SLR బోగీ గురించి ఈ నిజాలు మీకు తెలుసా?
ABN , Publish Date - May 02 , 2026 | 05:04 PM
రైళ్లలో కనిపించే SLR బోగీని చాలామంది స్లీపర్ కోచ్‌గా భావిస్తారు. కానీ నిజానికి దాని అర్థం వేరే ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: రైళ్లలో మనకు అనేక గుర్తులు, అక్షరాలు, కోడ్స్ కనిపిస్తాయి. కానీ వాటి అర్థాలు చాలా మందికి తెలియవు. రైలు బోగీపై 'SLR' అని ఉంటే అది స్లీపర్ కోచ్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు.
SLR అంటే 'స్లీపర్' కాదు. దీని అసలు అర్థం 'సీటింగ్ కమ్ లగేజ్ రేక్' (Seating-cum-Luggage Rake). పేరుకు తగ్గట్టే ఈ కోచ్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒక భాగం ప్రయాణికులు కూర్చోవడానికి సీట్లు ఉంటాయి. మరో భాగం లగేజ్, పార్శిల్స్ పెట్టడానికి ఉపయోగిస్తారు.
ఈ కోచ్ సాధారణ ప్యాసింజర్ కోచ్‌లా ఉండదు. ఇందులో ఒకేసారి రెండు పనులు జరుగుతాయి. ప్రయాణికులు కూర్చోవడానికి సీట్ల సదుపాయం ఉంటుంది. అలాగే సరుకులు, సామాను ఉంచడానికి ప్రత్యేకంగా స్థలం కూడా ఉంటుంది. SLR కోచ్‌లు సాధారణంగా రైలు ముందు, వెనుక భాగంలో ఉంటాయి. ఇలా ఉంచడం వల్ల రైల్వేకు పార్సెల్స్ నిర్వహణ సులభమవుతుంది. రైలు సమతుల్యత కూడా బాగుంటుంది.
ఈ కోచ్‌లో ఒక భాగం గార్డ్ కోసం కేటాయిస్తారు. గార్డ్ రైలు కదలికలు, భద్రత, సమన్వయం చూసుకుంటారు. అక్కడ కమ్యూనికేషన్ పరికరాలు, కిటికీలు కూడా ఉంటాయి. మరో భాగంలో ప్రయాణికుల కోసం కొన్ని సీట్లు ఉంటాయి. ఇందులో దివ్యాంగుల కోసం ప్రత్యేక సీట్లు కూడా కేటాయిస్తారు. అలాగే ప్రయాణికుల అదనపు సామాను, చిన్న పార్సెల్స్, సరుకులు కూడా ఇందులో తరలిస్తారు. చాలామంది SLR కోచ్‌ను సాధారణ కోచ్‌గా భావిస్తారు. కానీ ఇది రైలు భద్రత, సరుకు రవాణా, నిర్వహణలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..
ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..
For More Latest News