మామను గుర్తు చేసుకుని ఎమోషనలైన రింకు సింగ్ భార్య!
ABN , Publish Date - Apr 27 , 2026 | 11:41 AM
ఐపీఎల్ 2026లో భాగంగా ఏకానా స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఈ క్రమంలో స్టాండ్స్‌లో ఉన్న రింకు సింగ్ సతీమణి ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా లఖ్‌నవూ ఏకానా స్టేడియం నిన్న(ఆదివారం) ఓ ఆసక్తికరమైన పోరాటానికి వేదికైంది. లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్ సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. బ్యాట్‌తో పరుగుల సునామీ సృష్టించిన రింకూ సింగ్.. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మైదానంలో రింకు సింగ్ సంచలనం సృష్టిస్తుంటే.. స్టాండ్స్‌లో ఉన్న ఆయన సతీమణి ప్రియా సరోజ్ తన మామగారిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మ్యాచ్ గెలిచిన అనంతరం కోల్‌కతా నైట్ రైడర్స్ ఓ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ప్రియా సరోజ్ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తుంది. ప్రియా సరోజ్ మాట్లాడుతూ.. 'రింకు సింగ్ ఆడిన ఈ అద్భుతమైన ఇన్నింగ్స్ మామగారికి అంకితం. ఈ రోజు ఆయన బతికి ఉంటే ఈ విజయాన్ని చూసి ఎంతో గర్వపడేవారు. నిజానికి ఈ క్షణానం మేమందరం మామను చాలా మిస్సవుతున్నాం' అని ప్రియా సరోజ్ పేర్కొన్నారు. రింకు సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ గత ఫిబ్రవరిలో లివర్ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. తండ్రి మరణించిన కొద్ది నెలలకే రింకు సింగ్ పట్టుదలతో మైదానంలోకి వచ్చి ఇలాంటి ప్రదర్శన చేయడం చూసి ఫ్యాన్స్ సెల్యూట్ చేస్తున్నారు.
లఖ్‌నవూ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ వైస్ కెప్టెన్‌గా రింకు సింగ్ తన హోదాకు తగ్గట్టుగా రాణించాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టుకు ఆరంభంలోనే షాక్‌లు తగిలాయి. వరుసగా వికెట్లు పడుతున్న వేళ.. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్ లఖ్‌నవూ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. కేవలం 51 బంతుల్లోనే 83 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రింకు ఒంటరి పోరాటం వల్లే కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులైన చేయగలిగింది.
ఇవి కూడా చదవండి:
ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ప్లేయర్ల ఆగ్రహం!