Share News

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?

ABN , Publish Date - Feb 05 , 2026 | 01:21 PM

మునగాకు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. అయితే మీరు ఎప్పుడైనా మునగాకు సూప్ ట్రై చేశారా? ఎలా చేయాలంటే...

మునగాకు సూప్ ఎలా చేయాలో తెలుసా?
Drumstick Leaves Soup Recipe

ఇంటర్నెట్ డెస్క్: మునగాకు(Drumstick Leaves) పోషకాల గని. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం, రక్తపోటును(BP) నియంత్రించడం, చక్కెర స్థాయిలను తగ్గించడం, ఎముకలను బలోపేతం చేయడం, జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖ్యంగా ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, సీలతో కూడిన సూపర్ ఫుడ్. అయితే మీరు ఎప్పుడైనా మునగాకు సూప్ తాగారా? దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


అవసరమైన పదార్థాలు

  • మునగాకు – 1 కప్ (తరిగినవి)

  • ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)

  • వెల్లుల్లి రెబ్బలు – 2

  • అల్లం – 1 చిన్న ముక్క

  • టమోటా – 1 (సన్నగా తరిగినది)

  • నూనె / నెయ్యి – 1 టీస్పూన్

  • మిరియాల పొడి – ½ టీస్పూన్

  • ఉప్పు (రుచికి సరిపడినంత)

  • నీరు – 3 లేదా 4 కప్పులు

  • కొద్దిగా కొత్తిమీర లేదా లెమన్ జ్యూస్


తయారీ విధానం..

  • ముందుగా మునగాకును వేడినీటిలో మరిగించాలి.

  • తర్వాత.. పాన్‌లో 1 టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేడి చేయాలి.

  • ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి.

  • సన్నగా తరిగిన టమోటా వేసి కొన్ని నిమిషాలు వేయించాలి.

  • ఆపై మునగాకు వేసి బాగా కలపాలి.

  • తర్వాత నీరు జోడించి 10-15 నిమిషాలపాటు ఉడికించాలి.

  • ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి.

  • రుచికరమైన మునగాకు సూప్ రెడీ అవుతుంది.

  • కావాలంటే కొద్దిగా కొత్తిమీర లేదా లెమన్ జ్యూస్ వేసి సర్వ్ చేయవచ్చు.

  • ఈ సూప్‌ను వేడివేడిగా ఉన్నప్పుడు తాగితే సూపర్‌ టేస్టీగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Feb 05 , 2026 | 02:10 PM