Share News

బంగారం ఈ దిశలో పెడితే నష్టం తప్పదు.!

ABN , Publish Date - May 09 , 2026 | 04:02 PM

భారతీయ ఇళ్లలో బంగారాన్ని కేవలం ఆభరణంగా కాకుండా సంపదకు ప్రతీకగా భావిస్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఎంత బంగారం కొన్నా అది నిలవకపోవడం చాలామందిని ఆందోళనకు గురిచేస్తోంది.

బంగారం ఈ దిశలో పెడితే నష్టం తప్పదు.!
Vastu Tips For Gold

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది సంపదకు గుర్తుగా భావిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బంగారాన్ని లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా చూస్తారు. అయితే కొన్ని ఇళ్లలో ఎంత బంగారం కొన్నా అది నిలవకపోవడం, అమ్మాల్సి రావడం లేదా పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. దీనికి వాస్తు దోషాలు, జ్యోతిష్య కారణాలు కూడా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.


ఇంట్లో ప్రతికూల శక్తి ఉంటే..

వాస్తు ప్రకారం ఇంట్లో శుభ్రత చాలా ముఖ్యం. పగిలిన వస్తువులు, చెత్త, సాలెగూళ్లు ఎక్కువగా ఉంటే ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుంది. అలాంటి చోట లక్ష్మీదేవి నిలవదని నమ్మకం. దీంతో ఆర్థిక సమస్యలు పెరగడంతో పాటు బంగారం కూడా ఇంట్లో ఎక్కువకాలం నిలవకపోవచ్చు.

gold 11.jpg

బంగారం ఉంచే దిశ కూడా ముఖ్యం

వాస్తు శాస్త్రంలో దిశలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. బంగారం, వెండి వంటి విలువైన వస్తువులను దక్షిణం లేదా ఆగ్నేయ దిశలో ఉంచకూడదని చెబుతారు. ఈ దిశలను అగ్ని మూలగా భావిస్తారు. ఇక్కడ బంగారం ఉంచితే ఖర్చులు పెరగడం లేదా నష్టం జరిగే అవకాశం ఉంటుందని నమ్మకం. బంగారం వంటి విలువైన వస్తువులను నైరుతి దిశలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే సంపద స్థిరంగా ఉండి ఆర్థికంగా లాభం కలుగుతుందని చెబుతున్నారు.


జ్యోతిష్య ప్రభావం కూడా..

జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహాన్ని బంగారానికి, శుక్రగ్రహాన్ని సంపదకు అధిపతులుగా భావిస్తారు. జాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉంటే బంగారం నిలవకపోవడం, ఆభరణాలు పోగొట్టుకోవడం లేదా తరచూ విరగడం జరుగుతుందని నమ్మకం.

బంగారం నిలకడగా ఉండాలంటే..

  • ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం మంచిది.

  • ఇంటి ఈశాన్య మూలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచాలి.

  • బంగారాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి భద్రంగా ఉంచితే మంచిదని నమ్మకం.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!

For More Latest News

Updated Date - May 09 , 2026 | 04:02 PM