Share News

రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

ABN , Publish Date - Apr 19 , 2026 | 10:35 AM

ప్రతిరోజూ అరటిపండు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? తింటే ఏమవుతుంది? ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ అరటిపండు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
Health Benefits of Banana

ఇంటర్నెట్ డెస్క్: అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ C, ప్రోటీన్, విటమిన్ B6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజూ ఒక అరటిపండు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అరటిపండ్లు శక్తిని అందించే మంచి ఆహారం. వీటిని సరైన పరిమాణంలో, సరైన విధంగా తినడం వల్ల ఆరోగ్యంపై మంచి ప్రభావం ఉంటుంది.


రోజూ అరటిపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె ఆరోగ్యానికి మేలు:

రక్తపోటును నియంత్రించుకోవాలంటే ప్రతిరోజూ అరటిపండు తినడం మంచిది. ఇందులోని పోషకాలు గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఇది ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఎముకలు బలపడతాయి:

అరటిపండ్లు ఎముకలను బలంగా ఉంచడంలో సహాయపడతాయి. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటే అరటిపండు ఉపయోగపడుతుంది.


పేగుల ఆరోగ్యానికి మేలు:

అరటిపండ్లు పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. రోజూ అరటిపండు తినడం వల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. అంతేకాదు మానసిక స్థితిని కూడా మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియకు సహాయపడుతుంది:

అరటిపండ్లలో ఉండే పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగించి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. పేగుల ఆరోగ్యానికి ఇది చాలా మంచిది.


మానసిక ఆరోగ్యానికి మేలు:

అరటిపండ్లలో విటమిన్ A, C, B6 వంటి పోషకాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన తగ్గించడంలో సహాయపడతాయి. దాంతో మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

చర్మానికి కాంతి ఇస్తుంది:

అరటిపండ్లలో విటమిన్ C, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంచుతాయి. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించి వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 19 , 2026 | 10:35 AM