Share News

40 ఏళ్ల తర్వాత చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 01:46 PM

40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత శరీరంలో అనేక మార్పులు కనిపించడం సాధారణం. కాబట్టి, సరైన చెకప్‌లు, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా వ్యాధులను ముందుగానే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

40 ఏళ్ల తర్వాత చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు
Health Checkups After 40

ఇంటర్నెట్ డెస్క్: 40 ఏళ్ల తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే అప్పుడప్పుడు కొన్ని ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం. దీని వల్ల వ్యాధులు ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవచ్చు. ఇప్పుడు, 40 ఏళ్ల తర్వాత చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు ఏవో తెలుసుకుందాం..


  • బ్లడ్ షుగర్ టెస్ట్

  • కొలెస్ట్రాల్ టెస్ట్

  • బీపీ టెస్ట్

  • థైరాయిడ్ టెస్ట్

  • విటమిన్ లెవెల్స్ చెక్ టెస్ట్

అవసరమైతే గుండె సంబంధిత పరీక్షలు, ఇతర చెకప్‌లు కూడా చేయించుకోవాలి.

ఎందుకు చేయించుకోవాలి?

కొన్ని వ్యాధులు మొదట్లో ఎలాంటి లక్షణాలు చూపించవు. అప్పుడు వాటిని ముందుగానే గుర్తించలేం. క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటే సమస్యలు తొందరగా తెలిసిపోతాయి, సకాలంలో చికిత్స తీసుకోవచ్చు.


జీవనశైలిపై జాగ్రత్తలు:

  • పరీక్షలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా చాలా ముఖ్యం.

  • పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి.

  • రోజూ వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామం చేయాలి.

  • యోగా చేయడం మంచిది.

  • తగినంత నిద్ర అవసరం

  • ఒత్తిడిని తగ్గించుకోవాలి.

40 ఏళ్ల తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలి. చిన్న లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. క్రమం తప్పని చెకప్‌లు, మంచి జీవనశైలి ఉంటే ఆరోగ్యంగా, చురుకుగా ఉండొచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - Apr 18 , 2026 | 01:49 PM