వాస్తు టిప్స్.. ఇంట్లో దంపతుల ఫొటోను ఎక్కడ పెట్టాలంటే..
ABN , Publish Date - May 07 , 2026 | 08:04 PM
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో భార్యాభర్తల ఫొటోను సరైన దిశలో ఉంచడం వైవాహిక జీవితానికి ఎంతో ముఖ్యమని నమ్ముతారు. తప్పు స్థానంలో ఉంచితే గొడవలు, ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుందని చెబుతారు.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో భార్యాభర్తల ఫొటోను సరైన చోట పెట్టడం చాలా ముఖ్యం. తప్పు స్థానంలో పెడితే సమస్యలు రావచ్చని చెబుతారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, భార్యాభర్తలు ఫొటో పాతదిగా ఉండకూడదు లేదా రంగు వెలిసిపోయి ఉండకూడదు. ఆకర్షణీయంగా ఉన్న ఫ్రేమ్‌ను పెట్టుకోవడం మంచిది. విరిగిన లేదా పాడైన ఫ్రేమ్‌లు ఇంట్లో ప్రతికూల శక్తిని తీసుకువస్తాయని చెబుతారు. ఫొటో పరిమాణం కూడా చాలా పెద్దగా లేదా చాలా చిన్నగా కాకుండా మధ్యస్థంగా ఉండటం మంచిది. వాస్తు ప్రకారం, దంపతుల ఫొటో లేదా పెళ్లి ఫొటోను మాస్టర్ బెడ్‌రూమ్‌లో నైరుతి గోడపై పెట్టడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ఇది సంబంధాలలో స్థిరత్వాన్ని, బంధాన్ని బలపరుస్తుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రదేశాల్లో ఫొటోలు పెట్టడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. పడకగదికి ఎదురుగా ఉన్న గోడపై ఫొటోలు పెట్టడం సరికాదు. అలాగే దేవాలయం లేదా పూజ గదికి సరిగ్గా ఎదురుగా దంపతుల ఫొటో ఉంచకూడదు. వంటగది, వాష్ రూం గోడలపై ఫొటోలు పెట్టడం కూడా మంచిది కాదు. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఫొటోలు ఉంచడం వాస్తు దోషంగా పరిగణిస్తారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
రోజూ సంగీతం వినడం వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలో
ఇతరుల మాటలు వినడం.. మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా?
For More Latest News