Share News

పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి

ABN , Publish Date - May 12 , 2026 | 08:29 AM

వేసవిలో ఇంట్లో పెరుగు త్వరగా పుల్లగా మారడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ సమస్య. అయితే, పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు ట్రై చేయండి
Curd Making Tips

ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లో పెరుగు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని చల్లగా ఉంచడంలో, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కానీ అధిక వేడి కారణంగా ఇంట్లో తయారు చేసిన పెరుగు త్వరగా పుల్లగా మారడం చాలా మందికి ఎదురయ్యే సమస్య. దీంతో దాని రుచి కూడా త్వరగా మారిపోతుంది. వేసవిలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో పాలలో ఉండే బ్యాక్టీరియా వేగంగా పనిచేస్తుంది. ఫలితంగా పాలు త్వరగా పెరుగుగా మారి, కొద్దిసేపటికే పుల్లగా మారిపోతాయి. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే పెరుగును ఎక్కువకాలం తాజాగా, రుచికరంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


పెరుగు పుల్లగా కాకుండా ఉండాలంటే చిట్కాలు

స్టార్టర్ తక్కువగా వాడాలి

పెరుగు పెట్టేటప్పుడు కొద్దిగా మాత్రమే పాత పెరుగు (స్టార్టర్) వాడాలి. ఎక్కువగా వాడితే పెరుగు త్వరగా గట్టిపడి, వెంటనే పుల్లగా మారే అవకాశం ఉంటుంది. అందుకే సరైన మోతాదులో స్టార్టర్ వాడటం చాలా ముఖ్యం.

పాల ఉష్ణోగ్రత సరిగా ఉండాలి

పాలు గోరువెచ్చగా ఉండాలి. మరీ వేడిగా లేదా చల్లగా ఉండకూడదు. ఇలా ఉంటే పెరుగు రుచి బాగుంటుంది.

మట్టి పాత్రలు వాడటం మంచిది

మట్టి పాత్రల్లో పెరుగు పెడితే అది ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. రుచి కూడా బాగుంటుంది.


సరైన సమయం

రాత్రిపూట పెరుగు పెట్టడం మంచిది. ఉదయం వరకు అది బాగా గట్టిపడుతుంది. పుల్లగా కాకుండా ఉంటుంది.

ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి

పెరుగు గట్టిపడ్డ వెంటనే ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎక్కువసేపు బయట ఉంచితే అది త్వరగా పుల్లగా మారుతుంది.

పుల్లగా అయిన పెరుగును ఎలా ఉపయోగించాలి?

పెరుగు పుల్లగా మారినా దాన్ని వృథా చేయాల్సిన అవసరం లేదు. దానికి కొద్దిగా తాజా పాలు కలిపితే పులుపు తగ్గి రుచి మెరుగుపడుతుంది. అలాగే పెరుగును జల్లెడలో వడకట్టి కూడా ఉపయోగించవచ్చు. కొద్దిసేపు నీరు తీసేసి వాడితే కూడా దాని రుచి కొంతవరకు సరిగా ఉంటుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - May 12 , 2026 | 11:07 AM