ప్రోటీన్ రిచ్ డిష్ కావాలా? ఈ మిల్ మేకర్ ఫ్రై ట్రై చేయండి
ABN , Publish Date - May 09 , 2026 | 06:40 PM
తక్కువ సమయంలోనే రుచికరంగా, ఆరోగ్యకరంగా తయారయ్యే వంటకాలలో మిల్ మేకర్ ఫ్రై ఒకటి. ప్రోటీన్ అధికంగా ఉండటంతో ఇది పోషకాహారంగా కూడా భావిస్తారు.
ఇంటర్నెట్ డెస్క్: మిల్ మేకర్‌తో చేసే వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. ముఖ్యంగా అన్నం, రోటీ, చపాతీ, పులావ్‌తో మిల్ మేకర్ ఫ్రై అద్భుతంగా సరిపోతుంది. తక్కువ సమయంలోనే సులభంగా తయారయ్యే ఈ టేస్టీ రెసిపీని ఇంట్లో ఒకసారి ట్రై చేయండి.
కావలసిన పదార్థాలు
మిల్ మేకర్ – 1 కప్పు
ఉల్లిపాయ – 1 (సన్నగా తరిగినది)
టమోటాలు – 2 (తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీస్పూన్
కారం – 1 టీస్పూన్
పసుపు – అర టీస్పూన్
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – అర టీస్పూన్
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు, జీలకర్ర – తాలింపు కోసం
కరివేపాకు – కొద్దిగా
కొత్తిమీర – అలంకరణ కోసం
తయారీ విధానం
ముందుగా ఒక పాత్రలో వేడి నీరు తీసుకుని అందులో మిల్ మేకర్ వేసి 10 నిమిషాలు నానబెట్టాలి. తర్వాత వాటిని బాగా పిండి అదనపు నీటిని తీసేయాలి.
ఇప్పుడు స్టౌపై ఒక బౌల్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి తాలింపు వేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపాలి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
తర్వాత పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. మసాలా నుంచి నూనె పైకి కనిపించే వరకు వేపితే ఫ్రైకి మంచి రుచి వస్తుంది.
ఇప్పుడు నానబెట్టిన మిల్ మేకర్ వేసి మసాలా బాగా పట్టేలా కలపాలి. అవసరమైతే కొద్దిగా నీరు పోసి 5 నుంచి 7 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
చివరగా గరం మసాలా, కొత్తిమీర చల్లి మరో రెండు నిమిషాలు కలిపి స్టౌ ఆఫ్ చేస్తే వేడి వేడి మిల్ మేకర్ ఫ్రై రెడీ ! అన్నం, రోటీ, చపాతీతో ఈ ఫ్రై తింటే టేస్టీ అదిరిపోతుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News