Share News

వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!

ABN , Publish Date - May 08 , 2026 | 03:34 PM

చికెన్‌ను వండే ముందు చాలామంది నీటితో బాగా కడుగుతారు. ఇలా చేస్తే చికెన్ శుభ్రమవుతుందని భావిస్తారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..

వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!
Chicken Washing Risks

ఇంటర్నెట్ డెస్క్: చాలామంది చికెన్‌ను వండే ముందు రెండు మూడు సార్లు నీటితో బాగా కడుగుతారు. ఇలా చేస్తే చికెన్ శుభ్రమవుతుందని, అందులోని బ్యాక్టీరియా పోతుందని అనుకుంటారు. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ను కడగడం వల్ల బ్యాక్టీరియా చనిపోవడం కాకుండా, మరింతగా వ్యాపించే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.


చికెన్‌ కడగకూడదా?

పచ్చి చికెన్‌లో సాల్మొనెల్లా, క్యాంపిలోబాక్టర్ వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉండొచ్చు. చికెన్‌ను నీటితో కడిగేటప్పుడు ఆ నీటి చుక్కలు సింక్‌, పాత్రలు, కిచెన్‌ కౌంటర్‌లపై పడతాయి. దీంతో బ్యాక్టీరియా ఇతర వస్తువులకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది ఫుడ్‌ పాయిజనింగ్‌ వంటి సమస్యలకు కారణమవుతుంది. ఇన్ఫెక్షన్లు, జ్వరం, వాంతులు వంటి ఇబ్బందులు కలిగిస్తాయి. ముఖ్యంగా.. పిల్లలు, వృద్ధులు, గర్భిణులపై మరింతగా ప్రభావం చూపిస్తాయి.

Chicken.jpg


మరి.. బ్యాక్టీరియా ఎలా?

చికెన్‌ను కడగకుండా నేరుగా వండితే అందులో ఉన్న బ్యాక్టీరియా ఏమవుతుంది అనే సందేహం చాలామందికి ఉంటుంది..కానీ, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చికెన్‌ను సరైన ఉష్ణోగ్రతలో ఉడికిస్తే హానికరమైన బ్యాక్టీరియా నశిస్తుందని చెబుతున్నారు. అందుకే చికెన్‌ను నీటితో కడగకుండా నేరుగా కుక్ చేసుకోని తినడం సురక్షితమని చెబుతున్నారు.


అలాగే, పచ్చి చికెన్‌ను తాకిన తర్వాత చేతులతో ముక్కు, కళ్లను లేదా ముఖాన్ని తాకకుండా ఉండాలని సూచిస్తున్నారు. వంట పూర్తయ్యాక చేతులను సబ్బుతో బాగా కడుక్కోవడం, ఉపయోగించిన పాత్రలు, కిచెన్ ప్రాంతాన్ని శుభ్రం చేయడం కూడా చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలాగే, పచ్చి చికెన్‌ను ఎప్పుడూ మూతపెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇతర ఆహార పదార్థాలకు తగలకుండా జాగ్రత్త పడాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

మటన్ తినడం వల్ల నిజంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుందా..

ఇంట్లో కుక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా..

For More Latest News

Updated Date - May 08 , 2026 | 03:37 PM