Share News

ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే...

ABN , Publish Date - Apr 19 , 2026 | 06:37 AM

కాలం మారుతున్న కొద్ది అలియాభట్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. నటిగా, స్టార్‌ భార్యగా, చిన్నారికి తల్లిగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా మారింది.

ఎవరికి వారు నేర్చుకోవాల్సిందే...
Alia Bhatt

కాలం మారుతున్న కొద్ది అలియాభట్‌లో కూడా చాలా మార్పు వచ్చింది. నటిగా, స్టార్‌ భార్యగా, చిన్నారికి తల్లిగా, వ్యాపారవేత్తగా బిజీగా ఉంటూనే నిర్మాతగా కూడా మారింది. తొలిసారిగా స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఆల్ఫా’తో యాక్షన్‌లోకి దిగుతున్న... ఈ జాతీయ ఉత్తమనటి ఇటీవల వెలిబుచ్చిన అభిప్రాయాలివి...

రెండు నచ్చితేనే...

నటిగా ప్రతీ సినిమాకు నన్ను నేను మార్చుకుంటున్నా. ఫలానా నిలిచేపోయే పాత్ర చేయాలనుంది అని నేను చెప్పలేను. ఒక పాత్రకు నేను ఓకే చెప్పడానికి రెండు కారణాలుంటాయి. ఒకటి... అలాంటి జానర్‌లో ఇంతకు ముందు ఎవరూ చేసి ఉండకూడదు... కనీసం మనదేశంలో. రెండోది కథ నాకు నిజంగా నచ్చాలి. ఆ కథలో నా పాత్ర నాకే కొత్తగా అనిపించాలి. నేను చేస్తున్న ‘ఆల్ఫా’ చిత్రం ఒక పాప్‌కార్న్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌. వినోదభరితంగా ఉంటుంది. ఈ సినిమాలో నన్ను ప్రేక్షకులు విపరీతంగా ఇష్టపడతారు.


సాధన చేయాల్సిందే...

వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌ గురించి ప్రత్యేకంగా సూత్రం ఏమీ ఉండదు. అది సమయాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఒకవైపు పనిచేస్తూనే జీవితాన్ని బ్యాలెన్స్‌ ఎలా చేసుకోవాలో ఎవరికి వారుగా నేర్చుకోవాల్సిందే. ఒక రిథమ్‌ వచ్చేదాకా నేర్చుకుంటూనే ఉండాలి. నా కూతురు రాహాకు ప్రస్తుతం మూడున్నరేళ్లు. ఆమె ఏడాది వయసున్నప్పుడు తల్లిగా నేను ఒకరకమైన ఛాలెంజ్‌ను ఎదుర్కొంటే, ఇప్పుడు మరో రకమైన సవాళ్లుంటాయి. అందుకే పేరెంటింగ్‌ అనేది నిరంతరం సాధన చేయాల్సిందే.


book1.2.jpgటీమ్‌ ఎఫర్ట్‌ను నమ్ముతా...

మా అమ్మ (సోనీ రజ్దాన్‌) నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఆమె ఎంతో కష్టపడి నన్ను, నా సోదరిని పెంచింది. ఈ క్రమంలో ఆమెలోని నటిని సానబెట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ మానలేదు. నాటకాలు, టీవీ, సినిమాల్లో నటిస్తూ తన ఉనికిని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంది. టీమ్‌ ఎఫర్ట్‌ను నేను నమ్ముతా. ఒకవేళ నేను క్రీడాకారిణిని అయితే తప్పకుండా టీమ్‌ స్పోర్ట్‌లోనే ఉండేదాన్నేమో.


మై ఛాయిస్‌

ప్రస్తుతం చదువుతున్న పుస్తకం: ది పేరెంట్స్‌ టావో టీ చింగ్‌: ఆన్సియెంట్‌ అడ్వయిజ్‌ ఫర్‌ మోడర్న్‌ పేరెంట్స్‌

చూస్తున్న షో: లవ్‌స్టోరీ ది ఎఫ్‌ఎక్స్‌ షో

అభిరుచి: చార్‌కోల్‌తో పెయింటింగ్స్‌ బాగా వేస్తా.


book1.3.jpgస్పష్టత ఉంది...

కెరీర్‌ ప్రారంభంలో అంటే... ‘హైవే’లో నటిస్తున్నప్పుడు నేను నా 19వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నా. అప్పుడు బుర్రలో ఆలోచనలన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. నాకు నచ్చింది కాకుండా బయటి నుంచి వచ్చే అభిప్రాయాలను పట్టించుకునేదాన్ని. అయితే రాను రాను అనుభవంతో పాటు రాటుదేలాను. ప్రస్తుతం నా వయసు 33. ఎంచుకునే పాత్రలు కానీ, జీవితంపై కానీ స్పష్టమైన అభిప్రాయంతో ముందుకు సాగుతున్నా. నా ఆలోచనల్లో చాలా స్పష్టత ఉంటుంది.


book1.4.jpgఇంట్లో చిన్నపిల్లాడే...

నా భర్త (రణ్‌బీర్‌ కపూర్‌) ఎంత పెద్ద స్టార్‌ అయినా ఇంటికొచ్చేసరికి సామాన్యుడిలా మారిపోతాడు. మాకు పాప పుట్టినప్పటి నుంచి ఆయన ఆ చిన్నారి చుట్టే తిరుగుతున్నాడు. ఆయనను ‘హ్యాండ్స్‌ ఆన్‌’ ఫాదర్‌ అనొచ్చేమో. పదిమందిలో వెనక్కి తగ్గి ఉండే రణ్‌బీర్‌... పాప ముందు మాత్రం చిన్న పిల్లాడిలా మారి, తనను తాను మర్చిపోయి ఆడుతుంటాడు.


ఈ వార్తలు కూడా చదవండి:

దక్షిణాదికి ముందుంది ముప్పు!

ఆ ఇద్దరు ఎక్కడ

Read Latest Telangana News and National News

Updated Date - Apr 19 , 2026 | 06:37 AM