వారఫలాలు.. ఏ రాశి వారికి ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - May 24 , 2026 | 08:03 AM
ఈ వారం రాశిఫలాలు.. 24 - 30 మే 2026, పి.ప్రసూనా రామన్ ఆ రాశివారికి ఈ వారం రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది.
ఈ వారం రాశిఫలాలు.. 24 - 30 మే 2026
పి.ప్రసూనా రామన్
ఆ రాశివారికి ఈ వారం రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది.
మేషం
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం
కార్యసిద్ధికి మరింత శ్రమించాలి. పట్టుదలతో మెలగండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. నేడు అనుకూలించనిది రేపు ఫలిస్తుంది. ఖర్చులువిపరీతం. రుణాలు, చేబదుళ్లు తప్పవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. ఫోన్ సందేశాలను పట్టించుకో వద్దు. ఆత్మీయులతో సంభాషిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు
రుణఒత్తిడి ఆందోళన కలిగిస్తుంది. అన్యమస్కంగా గడుపుతారు. మొక్కు బడిగా పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ఖర్చు తగులుతుంది. సాయం అర్థించేందుకు మనస్కరించదు. అవసరాలు వాయిదా పడతాయి. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. ఆప్తులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. నోటీసులు అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు
పెద్దల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. కలిసివచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చు కోండి. అనుమానాలకు గురికావద్దు. ఇంటివిష యాలపై దృష్టిపెడతారు. కావలసిన పత్రాలు కనిపించవు. చిన్న విషయానికే చికాకుపడతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఖర్చులు విపరీతం. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు.
కర్కాటకం
పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు ప్రోత్సాహ కరంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. అపోహలకు తావివ్వవద్దు. ఒత్తిడి పెరుగకుండా చూసుకోండి. పనులు ఒక పట్టాన సాగవు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. ఆశావహదృక్పథంతో మెలగండి. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు.
సింహం
మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లావాదేవీలు ఫలిస్తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. సన్నిహితులకు సాయం చేస్తారు. సంస్థల స్థాపనలకు అను కూలం. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఇంటి విష యాలు పట్టించుకుంటారు. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి ప్రముఖులకు చేరువవుతారు. సాహసకృత్యాలకు పాల్పడవద్దు.
కన్య
ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు
శ్రమాధిక్యత మినహా ఫలితం ఉండదు. కొందరి వ్యాఖ్యలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఎదుటి వారి తీరును గమనించి మెలగండి. ఊహించని ఖర్చు తగులుతుంది. అవసరాలు అతి కష్టంమీద నెరవేరుతాయి. మీ ఇష్టాయి ష్టాలను స్పష్టంగా తెలియజేయండి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు.
తుల
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు
అన్ని విధాలా యోగదాయకం. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. లక్ష్యానికి చేరువవుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పనుల్లో శ్రమ అధికం. ప్రముఖులను కలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. ధనసహాయం తగదు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. పత్రాలు అందుకుంటారు. ప్రయాణం అనుకూలిస్తుంది.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
వ్యవహారాలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచితనిర్ణయాలు తగవు. నిపుణుల సలహా పాటించండి. పొదుపు ధనం అందుకుంటారు. ఆప్తులతో తరచూ సంభాషిస్తుంటారు. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఒక వార్త సంతోషం కలిగిస్తుంది. నోటీసులు అందుకుంటారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం
రావలసిన ధనం అందు తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా స్థిమితపడతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త పనులు చేపడతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. మీ జోక్యం అనివార్యం. మీ నిర్ణయం ఆమోద యోగ్యమవుతుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. బాధ్యతలు అప్పగించవద్దు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో తొందరపాటు తగదు. అనుభవజ్ఞులను సంప్రదించండి. భేషజాలకు పోవద్దు. ఖర్చులు విప రీతం. వాయిదాల చెల్లింపుల్లో జాప్యం తగదు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహ పరుస్తుంది. కొత్తయత్నాలకు శ్రీకారం చుడ తారు. మీ కలుపుగోలుతనం ఆకట్టుకుంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. కష్టానికి తగిన ప్రతిఫలం అందు తుంది. పనులు చురుకుగా సాగుతాయి. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. అవివాహితులకు శుభయోగం. ఆరోగ్యం కుదుటపడుతుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రుణసమస్య తొలగుతుంది. మానసికంగా స్థిమితపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ప్రణాళికాబద్థంగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తుల రాక సంతోషం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవు తాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. అందరితోనూ మితంగా సంభాషించండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
దారుణం.. మహిళను కొరికి చంపిన పెంపుడు కుక్కలు..
వడదెబ్బతో ఒక్కరోజే 40 మంది మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News