Share News

వారెవా..రింకూ

ABN , Publish Date - Apr 27 , 2026 | 02:36 AM

భారీ స్కోర్లు లేవు.. శతక బాదడాలూ లేవు. అయినా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయిం ట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. కేవలం...

వారెవా..రింకూ

నేటి మ్యాచ్‌

ఢిల్లీ X బెంగళూరు

వేదిక ఢిల్లీ, రా.7.30 నుంచి

  • కోల్‌కతా కమాల్‌

  • సూపర్‌ ఓవర్‌లో విజయం

స్వల్ప ఛేదనలో లఖ్‌నవూ బోల్తా

లఖ్‌నవూ: భారీ స్కోర్లు లేవు.. శతక బాదడాలూ లేవు. అయినా ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌-లఖ్‌నవూ సూపర్‌ జెయిం ట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ అభిమానులను ఉర్రూతలూగించింది. కేవలం 155 పరుగులను కాపాడుకోవడంలో కోల్‌కతా బౌలర్ల పట్టు వదలని ప్రదర్శన తాజా సీజన్‌కే హైలైట్‌గా నిలిచింది. అటు ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా సాగి.. ఆఖరి బంతికి సిక్సర్‌తో మ్యా చ్‌ను లఖ్‌నవూ సూపర్‌ ఓవర్‌కు మళ్లించింది. కానీ నరైన్‌ ధాటికి తొలి మూడు బంతులకు ఒక్క పరుగే చేసి రెండు వికెట్లు కోల్పోవడం.. అటు మొదటి బంతినే ఫోర్‌గా మలిచిన కోల్‌కతా సూపర్‌ సంబరాల్లో మునిగిపోవడం చకచకా జరిగిపోయాయి. ఎల్‌ఎ్‌సజీకిది వరుసగా ఐదో ఓటమి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (51 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 83 నాటౌట్‌), గ్రీన్‌ (21 బంతుల్లో 3 సిక్సర్లతో 34) రాణించారు. మొహిసిన్‌కు ఐదు వికెట్లు దక్కాయి. ఛేదనలో లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేయడంతో టై అయ్యింది. పంత్‌ (42), మార్‌క్రమ్‌ (31), బదోని (24) ఫర్వాలేదనిపించారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రింకూ నిలిచాడు.

బౌలర్లు సమష్ఠిగా..: లఖ్‌నవూను ఆరంభం నుంచే కోల్‌కతా బౌలర్లు కట్టడి చేశారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లు వరుణ్‌, నరైన్‌ ఆధిపత్యం చూపారు. రెండో ఓవర్‌లోనే ఓపెనర్‌ మార్ష్‌ (2) వెనుదిరగ్గా, మరో ఓపెనర్‌ మార్‌క్రమ్‌, కెప్టెన్‌ పంత్‌ మాత్రం ఓపికగా క్రీజులో నిలిచారు. అయితే రన్స్‌ రావడం కష్టంగా మారడంతో పవర్‌ప్లేలో 37 పరుగులే వచ్చాయి. 11వ ఓవర్‌ నుంచి జట్టు తడబాటు ఆరంభమైంది. మార్‌క్రమ్‌ను గ్రీన్‌ అవుట్‌ చేయడంతో రెండో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఆ తర్వాత స్పిన్నర్ల వలలో చిక్కుకుని పంత్‌ సహా మిగిలిన బ్యాటర్లంతా చకచకా పెవిలియన్‌కు చేరా రు. చివరి ఓవర్‌లో 17 పరుగులు కావాల్సి ఉండగా..త్యాగి రెండు నోబ్స్‌ వేయడం, హిమ్మత్‌ 4తో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. అయితే మూడో బంతికి హిమ్మత్‌ అవుట్‌ కావడంతో మ్యాచ్‌ కేకేఆర్‌దే అనిపించింది. కానీ చివరి బంతికి సిక్సర్‌ బాదిన షమి (11 నాటౌట్‌)మ్యాచ్‌ను సూపర్‌ ఓవర్‌కు మళ్లించాడు.


సూపర్‌...రింకూ: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా పరుగుల కోసం చెమటోడ్చింది. పేసర్‌ మొహిసిన్‌ బంతులకు కేకేఆర్‌ బ్యాటర్ల దగ్గర సమాధానం లేకుండా పోయింది. దీంతో వంద పరుగులు చేసేందుకు జట్టు 17 ఓవర్లు తీసుకుంది. కానీ రింకూ సింగ్‌ సిక్సర్లతో కూడిన ఫినిషింగ్‌ టచ్‌ వహ్వా అనిపించింది. పవర్‌ప్లేలోనే ఓపెనర్‌ సైఫర్ట్‌ (0), రహానె (10)లను పేసర్‌ మొహిసిన్‌ అవుట్‌ చేయగా.. రఘువంశీ అబ్‌స్ట్రక్టింగ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. పోవెల్‌ (1)ను కూడా మొహిసిన్‌ అవుట్‌ చేయడంతో 31/4 స్కోరుతో కేకేఆర్‌ దీనంగా కనిపించింది. 11వ ఓవర్‌లో గ్రీన్‌, అనుకుల్‌ (0)లను మొహిసిన్‌ వరుస బంతుల్లో వెనక్కిపంపి ఐదు వికెట్ల ఫీట్‌ పూర్తి చేశాడు. అయితే 18 ఓవర్లలో 112/7 స్కోరుతో పేలవంగా సాగిన బ్యాటింగ్‌కు చివరి రెండు ఓవర్లలో రింకూ ఊపు తెచ్చాడు. 19వ ఓవర్‌లో 6,4,4తో 42 బంతుల్లో తన హాఫ్‌ సెంచరీతో పాటు జట్టుకు 17 రన్స్‌ సమకూరాయి. స్పిన్నర్‌ రాఠీ వేసిన 20వ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లతో 26 పరుగులు రాబట్టాడు. దీంతో కోల్‌కతా 150 రన్స్‌ దాటగా, 8వ వికెట్‌కు నరైన్‌తో కలిసి రింకూ అజేయంగా 62 పరుగులు జోడించాడు.

స్కోరుబోర్డు

కోల్‌కతా: రహానె (సి) మార్‌క్రమ్‌ (బి) మొహిసిన్‌ 10, సైఫర్ట్‌ (సి) ముకుల్‌ (బి) మొహిసిన్‌ 0, రఘువంశీ (అబ్‌స్ట్రక్టింగ్‌ ద ఫీల్డ్‌) 9, గ్రీన్‌ (సి) పంత్‌ (బి) మొహిసిన్‌ 34, పావెల్‌ (సి) పంత్‌ (బి) మొహిసిన్‌ 1, రింకూ సింగ్‌ (నాటౌట్‌) 83, అనుకుల్‌ (సి) బదోని (బి) మొహిసిన్‌ 0, రమణ్‌దీప్‌ (సి) మార్ష్‌ (బి) లిండే 6, నరైన్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 155/7; వికెట్ల పతనం: 1-3, 2-16, 3-27, 4-31, 5-73, 6-73, 7-93; బౌలింగ్‌: షమి 4-0-34-0, మొహిసిన్‌ ఖాన్‌ 4-1-23-5, ప్రిన్స్‌ యాదవ్‌ 4-0-24-0, దిగ్వేశ్‌ 4-0-46-0, లిండే 2-0-18-1, మార్‌క్రమ్‌ 2-0-9-0.

లఖ్‌నవూ: మార్‌క్రమ్‌ (సి) రింకూ (బి) గ్రీన్‌ 31, మార్ష్‌ (సి) పావెల్‌ (బి) అరోరా 2, పంత్‌ (సి) సైఫర్ట్‌ (బి) నరైన్‌ 42, పూరన్‌ (సి) నరైన్‌ (బి) వరుణ్‌ 9, బదోని (సి) అనుకుల్‌ (బి) వరుణ్‌ 24, ముకుల్‌ (సి) రింకూ (బి) అనుకుల్‌ 1, హిమ్మత్‌ (సి) రింకూ (బి) కార్తీక్‌ 19, లిండే (సి) రింకూ (బి) అరోరా 8, షమి (నాటౌట్‌) 11, ప్రిన్స్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 155/8; వికెట్ల పతనం: 1-8, 2-65, 3-78, 4-89, 5-93, 6-120, 7-129, 8-148; బౌలింగ్‌: అనుకుల్‌ 2-0-19-1, వైభవ్‌ అరోరా 4-0-24-2, గ్రీన్‌ 2-0-12-1, నరైన్‌ 4-0-23-1, వరుణ్‌ 4-0-33-2, కార్తీక్‌ త్యాగి 4-0-41-1.


తొలి సూపర్‌ ఓవర్‌ సాగిందిలా..

లఖ్‌నవూ (1/2) కోల్‌కతా (4/0)

పూరన్‌ (అవుట్‌) తొలి బంతి రింకూ (ఫోర్‌)

పంత్‌ (1 రన్‌) రెండో బంతి -

మార్‌క్రమ్‌ (అవుట్‌) మూడో బంతి -

బౌలర్‌: నరైన్‌ బౌలర్‌: ప్రిన్స్‌

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

పంజాబ్‌ 7 6 0 1 13 1.333

బెంగళూరు 7 5 2 0 10 1.101

హైదరాబాద్‌ 8 5 3 0 10 0.815

రాజస్థాన్‌ 8 5 3 0 10 0.602

గుజరాత్‌ 8 4 4 0 8 -0.475

చెన్నై 8 3 5 0 6 -0.121

ఢిల్లీ 7 3 4 0 6 -0.184

కోల్‌కతా 8 2 5 1 5 -0.751

ముంబై 7 2 5 0 4 -0.736

లఖ్‌నవూ 8 2 6 0 4 -1.106

ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు

ఇవి కూడా చదవండి:

అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్

Updated Date - Apr 27 , 2026 | 02:38 AM