Share News

ఏపీ రైతుకు కేంద్రం అండ!

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:57 AM

వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ రైతుకు కేంద్రం అండ!

  • పప్పుధాన్యాల సేకరణ పరిమితి పెంపు

  • 94,500 టన్నుల నుంచి 1.13 లక్షల టన్నులకు

విశాఖపట్నం, న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మన రాష్ట్రంలో పప్పు ధాన్యాల సేకరణ పరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 94,500 టన్నుల ఉత్పత్తులను రైతుల నుంచి సేకరించాలని గతంలో కేంద్రం నిర్ణయించింది. ఈ పరిమితిని 1.13 లక్షల టన్నులకు పెంచాలని ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన క్యాబినెట్‌ నిర్ణయించింది. ఉత్తరప్రదేశ్‌లో రైతుల నుంచి రూ. 6,500 కోట్ల విలువైన బంగాళాదుంప పంటను ఎమ్‌ఐపీ(మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ప్రైస్‌) ధరకు సేకరించాలని నిర్ణయించారు. కర్ణాటకలో కందిపప్పు సేకరణ గడువును మే 15 వరకు పొడిగించారు. అక్కడి రైతుల నుంచి పీఎ్‌సఎస్‌ (ప్రైస్‌ సపోర్ట్‌ స్కీమ్‌) ప్రకారం కొనుగోలు చేయనున్నట్టు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

Updated Date - Apr 19 , 2026 | 04:57 AM