చర్మం పొడిబారుతోందా? ఈ బాదం క్రీమ్ ట్రై చేయండి
ABN , Publish Date - May 08 , 2026 | 05:12 PM
చర్మం మెరిసిపోవాలని చాలామంది ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతుంటారు. కానీ ఇంట్లోనే బాదం నూనె, కలబంద జెల్, విటమిన్-ఇతో సహజమైన క్రీమ్ తయారు చేసుకుని ఉపయోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడంలో సహాయపడుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: చర్మం అందంగా, మృదువుగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం చాలా మంది ఖరీదైన క్రీములు, సీరమ్‌లు వాడుతుంటారు. కానీ వాటిలో ఉండే కెమికల్స్ కొన్నిసార్లు చర్మానికి హాని కలిగించవచ్చు. అలాంటి సమయంలో ఇంట్లోనే సహజమైన పదార్థాలతో తయారు చేసే క్రీమ్ మంచి ఎంపికగా ఉంటుంది.
బాదం నూనె, కలబంద జెల్, విటమిన్-ఇతో తయారుచేసే ఈ హోమ్‌మేడ్ క్రీమ్ చర్మానికి తేమను అందించి మెరుపు తీసుకురావడంలో సహాయపడుతుంది. ఒక గిన్నెలో 4 టీస్పూన్ల బాదం నూనె తీసుకోవాలి. అందులో 4 టీస్పూన్ల కలబంద జెల్ కలపాలి. తర్వాత విటమిన్-ఇ క్యాప్సూల్స్‌లోని జెల్ వేసి బాగా కలపాలి. కొద్దిసేపు కలిపితే ఇది క్రీమ్‌లా మారుతుంది.
ఎలా వాడాలి?
ఈ క్రీమ్‌ను గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. రోజు రాత్రి పడుకునే ముందు ముఖానికి రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపించడంలో సహాయపడుతుంది.
ఉపయోగాలు
చర్మానికి తేమ అందిస్తుంది.
ముఖం మెరిసేలా కనిపించడంలో సహాయపడుతుంది.
పొడిబారిన చర్మాన్ని తగ్గించవచ్చు.
వృద్ధాప్య ఛాయలను తగ్గించడంలో సహాయపడుతుంది.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
ఈ క్రీమ్ వాడిన తర్వాత చర్మంపై దురద, ఎరుపు లేదా అలర్జీ వంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వాడటం ఆపేయాలి. సమస్య ఎక్కువైతే చర్మ వైద్యులని సంప్రదించడం మంచిది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?
వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!
For More Latest News