Share News

ఫిట్‌నెస్‌ అలవాటుగా మారాలి!

ABN , Publish Date - Nov 15 , 2026 | 08:19 AM

స్క్రీన్‌పై స్టైలిష్‌ లుక్‌తో కనిపించే దుల్కర్‌ సల్మాన్‌ ఫిట్‌నెస్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. వర్కవుట్స్‌ నుంచి డైట్‌ వరకు.. యోగా నుంచి లైఫ్‌స్టైల్‌ వరకు... అతడి ఫిట్‌నెస్‌ మంత్ర ఆసక్తికరం.

ఫిట్‌నెస్‌ అలవాటుగా  మారాలి!
Dulquer Salmaan

స్క్రీన్‌పై స్టైలిష్‌ లుక్‌తో కనిపించే దుల్కర్‌ సల్మాన్‌ ఫిట్‌నెస్‌ విషయంలో పర్‌ఫెక్ట్‌గా ఉంటారు. వర్కవుట్స్‌ నుంచి డైట్‌ వరకు.. యోగా నుంచి లైఫ్‌స్టైల్‌ వరకు... అతడి ఫిట్‌నెస్‌ మంత్ర ఆసక్తికరం. తాజా చిత్రం ‘ఆకాశంలో ఒక తార’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న దుల్కర్‌ స్మార్ట్‌ లుక్‌ సీక్రెట్స్‌ అతడి మాటల్లోనే...

తప్పకుండా జిమ్‌కు...

షూటింగ్‌ ఉన్నా లేకపోయినా ప్రతీరోజూ వ్యాయామానికి సమయం కేటాయిస్తా. కార్డియో, వెయిట్‌ ట్రైనింగ్‌ వంటివి ఫిట్‌నెస్‌ రొటీన్‌లో భాగం. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్తా. ముఖ్యంగా లెగ్‌ వర్కవుట్స్‌, అప్పర్‌ బాడీ కండరాలను టోన్‌ చేసుకునే వ్యాయామాల మీద దృష్టి పెడతా. పాత్రకు అనుగుణంగా నా ఫిట్‌నెస్‌ లక్ష్యాలను మార్చేస్తుంటా.


book2.3.jpgఒత్తిడి తగ్గాలంటే...

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత చాలా ముఖ్యం. అందుకే యోగా, మెడిటేషన్‌ చేస్తుంటా. బిజీ షెడ్యూల్‌లో ఒత్తిడిని తగ్గించు కోవడానికి ఇవి ఉపయోగపడతాయి. నిద్ర సరిగా లేకపోయినా ఒత్తిడి అనిపిస్తుంది. అందుకే రోజుకు 7 నుంచి 8 గంటలు నిద్రపోతా.


ఏడిస్తే మంచిదే...

మగవాళ్లంటే ఏడవొద్దంటారు. దానికి నేను వ్యతిరేకం. ఏడిస్తే ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుంది. ఒత్తిడి లేకపోతే యంగ్‌గా కనిపిస్తాం. నాకయితే కాస్త ఎమోషనల్‌ కాగానే ఏడుపొచ్చేస్తుంది. నేను ప్రొడ్యూస్‌ చేసిన ఒక సినిమా ఫ్లాప్‌ అయితే బాగా ఏడ్చా. నాకు కూతురు పుట్టినప్పుడూ సంతోషంతో ఏడ్చేశా. సెంటిమెంట్‌ సినిమా చూస్తే కూడా కళ్లలో నీళ్లొస్తాయి. నేను కొంచెం ఎమోషనల్‌ పర్సన్‌ని.


book2.4.jpgతగినంతగా నీరు తాగాల్సిందే...

కప్పు కాఫీతో నా డే మొదలవుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, అవకాడో, గుడ్లు తింటా. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో... ప్రొటీన్‌, కార్బోహైడ్రేట్లు ఉండేలా చూసుకుంటా. వర్కవుట్‌కు ముందు అరటిపండు తిని, వ్యాయామం తర్వాత ప్రొటీన్‌ షేక్‌ తాగుతా. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి తగినంత నీరు తాగుతా. అందుబాటులో ఎప్పుడూ వాటర్‌ బాటిల్‌ ఉండాల్సిందే.


ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌

నేనే కాదు... నా చుట్టూ ఉన్నవాళ్లూ ఫిట్‌గా ఉండాలనుకుంటా. అందుకే 2020 లాక్‌డౌన్‌ సమయంలో హ్యాష్‌ట్యాగ్‌ ట్రైనింగ్‌ డన్‌ అనే ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ ప్రారంభించా. జిమ్‌లు మూతపడినా ఇంట్లోనే వ్యాయామం చేయాలని రానా, కాజల్‌ అగర్వాల్‌, అదితిరావు హైదరీకి ఛాలెంజ్‌ విసిరా. వ్యాయామం చేయడం ఒక అలవాటుగా మార్చుకోవాలనే సందేశంతోనే ఈ ఛాలెంజ్‌ను ప్రారంభించా.


book2.2.jpgఅమ్మ చేతి వంట... అదుర్స్‌...

వారంలో ఒకటి లేదా రెండు రోజులు చీట్‌ డైట్‌ పాటిస్తా. అప్పుడు నచ్చింది తింటా. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. రోజూ బిర్యానీ పెట్టినా తినేస్తా. అమ్మ చేసే తలసెరీ బిర్యానీ, ఫిష్‌ బిర్యానీ తింటుంటే స్వర్గం కనిపిస్తుంది. మలయాళీ డిష్‌లో పత్రి అని చేస్తారు. అంటే.. రైస్‌ చపాతీ అనుకోండి. దాంట్లో కొబ్బరిపాలు పోసుకొని చికెన్‌, మటన్‌ కర్రీతో లాగించేస్తా.


ఈ వార్తలు కూడా చదవండి:

ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

శ్రీవారి రూపాన్ని గీసిన తొలి చిత్రకారుడు కన్నుమూత

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Nov 15 , 2026 | 08:25 AM