Share News

టోల్ కట్టడంలో ఆలస్యం చేస్తే రెట్టింపు బాదుడు తప్పదు

ABN , Publish Date - May 08 , 2026 | 07:35 PM

నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు NHAI కీలక హెచ్చరిక జారీ చేసింది. బారియర్ లెస్ టోల్ విధానంలో టోల్ చెల్లింపులో ఆలస్యం చేస్తే రెట్టింపు మొత్తం చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

టోల్ కట్టడంలో ఆలస్యం చేస్తే రెట్టింపు బాదుడు తప్పదు
NHAI New Toll Rules

ఇంటర్నెట్ డెస్క్: నేషనల్ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు NHAI కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా బారియర్ లెస్ టోల్ విధానం అమల్లో ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే వారు ఇకపై టోల్ చెల్లింపుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. గడువు దాటితే టోల్ మొత్తాన్ని రెట్టింపుగా చెల్లించాల్సి వస్తుందని అధికారులు చెబుతున్నారు.


దేశంలో తొలిసారిగా రాజస్థాన్‌లోని మనోహర్‌పూర్, తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ టోల్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఈ విధానంలో టోల్ ప్లాజా వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం ఉండదు. వాహనం నేరుగా వెళ్లిపోయినా, టోల్ మొత్తం ఆటోమేటిక్‌గా ఫాస్టాగ్ ద్వారా కట్ అవుతుంది.

బారియర్ లెస్ టోల్ ఎలా పనిచేస్తుంది?

ఈ సిస్టమ్‌లో లైడార్ (LiDAR) టెక్నాలజీ, కెమెరాలను ఉపయోగిస్తారు. వాహనం టోల్ గాంట్రీ కింద నుంచి వెళ్లేటప్పుడు సిస్టమ్ నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి, వాహనం వివరాలను గుర్తిస్తుంది. తర్వాత ఫాస్టాగ్‌కు లింక్ చేసి టోల్ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా డిడక్ట్ చేస్తుంది.

డబుల్ ఛార్జ్ ఎప్పుడు పడుతుంది?

ఫాస్టాగ్‌లో బ్యాలెన్స్ లేకపోవడం, ట్యాగ్ ఇన్‌యాక్టివ్‌గా ఉండటం లేదా టెక్నికల్ సమస్యల కారణంగా కొన్నిసార్లు టోల్ కట్ కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో వాహన యజమానికి ఇ-నోటీస్ పంపిస్తారు. ఆ నోటీస్ వచ్చిన తర్వాత 72 గంటలలోపు బకాయి చెల్లిస్తే సాధారణ టోల్ మొత్తం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. కానీ గడువు దాటితే అదే మొత్తం డబుల్‌గా మారుతుంది.


బకాయిలు ఎలా చెక్ చేయాలి?

వాహనదారులు అధికారిక పోర్టల్‌లో వాహనం నంబర్ ఎంటర్ చేసి టోల్ బకాయిలను చెక్ చేసుకోవచ్చు. నకిలీ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • ప్రయాణానికి ముందు ఫాస్టాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలి.

  • యాక్టివ్ ఫాస్టాగ్ వాడాలి.

  • ఇ-నోటీసులు వచ్చిన వెంటనే స్పందించాలి.

  • అనుమానాస్పద లింకులను ఓపెన్ చేయకూడదు.

హైవేపై వేగంగా ప్రయాణించడం మాత్రమే కాదు.. టోల్ చెల్లింపుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.


Also Read:

మామిడి పండ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుందా?

వండే ముందు చికెన్‌ను కడుగుతున్నారా? ఆరోగ్యానికి హానికరం!

For More Latest News

Updated Date - May 08 , 2026 | 07:47 PM