింతగా ‘బుస్సు’ అనే శబ్ధం వస్తుంది. అలాగే, సిలిండర్ చివరలో ఉన్నప్పుడు గ్యాస్ వాసన కాస్త ఘాటుగా వస్తుంది.

5. ఇంటికి సిలిండర్ వచ్చినప్పుడు వెయిట్ చూసుకోవాలి. మీ వంటను బట్టి మధ్యలో ఒకసారి బరువు చూస్తే మీకు గ్యాస్ ఎంత వరకు అయిపోయిందో ఇట్టే అర్థమవుతుంది. సిలిండర్ చాలా తేలిక అనిపిస్తే వెంటనే బుక్ చేసుకోవడం మంచిది. పై లక్షణాలను గమనించడం ద్వారా గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో వెంటనే గుర్తించి ముందుగానే అంచనా వేయవచ్చు.


ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Latest News

Updated Date - Mar 05 , 2026 | 04:04 PM