కేకేఆర్ చేతిలో ఓటమి.. రిషబ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 27 , 2026 | 07:53 AM
ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఇక తమ ఓటమిపై ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో ఏకానా స్టేడియం వేదికగా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో లఖ్‌నవూ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్‌లో కేకేఆర్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో లఖ్‌నవూ ఓటమి పాలైంది. తమ జట్టు పరాజయంపై ఎల్ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. తనపై, జట్టుపై ఒత్తిడి పెరుగుతుందని పరోక్షంగా ప్రస్తావించాడు.
మ్యాచ్ అనంతరం పంత్ మాట్లాడుతూ..'మాకు కచ్చితంగా విరామం అవసరమని నేను భావిస్తున్నాను. అలానే మేము మరింత బలంగా త్వరలో వస్తాము. ఒత్తిడి ఎప్పుడూ ఉంటుంది. ఓటమి విషయంలో మనం బయటనే కాకుండా మనలో కూడా సమాధానాలు వెతుక్కోవాలి. గెలుపు కోసం జట్టులోని ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి. ఇది ఒకరిద్దరి గురించి కాదు. ఇది మొత్తం జట్టుకు సంబంధించినదిగా ఉండాలి. మా టీమ్ సభ్యులు విజయం కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటారు' అని పంత్ తెలిపాడు
అలానే దిగ్వేశ్ సింగ్ రాఠీకి 20వ ఓవర్ ఇవ్వాలన్న నిర్ణయం గురించి అడగ్గా..'మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ను కాస్త టర్న్ చేసేందుకు అవకాశం ఉండే సందర్భాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ కొన్నిసార్లు బౌలర్లు కఠినమైన ఓవర్లు వేయాల్సి వస్తుంది. మేము వికెట్ కోసం చూస్తున్నప్పుడు అతడికి చివరి ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. కానీ మాకు వికెట్ దొరకలేదు. మైదానంలో ఒకేసారి ఎక్కువ ఆలోచనలు చేయడం అంత సులభం కాదు' అంటూ పంత్ రిప్లై ఇచ్చాడు.
ఇవి కూడా చదవండి: