Share News

అడ్వెంచర్ ప్రేమికులకు బెస్ట్ డెస్టినేషన్ లావోస్

ABN , Publish Date - May 07 , 2026 | 06:29 PM

హైదరాబాద్‌లోని పర్యాటక ప్రదేశాలు చూసి బోర్ కొట్టిందా? తక్కువ ఖర్చుతో విదేశీ ట్రిప్ చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ లావోస్.

అడ్వెంచర్ ప్రేమికులకు బెస్ట్ డెస్టినేషన్ లావోస్
Laos Travel Guide

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు చూసి బోర్ కొట్టిందా? అయితే తక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి మంచి ఆప్షన్ ఒకటి ఉంది. చాలామంది విదేశీ టూర్లకు బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియా, సింగపూర్ వంటి దేశాలను ఎంచుకుంటారు. కానీ వాటికంటే కూడా తక్కువ ఖర్చుతో వెళ్లగలిగే దేశంగా లావోస్ పేరు పొందింది. ఆసియా ఖండంలో ఉన్న లావోస్ ఇప్పుడు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి టూరిస్టులు ఇక్కడికి వస్తున్నారు. బడ్జెట్‌లో విదేశీ ట్రిప్ చేయాలనుకునేవారికి ఇది మంచి గమ్యస్థానం అని చెప్పొచ్చు.

Loas 1.jpg


లావోస్‌ను ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీగా కూడా భావిస్తారు. థాయిలాండ్, వియత్నాం మధ్యలో ఉన్న ఈ దేశం ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తోంది. ఇక్కడ అందమైన జలపాతాలు, గుహలు, నదులు, పర్వతాలు పర్యాటకులకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. తక్కువ ధరలోనే ఫుడ్, వసతి, ప్రయాణ సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ఇది బడ్జెట్ ట్రావెలర్లకు, అడ్వెంచర్ ప్రియులకు మంచి ఎంపికగా మారింది.

Loas.jpg

లావోస్ చేరుకోవాలంటే సాధారణంగా హైదరాబాద్ నుంచి బ్యాంకాక్ లేదా కౌలాలంపూర్ వరకు విమానంలో వెళ్లాలి. అక్కడి నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ద్వారా లావోస్ చేరుకోవచ్చు. రిటర్న్ విమాన టికెట్ ధరలు సుమారు రూ.25,000 నుంచి రూ.45,000 వరకు ఉంటాయి. సీజన్‌ను బట్టి ధరలు మారుతుంటాయి. వీసా ఖర్చు కూడా తక్కువగానే ఉంటుంది.

లావోస్‌లో చాలా మంది టూరిస్టులు టూ వీలర్ రెంట్ తీసుకుని గ్రామాలు, పర్వత ప్రాంతాలు, వ్యూ పాయింట్లను సందర్శిస్తారు. ఇక్కడి సహజ అందాలు చాలా ఆకట్టుకుంటాయి. బడ్జెట్ హోటల్స్‌లో రాత్రి బసకు సుమారు రూ.300కే వసతి లభిస్తుంది. రోజువారీ ఆహార ఖర్చు కూడా సుమారు రూ.200 నుంచి రూ.300 వరకు ఉంటుంది. తక్కువ ఖర్చుతో విదేశీ ప్రయాణం చేయాలనుకునే వారికి లావోస్ ఒక ఆకర్షణీయమైన ట్రావెల్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

రోజూ సంగీతం వినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో

ఇతరుల మాటలు వినడం.. మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?

For More Latest News

Updated Date - May 07 , 2026 | 06:40 PM