ఆంధ్ర నెట్ బౌలర్‌కు తీవ్ర గాయం.. క్షమాపణ చెప్పిన ఆసీస్ క్రికెటర్!
ABN , Publish Date - Apr 27 , 2026 | 10:45 AM
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ కుర్రాడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. తన కారణంగా గాయపడిన ప్రసాద్‌ను ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ పరామర్శించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ యువకుడు గిరి ప్రసాద్‌కు గాయమైంది. న్యూఢిల్లీలో శనివారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా పంజాబ్ కింగ్స్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టొయినిస్ బలమైన షాట్ కొట్టాడు. అదే సమయంలో షాట్ నెట్స్ వద్ద ఉన్న గిరి ప్రసాద్ ముఖానికి బలంగా తాకింది. ఫలితంగా తీవ్రంగా గాయపడ్డ గిరి ప్రసాద్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్స చేయించింది. తాజాగా అతడికి స్టొయినిస్ సారీ చెప్పాడు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గిరి ప్రసాద్ ను ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని గ్రంధి కిరణ్ కుమార్ ఆస్పత్రికి వచ్చి గిరి ప్రసాద్‌ను పరామర్శించారు. అతడి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. అలానే స్టొయినిస్ కూడా ఆస్పత్రికి వెళ్లి గిరి ప్రసాద్‌ను పంజాబ్ కింగ్స్ ఆల్‌రౌండర్ పరామర్శించాడు. పొరపాటుగా జరిగిన దానికి క్షమించాలని కోరాడు. యువ క్రికెటర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నాడు. అనంతరం ప్రసాద్‌తో సెల్ఫీ దిగిన స్టొయినిస్.. టోపీపై తన ఆటోగ్రాఫ్ చేసి ఇచ్చాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన గిరి ప్రసాద్ గత సీజన్‌లోనూ ఢిల్లీ క్యాపిటల్స్‌కు నెట్ బౌలర్‌గా ఉన్నాడు.
ఇవి కూడా చదవండి:
రఘు వంశీ ఔట్‌పై దుమారం.. అంపైర్లపై కేకేఆర్ ప్లేయర్ల ఆగ్రహం!
విరాట్ సిక్సర్ల సంఖ్య 300 అధిగమించడం అద్భుతం: మహ్మద్ కైఫ్