Share News

మితిమీరిన అంచనాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..

ABN , Publish Date - May 09 , 2026 | 05:02 PM

ఇతరులపై మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం మంచిది కాదని ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో పేర్కొన్నారు. జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే ఇతరుల నుంచి ఎక్కువగా ఆశించకూడదని ఆయన సూచించారు.

మితిమీరిన అంచనాలు జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయంటే..
Chanakya On Over Expectations

ఇంటర్నెట్ డెస్క్: ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో విజయవంతమైన జీవితం, మానసిక ప్రశాంతత గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఇతరులపై ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఆయన స్పష్టంగా వివరించారు. ప్రతి మనిషి జీవితంలో అంచనాలు సహజమే అయినా, అవి మితిమీరితే బాధలు, నిరాశలు పెరుగుతాయని చాణక్యుడు చెప్పారు.


మనకు దగ్గరైన వారిపై ఎక్కువ ఆశలు పెట్టుకోవడం సహజం. కానీ వారు మనం ఊహించినట్లు ప్రవర్తించకపోతే మనసుకు బాధ కలుగుతుంది. అందుకే ఎవరి నుంచైనా అతిగా ఆశించకూడదని చాణక్యుడు సూచించారు.

ఎక్కువ అంచనాలు పెడితే వచ్చే సమస్యలు

  • నిరాశ : మన అంచనాలకు అనుగుణంగా ఎదుటివారు ప్రవర్తించకపోతే తీవ్ర నిరాశ కలుగుతుంది. ఇది మనసును బలహీనపరుస్తుంది. ఇతరుల ఆలోచనలు, ప్రవర్తన పూర్తిగా మన చేతుల్లో ఉండవని గుర్తుంచుకోవాలి.

  • సంబంధాలలో దూరం : ప్రతి వ్యక్తికి తనకంటూ ఆలోచనలు, పరిమితులు ఉంటాయి. కానీ మన అంచనాలు ఎక్కువైతే అవి నెరవేరకపోవడంతో అపార్థాలు, కోపం, అసంతృప్తి పెరుగుతాయి. దీని వల్ల సంబంధాల్లో చీలిక వచ్చే అవకాశం ఉంటుంది.

Relation.jpg


  • మానసిక ఒత్తిడి: నేను అనుకున్నట్లు ఎందుకు చేయలేదు? అనే ఆలోచనలు మనసును వేధిస్తాయి. ఇవి మానసిక ఒత్తిడిని పెంచి ఆనందాన్ని దూరం చేస్తాయి.

  • ఆత్మవిశ్వాసం తగ్గుతుంది: ఇతరులపై ఎక్కువగా ఆధారపడటం వల్ల మనపై మనకు నమ్మకం తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం తగ్గితే జీవితంలో ముందుకు వెళ్లడం కష్టమవుతుంది. అందుకే ఇతరులపై కాకుండా ముందుగా మనల్ని మనం నమ్ముకోవాలని చాణక్యుడు సూచించారు. ఇతరుల నుంచి మితిమీరిన అంచనాలు పెట్టుకోవడం కంటే, మన పనిపై దృష్టి పెట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితం ప్రశాంతంగా ఉంటుందని చాణక్యుడు సూచించారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

తలసేమియా.. పెళ్లికి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన పరీక్ష

బంగారం ఈ దిశలో పెడితే నష్టం తప్పదు.!

For More Latest News

Updated Date - May 09 , 2026 | 05:20 PM