ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆ ముసుగు మనిషెవరు?
ABN , Publish Date - Jul 12 , 2026 | 05:01 PM
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. అయితే.. ఇప్పుడు చర్చంతా అందులో పాల్గొన్న ఓ వ్యక్తి గురించే నడుస్తోంది. ముఖానికి మాస్క్ ధరించి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నదెవరనే విషయం సర్వత్రా ప్రశ్నార్థకమవుతోంది.
ఇంటర్నెట్‌డెస్క్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఓ వ్యక్తి ముఖానికి మాస్క్ వేసుకుని ప్రముఖునిగా వ్యవహరించం సహా ఆ కుటుంబంలోని పసిబిడ్డ మృతదేహాన్నీ మోయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బేస్‌బాల్ క్యాప్, ముఖానికి నల్లటి ముసుగు ధరించి ఉన్న ఆ వ్యక్తి ఫొటోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతున్నాయి.
ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన ఆ వ్యక్తి బహుశా అలీ ఖమేనీ కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అయి ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కావాలనే ఇలా రహస్యంగా వచ్చి ఉంటారని పలువురు భావిస్తున్నారు. అయితే.. ముసుగులో ఉన్న ఆ వ్యక్తి అయతుల్లా అలీ ఖమేనీ పెద్ద మనవడు(పెద్ద కుమారుడైన ముస్తఫా తనయుడు) మహమ్మద్ జావెద్ ఖమేనీ అని ఇరాన్‌కు చెందిన ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది. ఫిబ్రవరి 28న అమెరికా చేసిన దాడిలో జావెద్ శరీరం కాలిపోయిందని, అందువల్లే ఇలా మాస్క్ ధరించారని పేర్కొంది. అయితే ఈ ప్రచారంపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఇక.. తండ్రి మృతికి ప్రతీకారం తీర్చుకుంటానని సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ అన్నారు. తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి తప్పనిసరిగా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు కఠిన పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇది దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అన్న మొజ్తాబా.. దీనిని కచ్చితంగా నెరవేరుస్తానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు.
ఇవీ చదవండి:
గానగాంధర్వి జానకి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. జులై 19న ఆల్-పార్టీ మీటింగ్