Share News

పనస గింజలతో కాఫీని తయారు చేయవచ్చా?

ABN , Publish Date - May 25 , 2026 | 03:47 PM

పనస పండు తిన్న తర్వాత గింజలను చాలామంది పారేస్తుంటారు. కానీ ఆ గింజల్లోనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పనస గింజలతో రుచికరమైన కాఫీ కూడా తయారు చేసుకోవచ్చు.

పనస గింజలతో కాఫీని తయారు చేయవచ్చా?
Jackfruit Seed Coffee

ఇంటర్నెట్ డెస్క్: పనస పండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ చాలామంది పనస తిన్న తర్వాత గింజలను పారేస్తారు. అయితే ఆ గింజలతో రుచికరమైన కాఫీ తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా? అవును, పనస గింజలతో ప్రత్యేకమైన కాఫీని సులభంగా తయారు చేసుకోవచ్చు.

వేసవిలో పనస పండ్లు ఎక్కువగా లభిస్తాయి. పనస గింజల్లో యాంటీఆక్సిడెంట్లు, ప్రొటీన్, ఐరన్, విటమిన్-ఎ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత తగ్గించడంలో, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇప్పుడు అదే గింజలతో కాఫీ ఎలా చేయాలో తెలుసుకుందాం..


పనస గింజల కాఫీ తయారీ విధానం

ముందుగా పనస గింజలపై తొక్క తీసి చిన్న ముక్కలుగా కోయాలి. తర్వాత వాటిని ఒక పాన్‌లో వేసి 8 నుంచి 10 నిమిషాలు నూనె లేకుండా వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడిలా చేసుకోవాలి. ఆ పొడిని మళ్లీ పాన్‌లో వేసి గోధుమరంగు వచ్చే వరకు డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత మరోసారి మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే పనస గింజల కాఫీ పొడి సిద్ధమవుతుంది.

కాఫీ ఎలా తయారు చేయాలి?

ఒక గిన్నెలో పాలు వేడి చేసి అందులో కొద్దిగా పనస గింజల కాఫీ పొడి వేసి బాగా కలపాలి. ఉండలు లేకుండా కలుపుతూ మరిగించాలి. తర్వాత గ్లాసులో బెల్లం పొడి వేసి, తయారుచేసుకున్న కాఫీని అందులో పోసి కలిపితే రుచికరమైన పనస గింజల కాఫీ రెడీ అవుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

సిగరెట్లు తాగకపోయినా పెదాలు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలు ట్రై చేయండి

రాగి బాటిల్‌లో నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు మాత్రం చేయొద్దు

Updated Date - May 25 , 2026 | 05:06 PM