Share News

విహారయాత్రకు వెళ్తున్నారా? బయలుదేరే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:07 PM

వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని చిన్న విషయాలను పట్టించుకోకపోతే, ఆ ప్రయాణం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.

విహారయాత్రకు వెళ్తున్నారా? బయలుదేరే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Family Trip Tips

ఇంటర్నెట్ డెస్క్: రోజువారీ హడావుడి నుంచి కాసేపు విరామం తీసుకుని కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ఇది మనసుకు ప్రశాంతతను ఇవ్వడమే కాకుండా, కుటుంబ సభ్యులతో మంచి సమయం గడపడానికి కూడా సహాయపడుతుంది. అయితే, తొందరలో కొన్ని చిన్న విషయాలు మర్చిపోతే మీ ట్రిప్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.


విద్యుత్, గ్యాస్ ఆఫ్ చేయడం

ఇంటి నుంచి బయలుదేరే ముందు అన్ని ఎలక్ట్రిక్ స్విచ్‌లు ఆఫ్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎల్‌పీజీ గ్యాస్ రెగ్యులేటర్ కూడా తప్పకుండా ఆఫ్ చేయాలి.

వాటర్ ట్యాప్‌లు ఆఫ్ చేయడం

వాటర్ ట్యాప్‌లు ఓపెన్‌గా ఉంటే నీరు వృథా అవ్వడమే కాకుండా లీకేజీల సమస్యలు రావచ్చు. కాబట్టి ప్రధాన వాల్వ్‌ను ఆఫ్ చేయాలి.

Taps.jpg

ప్యాకింగ్ చెక్‌లిస్ట్ చూసుకోవడం

తొందరలో టూత్‌బ్రష్, మొబైల్ ఛార్జర్, మందులు వంటి ముఖ్యమైన వస్తువులు మరిచిపోవచ్చు. కాబట్టి, ముందుగానే ఒక లిస్ట్ తయారు చేసుకోని అన్నీ సర్దుకోవడం మంచిది.

Travel checklist.jpg

ఫ్రీజర్‌లో పాడయ్యే వస్తువులు తీసేయడం

కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి దూరంగా ట్రిప్‌కు వెళ్తున్నట్లయితే త్వరగా పాడయ్యే పదార్థాలను ఫ్రీజర్‌లో ఉంచకపోవడం బెటర్.


అవసరమైన పత్రాలు తీసుకెళ్లడం

ఐడీ ప్రూఫ్, టిక్కెట్లు, హోటల్ బుకింగ్ వివరాలు తప్పకుండా వెంట ఉంచుకోవాలి. కేవలం మొబైల్‌లో ఉండటం సరిపోదు.

సోషల్ మీడియాలో ట్రిప్ అప్‌డేట్లు

మీరు ట్రిప్‌కు వెళ్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల భద్రతా సమస్యలు రావచ్చు. మీరు ఇంట్లో లేరని సోషల్ మీడియాలో చెప్పడం వల్ల దొంగతనాలకు అవకాశం ఉంటుంది.

Selfie.jpg

నగదు తీసుకెళ్లండి

ప్రతి చోటా డిజిటల్ పేమెంట్లు పనిచేయవు. కాబట్టి కొంత నగదు దగ్గర ఉంచుకోవాలి.

ఫస్ట్ ఎయిడ్ కిట్

చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు మందులు అవసరం అవుతాయి. కాబట్టి ఒక చిన్న ప్రథమ చికిత్స కిట్ వెంట ఉంచుకోవాలి. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ విహారయాత్ర మరింత సురక్షితంగా, ఆనందంగా సాగుతుంది.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - Apr 27 , 2026 | 01:34 PM