Share News

ఆయన గ్లామర్‌ సీక్రెట్‌ అడుగుతా...

ABN , Publish Date - Jun 28 , 2026 | 07:52 AM

తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్‌ తొలిసారిగా స్ట్రయిట్‌ సినిమా చేస్తోంది.

ఆయన గ్లామర్‌ సీక్రెట్‌ అడుగుతా...
Deepa Thomas

తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్‌ తొలిసారిగా స్ట్రయిట్‌ సినిమా చేస్తోంది. అది కూడా సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు సమర్పణలో. సత్యదేవ్‌ హీరోగా రాబోతున్న ‘రావు బహద్దూర్‌’ విడుదల సందర్భంగా ఆమె చెబుతున్న కబుర్లివి...

అనుకోకుండా...

బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన తర్వాత అనుకోకుండా మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టాను. మొదట మిస్‌ మిలీనియల్‌ అందాల పోటీలో పాల్గొన్నా. అందులో టాప్‌ 10 లిస్టులో నిలిచా. ఆ తర్వాత మిస్‌ సౌత్‌ ఇండియా పోటీలో సెకండ్‌ రన్నరప్‌ టైటిల్‌ గెలుచుకున్నా. అప్పటి నుంచి ఇదే రంగంలో కొనసాగాలని ప్రయత్నాలు చేశా. రాక్‌ పేపర్‌ సీజర్స్‌ అనే వెబ్‌సిరీస్‌తో నా కెరీర్‌ ప్రారంభమైంది. వైరస్‌ సినిమాతో మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. హోమ్‌ సినిమాతో నాకు గుర్తింపు వచ్చింది. తెలుగులో ఇదే నా మొదటి సినిమా.


ఆయన్ని కలిస్తే...

తెలుగు హీరోల్లో నాని అంటే చాలా ఇష్టం. హీరోయిన్లలో నిత్యామీనన్‌ని ఇష్టపడతా. ప్రస్తుతం మా సినిమాను (రావు బహద్దూర్‌) ప్రజెంట్‌ చేస్తున్న సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు అంటే పిచ్చి. ఆయన్ని నేనిప్పటిదాకా కలవలేదనుకోండి. కలిస్తే మాత్రం ఆయన గ్లామర్‌ సీక్రెట్‌ అడుగుతాను. అల్లు అర్జున్‌ సినిమాలు మిస్సవకుండా అన్నీ చూశా.


book2.1.jpgభోజన ప్రియురాలిని...

నేను మంచి భోజనప్రియురాలిని. అలాగని ఫిట్‌నెస్‌ విషయంలో అశ్రద్ధ చేయను. ప్రతీరోజూ జిమ్‌లో గంటయినా గడపాల్సిందే! మా అమ్మ చేతి వంటంటే చాలా ఇష్టం. వర్షం పడుతున్నప్పుడు మా దగ్గర (కేరళ) అరటికాయతో పరంపొరి అని చేస్తారు. వాటిని తింటూ చాయ్‌ తాగుతుంటే ఆ మజానే వేరబ్బా!

డ్రీమ్‌ రోల్స్‌...

నాకు రెండు డ్రీమ్‌రోల్స్‌ ఉన్నాయి. ఏదైనా సినిమాలో క్రీడాకారిణిగా, అలాగే ఇన్‌స్పైర్‌ చేసే వ్యక్తుల బయోపిక్‌లో నటించాలనే కోరిక ఉంది. అవి ఎప్పటికి తీరుతాయో?


book2.2.jpgఫ్యాషన్‌ బ్రాండింగ్‌...

సినిమాల్లోకి రాకపోతే ఫ్యాషన్‌ డిజైనర్‌ అవ్వాలనుకున్నా. బేసిగ్గా నాకు రకరకాల దుస్తుల గురించి తెలుసుకోవడం, వాటిని ధరించడమంటే చాలా ఇష్టం. ఒకరికి నప్పేలా బట్టలు డిజైన్‌ చేయడంలో గొప్ప అనుభూతి ఉంటుంది. అలాగే నాకు నచ్చేలా డ్రెస్‌ వేసుకొని, నలుగురూ దాని గురించి మాట్లాడుకోవాలని కోరుకుంటా. ఈ మధ్యనే సొంతంగా ఒక క్లాతింగ్‌ బ్రాండ్‌ మొదలుపెట్టా. దాని ద్వారా నా అభిరుచిని తెలియజేయాలనుకుంటున్నా.


అదే నా ఫిలాసఫీ..

ఏది జరిగినా దాన్నలా జరగనివ్వండి. ఒక్కొక్కరూ ఒక్కోలా మన గురించి మాట్లాడుతుంటారు. వాళ్ల గురించి మన అలవాట్లు మార్చుకోవాల్సిన పనిలేదు. ఎవరినీ మెప్పించడానికి జీవించకండి. మీ కోసం మీరు జీవించండనేది నా ఫిలాసఫీ. సంతోషకర విషయమైనా, బాధపెట్టే విషయమైనా... నా జీవితంలో జరిగే ప్రతిదీ ఒక పుస్తకంలో రాసుకుంటా. ఈ అలవాటు వల్ల నాలో ఒత్తిడి తగ్గుతుంది.


book2.3.jpgవారి సేవలకు సలామ్‌...

నేను నర్సుగా కూడా కొంతకాలం పనిచేశా. ఆ వృత్తిలో తృప్తి దొరుకుతుందనిపిస్తుంది. ఒక నర్సుగా పనికి తగ్గ జీతం పొందకపోయినా... నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అనారోగ్యంతో ఉన్నవారిని జాగ్రత్తగా చూసుకోవడం కోసం నర్సులు తమ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు. అందుకే నర్సు వృత్తిలో ఉన్నవారు అత్యధిక జీతానికి అర్హులనే అభిప్రాయం నాకుంది. వారిలాంటి సేవ ఎవరు చేస్తారు చెప్పండి.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 07:54 AM