నిమ్మకాయ నుంచి ఎక్కువ రసం రావాలంటే.. ఇవిగో సింపుల్ చిట్కాలు
ABN , Publish Date - May 22 , 2026 | 02:04 PM
వేసవిలో ప్రతి ఒక్కరు నిమ్మకాయ వాడతారు. అందుకే ఈ సీజన్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో మండుటెండలో చల్లని నిమ్మ సోడా తాగడం వల్ల ఊరట పొందుతాం.
వేసవిలో ప్రతి ఒక్కరు నిమ్మకాయ వాడతారు. అందుకే ఈ సీజన్‌లో నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వేసవిలో మండుటెండలో చల్లని నిమ్మ సోడా తాగడం వల్ల ఊరట పొందుతాం. వీటిలో విటమిన్ సి ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిమ్మకాయను కోసి పిండినా కూడా ఎక్కువ రసం రావడం లేదంటూ చాలా మంది చెబుతుంటారు.
తాజా నిమ్మకాయలు కొన్నా.. వాటి నుంచి రసం రావడం లేదని వాపోతుంటారు. అధిక ధరకు నిమ్మకాయలు కొని.. ఎక్కువ రసం రాకుంటే నష్టం జరిగినట్లే అవుతుంది. నిమ్మకాయల నుంచి ఎక్కువ రసం పొందడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవి..
నిమ్మకాయను 10 సెకన్ల పాటు వేడి నీటిలో ఉంచి.. ఆ తర్వాత వాటి రసం పిండమని చెఫ్‌లు సూచిస్తున్నారు. ఇది కేవలం చిట్కానే కాదని.. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉందని వారు వివరిస్తున్నారు.
వేడి నీటిలో వేయడం వల్ల నిమ్మకాయ మెత్తబడుతుంది. కొన్ని సెకన్ల పాటు ఆ నీటిలో ఉంచడం వల్ల దానిపై తొక్కతోపాటు లోపలి కణాలు మెత్తబడతాయి. దీని వల్ల కాయను కోసి పిండితే.. అందులోని రసం సులభంగా బయటకు వస్తుంది.
ముఖ్యంగా రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన నిమ్మకాయలు చల్లబడటం వల్ల గట్టిపడతాయి. అటువంటి సమయాల్లో వేడి నీరు వాటి నిర్మాణాన్ని మెత్తబరిచి.. అధిక రసం బయటకు వచ్చేలా చేస్తుంది.
దీనికి అధిక సమయం వెచ్చించ నక్కర్లేదు. ఈ చిట్కాకు కేవలం 10 సెకన్లు మాత్రమే పడుతుంది. వేడి నీటి నుంచి తీసిన తర్వాత నిమ్మకాయను నేలపై మెల్లగా దొర్లిస్తూ రుద్దండి. ఆ తర్వాత దాన్ని కోయండి. అప్పుడు మీకు మామూలుగా కన్నా ఎక్కువ నిమ్మరసం వస్తుంది. కొంత మంది మైక్రోవేవ్‌లో ఉంచి నిమ్మకాయను వేడి చేస్తారు. అలా అయినా 5 నుంచి 10 సెకన్లు మాత్రమే వేడి చేయాలి. అధికంగా వేడి చేస్తే.. నిమ్మకాయలోని రుచి మారిపోతుంది.
నిమ్మకాయ పచ్చడి, వంటల్లో నిమ్మకాయలను అధికంగా వినియోగించాల్సి వచ్చినప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది.
పలుచని తొక్క ఉన్నవాటితోపాటు బరువు తక్కువగా ఉండే నిమ్మకాయల్లో రసం అధికంగా ఉంటుందని చెబుతారు. చాలా గట్టిగా లేదా మెత్తగా ఉండే నిమ్మకాయలను కొనవద్దని చెఫ్‌లు సూచిస్తున్నారు. ఫ్రిజ్‌లో నిమ్మకాయలను నిల్వ ఉంచినట్లు అయితే.. వాటిని ఉపయోగించే ముందు కొంతసేపు బయట ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుందని చెఫ్‌లు స్పష్టం చేస్తున్నారు.
గమనిక.. ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికతోపాటు సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఎలాంటి సంబంధం లేదని గమనించగలరు.
ఈ వార్తలు కూడా చదవండి..
30 ఏళ్లు దాటితే మోకాళ్ల నొప్పి ఎందుకు వస్తోంది?
కిడ్నీ సమస్యను నిర్లక్ష్యం చేయొద్దు
Read Latest AP News And Telugu News