అతిగా తినడం వల్ల వ్యాధుల ప్రమాదం పెరుగుతుందా?
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:03 PM
అతిగా తినడం నేటి జీవనశైలిలో సాధారణ అలవాటుగా మారింది. కానీ అవసరానికి మించి ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నేటి జీవనశైలిలో అతిగా తినడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. ఇది క్రమంగా శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీని వల్ల బరువు పెరగడం మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు.
ఎక్కువగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది. అలాగే జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. క్రమంగా ఇది శరీర పనితీరును ప్రభావితం చేసి అనారోగ్యాలకు దారితీస్తుంది.
అతిగా తినడం వల్ల వచ్చే వ్యాధులు
ఆరోగ్య నిపుణుల ప్రకారం, అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఇది ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం వల్ల మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అలాగే ఎసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలంగా ఈ అలవాటు ఉంటే కాలేయ సమస్యలు, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కూడా రావచ్చు.
అతిగా తినడం వల్ల కనిపించే లక్షణాలు
అతిగా తిన్న తర్వాత కడుపు బరువుగా అనిపించడం, నిద్రమత్తు, అలసట వంటివి కనిపిస్తాయి. అవసరం లేకపోయినా తరచుగా ఆకలి వేయడం కూడా ఒక సంకేతం కావచ్చు. తిన్న తర్వాత గ్యాస్, ఎసిడిటీ లేదా మంటగా అనిపించడం కూడా ఈ అలవాటుకు సూచన.
ఎలా నివారించాలి?
అతిగా తినకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టాలి. శరీరానికి అవసరమైనంత మాత్రమే తినాలి. నెమ్మదిగా తినడం, బాగా నమలడం మంచిది. జంక్ ఫుడ్ తగ్గించి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. సమయానికి భోజనం చేయాలి. ఇలా అతిగా తినే అలవాటు తగ్గించుకోని ఆరోగ్యంగా ఉండవచ్చు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!
For More Latest News