Share News

పనీర్ కంటే జున్ను మంచిదా?

ABN , Publish Date - Jan 30 , 2026 | 01:58 PM

పనీర్, చీజ్ రెండూ పాలతో తయారయ్యే ఆహార పదార్థాలే. సాధారణంగా చాలామంది పనీర్‌నే ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు. అయితే.. పనీర్, చీజ్ మధ్య తేడాలు ఏమిటి? ఏది ఆరోగ్యానికి మంచిది?

పనీర్ కంటే జున్ను మంచిదా?
Paneer Vs Cheese

ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో చాలా మంది తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ప్రొటీన్ కోసం చాలా మంది పనీర్‌ను తమ ఆహారంలో చేర్చుకుంటారు. పనీర్ శరీరానికి బలం ఇస్తుంది. అలాగే కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటూ బరువు నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. అందుకే ఫిట్‌నెస్‌పై ఆసక్తి ఉన్నవారు, డైట్ పాటించే వారు పనీర్‌ను ఎక్కువగా తింటారు.


జున్ను (కొలెస్ట్రమ్ పాలు) పోషకాహారం. ఇందులో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్లు (A, D, K), జింక్, అవసరమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఎముకల బలానికి, కండరాల వృద్ధికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. సాధారణ పాల కంటే ఇందులో అధిక పోషక విలువలు ఉంటాయి.


పనీర్ కంటే జున్ను మంచిదా?

ఆరోగ్య నిపుణుల ప్రకారం, కొన్ని సందర్భాల్లో పనీర్ కంటే జున్ను ఆరోగ్యానికి మంచిది. 100 గ్రాముల పనీర్‌లో సుమారు 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. 100 గ్రాముల ప్రాసెస్ చేయని జున్నులో సుమారు 25 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అలాగే జున్నులో సుమారు 400 కేలరీలు, పనీర్‌లో సుమారు 250 కేలరీలు ఉంటాయి. జున్నులో కొవ్వు సుమారు 33 గ్రాములు, పనీర్‌లో కొవ్వు సుమారు 20 గ్రాములు ఉంటుంది.


జున్నులో ప్రొటీన్ ఎక్కువగా ఉన్నా.. కేలరీలు, కొవ్వు కూడా ఎక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలంటే పనీర్ తీసుకోవడం మంచిది. బరువు పెరగాలంటే లేదా ఎక్కువ శక్తి కావాలంటే జున్ను ఉపయోగపడుతుంది. అందువల్ల పనీర్ లేదా జున్ను రెండింటిలో మీ శరీర అవసరాలకు ఏది సరిపోతుందో అది తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

థాయ్ మసాజ్ ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా?

పానిక్ అటాక్‌ని ఎలా గుర్తించాలో తెలుసా?

For More Latest News

Updated Date - Jan 30 , 2026 | 03:51 PM